బలి అనగా దైవప్రీతి కోసం ఏదో ఒక జీవాన్ని చంపే ఒక క్రతువు.బలి ఎందుకు?బలులు అవసరమా అనవసరమా అనే విషయంపై రకరకాల వాదాలు వివరణలూ ఉన్నాయి..

తమిళనాడు లో ఒక దేవాలయ ఉత్సవంలో మేకను బలి ఇస్తున్న దృశ్యం

బలి కావాలిసవరించు

జంతు బలులు వైదిక ప్రామాణికాలు, బలులకు చాలా ప్రాధాన్యం ఉంది.కానీ ఇప్పటి వైదిక పురోహితులు బౌద్ధ, క్రైస్తవ ప్రభావంలో పడి బలులు ఆచరించడం లేదు.ఏయే క్రతువుల్లో జంతు బలి అవసరమో ఆయా క్రతువుల్లో ఏయే దేవతలకి ఏబలి అవసరమో ఆయా దేవతలకు ఆయా జంతుమాంసాలని ఇప్పటికీ సమర్పిస్తూనే ఉన్నారు.కొన్ని దేవతల్ని సంతృప్తిపఱచడానికి నరబలి కూడా చెయ్యాలి. మన దృష్టిలో మనం మనుషులం.కానీ దేవతల దృష్టిలో మనం అన్ని జంతువుల లాంటివాళ్ళమే. మన దృష్టిలో జంతువులు ఏ విధంగానైతే తినదగినవో, అదే విధంగా ఆ దేవతల దృష్టిలో మన ప్రాణశక్తి కూడా హరించదగినదే. ప్రాజెక్టులూ, సినిమాహాళ్ళూ, ఫ్యాక్టరీలూ వంటి పెద్దపెద్ద కట్టడాలు కట్టినప్పుడు ఇప్పటికీ నరబలిని ఆచరిస్తున్నారు. అందుకోసం అంగవైకల్యాలు లేని అబ్బాయిల్ని, పెళ్ళికాని, కన్యలను బలి ఇస్తారు. దసరా, బక్రీదు లాంటి పండుగలలో కూడా విస్తారంగా బలులిస్తున్నారు.ఎందుకంటే అలా బలైన జంతువులకు పుణ్యఫలం దక్కుతుంది.బలి ఇచ్చినవారి విదేయతకు మెచ్చి దైవం కరుణిస్తుంది.మహానైవేద్యంలో అన్నాన్ని అగ్నిలో వేల్చడం ద్వారా మేఘ సంవర్ధనం జరిగి సకాలంలో వర్షాలు కురుస్తాయి.అదృశ్యశక్తులు మాంసప్రియులు. శాస్త్రోక్తంగా కర్మకాండ మొత్తం నిర్వహించినప్పుడు వారు ఆ బలుల్ని స్వీకరించి మానవుల కోరికలు తీఱుస్తారు.

బలి వద్దుసవరించు

ఎన్నో రకాల జంతువులు మన దేవుళ్ళకు వాహనాలు.వాటిని బలి ఇవ్వకూడదు.ఏరువాక పున్నమికి జంతువులను పూజిస్తారు.బుద్ధుడు, శంకరాచార్యులు, క్రీస్తు, జైనులు, పతంజలి .. బలులు వద్దన్నారు.బలులన్నీ నిరర్ధక హత్యలే.బలులు మాని ఉపవాసాలు చెయ్యటం ఉత్తమం.విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి.బలి కంటే భక్తే శ్రేష్ఠం.హింస ద్వారా జరిగిన కార్యక్రమాలు కష్టాలే మిగిల్చాయి. అశ్వమేధ యాగం చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమయినవై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.యజ్నం అంటే భోజనం.మహా నైవేద్యం అంటే అన్నదానం చేసి కాలేకడుపుల ఆకలి తీర్చటం.బలి అంటే జంతు బలి కాదు.ధ్వజ స్తంభం ముందు బలి పీఠం పైన స్వామి వారి నైవేద్యం భూత తృప్తికై వేయటం.

అబ్రహాం సంప్రదాయంలో బలిసవరించు

మొక్కుల రూపంలో వేల పొట్టేళ్లను ఒంటెలను పశువులను బలి చేస్తున్నారు.జంతువులను చంపండి నరకండి కొయ్యండి బలి ఇవ్వండి లాంటి సందేశాలు హిందూ, క్రైస్తవ మతాల లేఖనాల్లో కూడా ఉన్నాయి.అయితే నాగరికత పెరిగేకొద్దీ అలాంటి హింసా ప్రబోదాత్మక వాక్యాలను ఆయా మతాలలోని అహింసావాదులు పాటించటం మానేశారు.బుద్ధుడి అహింసా సిద్ధాంతం దెబ్బకు హిందూ పూజారులు యాగపశువుల్ని వదిలేసి శాకాహారులైతే, పౌలు ప్రభావంతో క్రైస్తవులు జంతుబలుల బదులు హృదయబలికి మళ్ళారు.మాంసాహారం అవసరమే కానీ దేవుళ్ళు దేవతల పేరుతో జంతువులను బలి చేయటం ఆపి, మన ఆహారం కోసం మాత్రమే వాటిని వాడుకుంటే చాలు.బలి కోరే దేవుళ్ళ మీద భక్తి కంటే భయమే ఎక్కువ కలుగుతుంది.బలికి ప్రత్యామ్నాయం ఉపవాస ప్రార్థనే అని నా అభిప్రాయం.బలిదానం ఇవ్వలేనివారు హజ్‌ కాలంలో మూడురోజులు, ఇంటికి తిరిగొచ్చిన తరువాత ఏడురోజులు చొప్పున మొత్తం పదిరోజులు ఉపవాసం ఉండాలి. (బఖరా 2:196).జంతువులను బలి ఇవ్వలేని కాబేతరులకు అల్లాహ్ ఇచ్చిన ఉపవాసప్రార్థనోపాయం అందరికీ ఫలదాయకమేనని నా నమ్మకం.జంతుబలి కంటే ఉపవాస ప్రార్థన మేలైనది. జంతువును ఆహారంకోసం కోసుకు తినటం వేరు, ఆచారం కోసం మనకు ఏ కీడూ చెయ్యని జంతువులను బలిచేయటం వేరు.దేవుడి పేరు చెప్పుకొని మాంసాన్ని హాయిగా ఆరగించేది మాత్రం మనమే."వాటి రక్తమాంసాలు అల్లాను చేరవు.కేవలం మీ భయభక్తులు మాత్రమే చేరతాయి" (హజ్ :37) ఇబ్రాహీము గారు తన కొడుకుకు బదులుగా బలి ఇవ్వటానికి దేవుడు స్వర్గం నుంచి గొర్రెను పంపాడు.అది ఇహలోక గొర్రె కాదు.మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే అన్నట్లు 'దేవుడికి బలి ఇచ్చాం' అనేకంటే 'పండగ పూట కోసుకుతిన్నాం' అని చెప్పుకోవటం సమంజసం.పండుగ సంప్రదాయం కోసం జంతువులను బలి ఇచ్చి మనుషులు తమ పాపాలు పొయ్యాయని తమంతట తామే అనుకుంటున్నారు.బలైన జంతువుకున్న ఒక్కో వెంట్రుకకు బదులుగా ఒక్కో పుణ్యం లభిస్తుందట.ఖుర్బానీ మొదటి రక్తపు బొట్టు బదులు మన గతపాపాలు క్షమించబడతాయట.జంతుబలి ద్వారా పాపాలు పోతుంటే ఏటేటా ఖుర్బానీ ఇవ్వకుండా ఎవరైనా ఆగుతారా? ఖుర్బానీ జంతువుల్ని చాలా ప్రేమగా చూడాలట.పుష్టిగా మేపాలట.ఎందుకో?.పైగా మన స్వహస్తాలతో దాన్ని కొయ్యాలట.మాంసం కొట్టు కెళ్ళి కొనుక్కొచ్చుకొని తింటాం గానీ మనల్నే కొయ్యమంటే కొయ్యగలమా?మన వల్లకాదు. దయ కంటే పుణ్యం లేదు, నిర్దయ కంటే పాపంలేదు.వీలైతే చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయటం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం మానవాళికి మంచిది.అల్లా అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు కాబట్టి జంతువులను తనకు బలి ఇవ్వకపోయినా ఏమీ ఆగ్రహించడనే అనిపిస్తుంది.

జీవహింససవరించు

  • అన్ని మతాలలో బలులున్నాయి. బలి అనేది ఒక మూఢ నమ్మకం. ఊళ్లో పశువులకు జబ్బులు తగులుతున్నాయి. వీటికి క్షుద్రదేవతలు కారణమని, ఆ దేవతల్ని వూళ్లోకి రాకుండా చెయ్యలంటే బలులివ్వాలంటారు. మేకను ఒక పెద్ద రాయి మీద మెడ ఆనేటట్టు పట్టుకుని ఒక్క దెబ్బతో తల నరుకుతారు. పంది తల మాత్రం బయట కుండేటట్టు పాతేసి, గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు, ఆవుల చేత తొక్కిస్తారు. పంది ముట్టెమీద పశువులు పడటంతో గింజుకుంటు తల పక్కకి వాలి ఘోరంగా నెత్తురు కారుతూ చనిపోతుంది.

బలులు మహాపాపంసవరించు

  • దేవతల జాతరలో మూగజీవుల మేకపోతుల గొంతు కొరికి నరికి చంపుతారు. ఇది తామసిక మనస్తత్వం. భగవంతునికి ఈ బలి వల్ల ప్రీతి కలుగుతుందనే మూఢ నమ్మకం. ఒక కాపాలికుడు కాళీ మాతను ప్రసన్నం చేసుకోవాలని 100 గొర్రె పొటేళ్లను బలియివ్వాలనే ప్రయత్నం మొదలుపెట్టి 99 పొట్టేళ్ళను బలిచ్చాడు. చివరగా 100వ బలికి సిద్ధమయ్యాడు. ఒక గొర్రె పొటేలును కొని తెచ్చి దానిని పూజించి బలికి సిద్ధపరచి తన పూజా కార్యక్రమాన్ని సాగిస్తున్నాడు. అంతలో పకపకా నవ్విన శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా పూజలో నిమగ్నమయాడు. మరలా నవ్వు ఆ తర్వాత పెద్దగా ఏడ్పువినిపించింది. ఏమిటా అని భయంతో చూడగా గొర్రెపొటేలు పెద్దగా ఏడుస్తూ కనిపించింది. భయంతో బిక్కచచ్చిన కాపాలికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆ గొర్రె నవ్వు ఏడుపు ఆపి నేనూ ఒక జీవినే అన్నది. అయ్యా మీరెవరు? గొర్రె మాట్లాడటం ఏమిటి? నిజం చెప్పండి అన్నాడు . నాయనా నేనూ పూర్వజన్మలో ఒక కాపాలికుడనే అని అన్నదా గొర్రె. అలాగా మరయితే మీరు ఇలా ఎందుకున్నారు? ముందు నవ్వారు మరలా ఏడ్చారు ఎందుకు? అని ప్రశ్నించాడు . నేనుకూడా నీలాగనే ఎవరో చెప్పిన మాటను విని 100 పొట్టేళ్ళను కాళీమాతకు బలిస్తే అమ్మ అనుగ్రహిస్తుందని నమ్మి బలి కార్యక్రమం పూర్తిచేసాను. కాళీ మాత అనుగ్రహము కలగలేదుగానీ మహా పాపంచుట్టుకున్నది. దానివలన ఇప్పటికి 100 సార్లు గొర్రె జన్మమెత్తాను. 99 సార్లు నరికి చంపబడ్దాను. ఖర్మ ఫలితం అనుభవిస్తున్నాను. ఇది చివరి జన్మ కనుక దీనినుండి విముక్తమవుతున్నాననే ఆనందం వలన నవ్వు వచ్చింది. త్వరగా బలి ముగించి నన్ను ఈ పాపము నుండి విముక్తం చేయమని కోరింది. కాపాలికునికి తాను చేసిన పాపం గుర్తుకు వచ్చి గడగడలాడాడు.

ఎవరిని గాయపరచినా జగజ్జనని ని గాయపరచినట్లేసవరించు

  • కార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లితో ఆడుకుంటున్నాడు. ఆటలో అతడు దాని ముఖము మీద గిల్లాడు. ఆట అవగానే అతడు తన తల్లి పార్వతి దగ్గరకు వెళ్ళాడు.అతనికి తన తల్లి బుగ్గ మీద గిల్లిన గాయం కనిపించింది. అప్పుడతడు "అమ్మా నీ బుగ్గ మీద ఆ గాయమేమిటి, ఎంత పెద్ద దెబ్బతగిలిందమ్మా, అసలెలా తగిలింది " అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, "నువ్వే కదా నాయనా గిల్లావు" అని సమాధానము చెప్పింది.కార్తికేయుడు నివ్వెరపోయి "అమ్మా, నిన్ను నేనెప్పుడు గిల్లాను?నాకేమి గుర్తులేదే" అని అన్నాడు. అప్పుడు పార్వతి "నాయనా ఈ రోజు వుదయము నువ్వు ఆ పిల్లిని గిల్లావు మరచిపోయావా" అని అడిగింది. కార్తికేయుడు, "అది నిజమే!మరి నేను ఆ పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమయ్యింది?" అని అడిగాడు. అప్పుడు ఆ జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తానెప్పటికి పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించినపుడు తను ఎవరిని పెళ్ళాడగలడు, అందువలన కార్తికేయుడు బ్రహ్మచారిగా జీవితాంతము వుండి పోయాడు.

యుద్ధం అంటే నరబలిసవరించు

భగవంతుని చేరే శుద్ధమార్గాన్ని వేదాలు తెలియజేశాయి. వాటిని ఆశ్రయించటమే భగవంతునికి ఇష్టం కానీ బలులు యుద్ధాలు కాదు. హింస ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి. అశ్వమేధ యాగం చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమయినవై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.

నరబలిసవరించు

క్షుద్ర దేవతల పూజలోను, గుప్త నిధి లబ్యత కొరకు నరబలి ఇచ్చినట్లు చాల ఉదంతాలున్నాయి. దానికి సంబందించిన కథలెన్నో వున్నాయి. ప్రస్తుత కాలంలో కూడ నరబలి ఇచ్చారని అడప దడపా వార్తలు వినిపిస్తున్నాయి.

సురవరము ప్రతాప రెడ్డి గారు వ్రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అను గ్రంధములోసవరించు

అరుదుగా నరబలులు కూడా ఇయ్యబడుచుండెను. అట్టి నరబలులు నిర్జన ప్రదేశములో నుండు శక్త్యాలయములలో జరుగుచుండెను. ఒక భైరవాలయములో రెండుతలలను రెండు మొండెముల నొక సెట్టి చూచి

"చంపుడుగుడి యిది యని యా
          దంపతుల కళేబరములు తలలుం గని తత్
    సంపాదిత భయ రౌద్రా
        కంపితుడై సెట్టి బెగడి కన్నులు మూసెన్.1

చంపుడుగుళ్ళు అని నరబలు లిచ్చు దేవాలయములకు పేరుండె నేమో ? అటవికులగు గోండు, కోయ మున్నగువారిలో నీ యాచారమెక్కువగా నుండినట్లు కానవచ్చును. వారునరబలి నెట్లు యిచ్చిరో కవియిట్లు వర్ణించినాడు.

"ఆనగరంబు దిసనుండి దిమ్ము రేగినయట్లు తూగొమ్ములు, పువ్వనంగ్రోవులునున్, తప్పెతలును, డక్కులును పెక్కువిధంబులదిక్కులును చెవుడు పరుపుచుమ్రోయ, నవ్వాద్యరసంబునకు బాసటయై తమ యార్పులున్ పెడబొబ్బలును గిరిగహ్వరంబుల నుపబృహితంబులుగా గంధపుష్పార్చితుండగు నొక్కదీనుని నడుమ నిడుకొని కురుచ కాసగొరకలు మెరయించుచు బరికెతలల కరకుకౌండరులు ననుదెంచిరి."2

భాషా విశేషాలుసవరించు

బలి [ bali ] bali. సంస్కృతం n. Tax, royal revenue, tribute, కానుక. పన్ను. A oblation. A religious offering in general, presentation of food, &c. పూలోపహారము. The sacrifice of an animal, an animal sacrificed. భూతబలి. నరబలి a human sacrifice. బలి చక్రవర్తి bali:. n. The name of a gaint vanquished by Vishnu who hence is styled బలిధ్వంసి. A strong man, బలముగలవాడు. బలిపుష్టము or బలిభుక్కు bali-pushṭamu. n. The "devourer of the sacrifice:" i.e., a crow. P. i. 480 కాకి. బలిపీఠము bali-pītha-mu. n. An altar. బలిపెట్టు or బలివారు bali-peṭṭu. v. a. To sacrifice, to kill. చంపు. బలిసద్మము bali-sadmamu. n. The internal regions. రసాతలము, పాతాళలోకము.

"https://te.wikipedia.org/w/index.php?title=బలి&oldid=3257379" నుండి వెలికితీశారు