దుర్గ
దుర్గ (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత. మాతృ దేవత మహాదేవి ప్రధాన అంశంగా పూజించబడుతుంది. ఆదిశక్తి అయిన అమ్మవారిని తల్లి, దేవి, శక్తి, ఆదిశక్తి, భవాని, భగవతి, మాతా, మాతా రాణి, జగత్ జననీ, జగదాంబ, పరమేశ్వరి, పరమ సనాతనీ దేవి మొదలైన పేర్లతో కూడా భక్తులు కొలుస్తారు.
దుర్గ | |
---|---|
18వ శతాబ్దపు దుర్గ మహిషాసురుడుని వధిస్తున్న పెయింటింగ్ | |
ఆది శక్తి; శక్తి, రక్షణ దేవత | |
ఇతర పేర్లు | మహిషాసుర మర్దిని, మరికాంబ, భవానీ, దేవి మా, మాతా రాణి, ఆది శక్తి |
అనుబంధం |
|
నివాసం | మణిద్వీపం |
మంత్రం |
|
ఆయుధములు | సుదర్శన చక్రం, శంఖం, త్రిశూలం, గద, విల్లు మరియు బాణం, ఖడ్గం మరియు షీల్డ్, ఘంటా |
వాహనం | సింహం, పెద్దపులి[2][3] |
పాఠ్యగ్రంథాలు | దేవి భాగవతం, దేవీ మహాత్మ్యం |
పండుగలు | దుర్గా పూజ, దుర్గా అష్టమి, నవరాత్రి, విజయదశమి, దసరా |
భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గీతం వందేమాతరం వెనుక మాతృ దేవతగా దుర్గ ప్రేరణ ఉంది. అలాగే భారత జాతీయవాదంలో దుర్గ అమ్మవారు ఉంది, ఇక్కడ భారత మాత అంటే దుర్గ రూపంగా పరిగణించబడుతుంది. ఇది పూర్తిగా లౌకికమైనది. ఆమె పాప్ కల్చర్, జై సంతోషి మా వంటి బ్లాక్ బస్టర్ బాలీవుడ్ సినిమాలలో ఉంది. భారత సైన్యం "దుర్గా మాతా కి జై!", "కాళి మాతా కీ జై!" వంటి హిందుస్థానీ పదబంధాలను ఉపయోగిస్తుంది. ఏ స్త్రీ అయినా న్యాయం కోసం పోరాడటానికి ఒక కారణాన్ని తీసుకుంటే ఆమెలో దుర్గా ఆత్మ ఉంటుంది.[4][5]
దుర్గ అష్టోత్రంసవరించు
ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వఙ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశ్యై నమః
ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్ధ మయాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం దేవ యోనయే నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం వనీశ్యై నమః
ఓం వింధ్య వాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం దేవతాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం సతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః
ఓం ధర్మఙ్ఞానాయై నమః
ఓం ధర్మనిష్టాయై నమః
ఓం సర్వకర్మవివర్జితాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామాసంహంత్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః
ఓం సుజయాయై నమః
ఓం జయాయై నమః
ఓం భూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్రాయై నమః
ఓం శాస్త్రమయాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృత పరివృతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగానిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగధ్యేయాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం ఙ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధానారీ మధ్యగతాయై నమః
ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
ఓం మోహితాయై నమః
ఓం అంశుభవాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమగ్నాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందిన్యై నమః
ఓం హరాయై నమః
ఓం పరాయై నమః
ఓం సర్వఙ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభ రూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః
ఇతి శ్రీ దుర్గ అష్టోత్రం సంపూర్ణం ||
మూలాలుసవరించు
- ↑ "Dharm News Article by Punjab Kesari". Punjab Kesari (in హిందీ). 9 April 2015. Archived from the original on 1 October 2022. Retrieved 28 April 2022.
- ↑ Robert S Ellwood & Gregory D Alles 2007, p. 126.
- ↑ Wendy Doniger 1999, p. 306.
- ↑ Sabyasachi Bhattacharya (2003). Vande Mataram, the Biography of a Song. Penguin. pp. 5, 90–99. ISBN 978-0-14-303055-3. Archived from the original on 19 February 2017. Retrieved 18 February 2017.
- ↑ Sumathi Ramaswamy (2009). The Goddess and the Nation: Mapping Mother India. Duke University Press. pp. 106–108. ISBN 978-0-8223-9153-1.