టిబెట్లో, అనేక బౌద్ధులు ధ్యానంలో భాగంగా మంత్రాలను రాళ్ళ మీద చెక్కారు.

“పరివర్తనను సృష్టించే”( స్ప్రిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ [ఆధ్యాత్మిక పరివర్తన])సమర్థతగలదిగా పరిగణించే ధ్వని, అక్షరం, పదం లేదా పదసమూహాన్ని మంత్రం అంటారు. మంత్రంతో సంబంధం ఉన్న సంప్రదాయం, వేదాంతాల ప్రకారం వాటి వాడుక విధాలలో మార్పులు ఉంటాయి.

భారతదేశవేద సంప్రదాయంలో ఆవిర్భవించిన మంత్రాలు (దేవనాగరీ), తర్వాత హిందూ సంప్రదాయంలో ప్రధాన భాగంగా బౌద్ధిక మతం, సిక్కు మతం ఇంకా జైన మతంలో ప్రచలిత ఆచారాలుగా మారాయి. ప్రాచీన తూర్పు దేశ సంప్రదాయాలు మతాలలోని ఆచారాలపై ఆధారిత లేదా శాఖలైన మంత్రాల వాడుక ఇప్పుడు అనేక ఆధ్యాత్మిక ఉద్యమాలలో వ్యాపించాయి.

ఓం అక్షరం వేదాంత గూఢత్వంలో మంత్రంగా భావిచబడుతుంది.

వేదాల సందర్భంలో మంత్రం అనే పదం బ్రాహ్మణుల వ్యాఖ్యానమైన గద్య భాగానికి విరుద్ధంగా పద్య భాగమైన రిగ్, యజుర్ లేదా సామ అనబడే పాఠాలు గల సంపూర్ణ భాగానికి సంబంధించింది. అనుష్ఠాత్మక వేద సంప్రదాయం నుండి యోగా, వేదాంతం, తంత్రం, భక్తి మొదలగు వాటి మార్మిక మరియు సర్వమానవ సమత్వాన్ని కోరే హిందూ సంప్రదాయలలోకి పరివర్తనం చెందడంతో, మంత్ర పరిజ్ఞాన విశిష్ట స్వభావానికి చెందిన పూర్వాచార పరాయణమైన వైఖరి, మంత్రాల ఆధ్యాత్మిక వివరణలను మానవ సంకల్పం లేదా కోరికను కొన్ని సామాన్య లక్షణాలూ ఇంకా ఉచ్చారణలతో కూడిన ఒక కార్య రూపానికి అనువాదాలుగా మార్చాయి.

ఉపనిషత్తులలో పవిత్ర హిందూ గ్రంథాల రచయితలు ఓం అక్షరంలోనే మంత్రం ఉందని భావిస్తారు. ఈ ఓం అక్షరం బ్రాహ్మణులు, భగవంతుడు, సంపూర్ణ సృష్టిని సూచిస్తుంది. ధ్వనులు అన్నీ ధర్మకాయ బుద్ధుడి స్వరం అని కుకై సూచిస్తాడు, అనగా హిందూ ఉపనిషత్తు మరియు యోగాత్మక చింతనలో ఉన్నట్లుగా మంత్రాలను ఉచ్చరించే వ్యక్తి గ్రహణశక్తికి అతీతంగా మంత్రాల ధ్వనులకు సహజసిద్ధ అర్థం ఉందని సూచిస్తూ ధ్వని ప్రతీకాత్మకత అర్థంలో ఈ ధ్వనులు తుది సత్య వ్యక్తీకరణలని తెలపబడింది.

అయితే, ఈ మంత్రాలు దేనికి ప్రతీకలుగా నిలుస్తాయో లేదా అవి ఎలా పనిచేస్తాయో అనే విషయాల అర్థబోధన భిన్న భిన్న సంప్రదాయలలో వేరువేరుగా ఉంటాయి. ఈ భేదానికి కారణం అవి రాసిన లేదా ఉచ్చరించిన సందర్భాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రతి ధ్వనికి సంబంధించిన ప్రతీకత్మకతలో బహు స్తరాలు ఉన్నాయి. వాటిలో చాలామటుకు ప్రత్యేక చింతన సంప్రదాయాలకు నిర్దిష్టమైనవే. అలాంటి సందర్భాల ఉదాహరణలకు, హిందూ మతం బౌద్ధ మతాల సంప్రదాయాలకు కేంద్రమైన ఓం అక్షరాన్ని చూడండి.

చివరకు హిందు తంత్ర శాస్త్రంలో వర్ణాలనూ ధ్వనులనూ పవిత్రత సాదృశ్యాలుగా పరిగణించబడ్డవి, అయితే రాయడంలోకి పరివర్తన మాత్రం బౌద్ధ మతం చైనా దేశానికి వ్యాపించిన తర్వాత జరిగింది. చైనా దేశంలో సంస్కృతం వంటి ఏకీకరించే దివ్య భాష లేకపోయినా చైనా దేశం తమ సంస్కృతి ఏకత్వాన్ని, ఉచ్చారణలో సరళంగా ఉన్న అర్థపరంగా ఎంతో కచ్చితంగా ఉండే చిహ్నాలుగల లిఖిత భాష ద్వారా సాధించింది. భారత దేశ బౌద్ధమత ధర్మప్రచార సంస్థల కంటే చైనా దేశీయులు లిఖిత భాషకు పెద్ద పీఠ వేశారు. ఈ విధంగా మంత్రాలు రాయడం అప్రయత్నంగానే ఒక ఆధ్యాత్మిక ఆచారంగా మారింది. బ్రాహ్మణులు సరైన ఉచ్చారణ విషయమై కచ్చితంగా వ్యవహరించే వారు కాని చైనా దేశీయులు ఇంకా ఇతర దూరప్రాచ్య దేశాలు బౌద్ధ మతస్థులు దీనిని అంతగా పట్టించుకోకుండా సరిగా రాయడంపై తమ దృష్టి సారించారు. మంత్రాలను రాసే అభ్యాసం అలాగే ఆధ్యాత్మిక ఆచరణగా పాఠాలను నకలు చేయడం జపానులో చాలా సంస్కరించబడ్డది. అంతే కాకుండా ఎన్నో బౌద్ధమత సూత్రాల సంస్కృతం గల సిద్ధం లిపిలో రాయడం ఇటీవల కలంలో కేవలం జపానులోనే కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా, ఎన్నో లిపులలో రాసిన హిందూమత ఆచార సంస్కృత మంత్ర-పునరావృత్తులు భారత దేశంలో కూడా చాలా మతభేదాలలో పేరుగాంచింది.

ఖన్నా (2003: పు. 21)మంత్ర యంత్రాలను చింతన రూపాలకు సంబంధం తెలుపుతుంది.

యంత్రాలపైన లిఖించిన సంస్కృత అక్షరాలైన మంత్రాలు, నిజానికి [1] ధ్వని-స్పందనలతో ప్రభావం చూపే దివ్య శక్తులు లేదా విశ్వ శక్తులకు సాదృశ్యాలైన ‘చింతన రూపాలు.’

విషయ సూచిక

వ్యుత్పత్తి శాస్త్రంసవరించు

సంస్కృత పదమైనmantra- (మ; న. మంత్రం కూడా) పదంలో మూల పదమైన మన్ అనగా ‘చింతన చేయడం’ (మానస్ ‘మెదడు’ పదంలో కూడా) ప్రత్యయమైన – ‘త్ర ’ అనగా ఉపకరణాలు లేదా సాధనాలు అని నిర్దేశించబడినవి, అందుచేత ‘చింతన సాధనం’ అని శాబ్దిక అనువాదం చేయవచ్చును.[2][3]

ఇండో-ఇరానియన్కి చెందిన మంత్ర ఆవేశ్టన్ మంత్రాలో కూడా భద్రపరచబడినది, నిర్వాహక అర్థం ‘పదం’ కాని విస్తృతంగా వర్తించే అంతర్భావాలు గలది. మంత్రాలు సహజసిద్ధంగా “సత్యాలు” (అశ ), మరియు వాటి సరైన గానం వటిలో సహజసిద్ధంగా ఏదైతే సత్యమో అది నిజం చేస్తుంది (నెరవేస్తుంది). అందుకే మంత్రాలు ‘అస్తిత్వం’ ఇంకా ‘నడవడి’ల వ్యక్తీకరణ అని అనవచ్చును. అలాగే నియమాల పాలనకు అస్తిత్వానికి వాటి గానం ముఖ్యం అని అనవచ్చును. (ఆవేష్టన్ అశ మరియు [[ṛtá-]] వేదిక్ [8] కూడా చూడండి)

అందుకే ఇండో-ఇరానియన్కు చెందిన *సాత్యస్ మంత్రాస్ (యస్న 31.6: హైవీమ్ మాత్రేం ) కేవలం ‘సత్య పదం’ అని అర్థం అనలేం కాని ‘సత్యం’ అను భావానికి అనురూపంగా ఉండే చింతన సృష్టి అని లేదా సహజసిద్ధ సంతృప్తితో (నెరవేరడం)[10][4] కూడిన ‘పద్య(మతపర) సూత్రం’ అనవచ్చును.[4]

జెనియన్ చైనీస్ అనువాదం ***, శాబ్దికంగా “సత్య పదాలు,” జపనాస్ భాషలో ఆన్ యోమీ అనగా చైనీస్ జీవి శీంగాన్ కి(దీనినే ప్రబల నిగూఢ శీంగాన్ మతభేదానికి పేరుగా కూడా ఉపయోగింస్తారు) వాచనం.

హిందూమతంలో మంత్రంసవరించు

మూస:Hinduism small ఒకే పంక్తి లేదా ఒక్క పద రూపంలో ఉన్నప్పటికీ మంత్రాలు నిజానికి వేదాలలో ఆవిర్భవించాయి. చాలామటుకు మంత్రాలను రెండు పంక్తులలో రాసే లేఖన శైలి అయిన “శ్లోకాల”లో రాస్తారు.

హిందూ మతంలో అన్ని మంత్రాలకు ఆధారమైన “ప్రణవ మంత్రం”గా పిలవబడే ఓం మంత్రం అన్నిటికంటే ముఖ్య మంత్రం. దృగ్విషయ విశ్వంలోని ఉన్న అన్ని వస్తువులూ, భావనలూ, పదార్థాలకు ఏదో ఒక నామ రూపం ఉంటుంది అని భావించే హిందూ మత వేదాంతానికి సంబంధించిన నామ రూప భావన ఈ భావనకు మూలం. బ్రాహ్మణుల మొదటి స్పష్ట నామ-రూపం, అస్పష్ట సత్యం/నిజం కానిది అవడం చేత ఓం యొక్క ఆధారభూతమైన స్పందన నామ రూపానికి మూలం అనవచ్చును. ప్రథమంగా అస్తిత్వానికి మునుపు అస్తిత్వానికి తర్వాత బ్రహ్మ ఒక్కడే ఉనికిలో ఉన్నాడనేది సత్యం, అలాంటి ఆ బ్రహ్మ యొక్క మొదటి అభివ్యక్తి ఓం. ఈ కారణం చేత ఓం పదాన్ని అత్యవసరమైన శక్తిశాలి మంత్రంగా పరిగణించి హిందూ మతంలోని అన్ని ప్రార్థనల పూర్వ ఉత్తర ప్రత్యయంగా ప్రయేగిస్తారు. కొన్ని మంత్రాలు ప్రత్యేక దేవుళ్లను లేదా సూత్రాలను ఆహ్వానించవచ్చు కాని ‘ఓం,’ ‘శాంతి మంత్రం’, ‘గాయత్రి మంత్రం’ ఇంకా ఇతర మంత్రాల వంటి ఆధారభూత మంత్రాలు అంతిమంగా ఒకే ఒక సత్యంపైన దృష్టి కేంద్రీకరిస్తాయి.

హిందూ తంత్ర శాస్త్రంలో ధ్వనే విశ్వం. ఈశ్వరుడు (పర) అస్తిత్వాన్ని పదం (శబ్దం) ద్వారా నిజం చేస్తాడు. ప్రపంచం అనే దృగ్విషయాలకు ఉనికి కల్పిస్తూ సృష్టిలో భిన్న వ్యాప్తులూ విస్తృతులలో స్పందనలు కలిగి ఉంటాయి. మనకు అసంపూర్ణ శ్రావ్య ధ్వనులు దృష్య రూపాలుగా చెప్పబడే అనశ్వర వర్ణాలైన వర్. ణ స్వచ్ఛమైన స్పందనలు.

వర్. ణాలు ధ్వనుల పరమాణువులు. వర్ణాలూ మరియు పదార్థాలు, దేవతలు, రాశీ చక్ర సంకేతాలు ఇంకా శరీర అవ్యవాల మధ్య సంక్లిష్టమైన ప్రతీకాత్మక సంబంధం నిర్మితమైంది. ఈ సంబంధాలలో వర్ణాలు ఉన్నత స్థితికి చేరాయి. ఉదాహరణకు ఐత్రరేయ-అరణ్య–ఉపనిషత్తులలో మనుకు:

“మూక హల్లులు భూమిని, ఊష్మవర్ణాలు ఆకాశాన్ని, అక్షరాలు స్వర్గాన్ని సూచిస్తాయి. మూక హల్లులు నిప్పుని, ఊష్మ వర్ణాలు గాలిని, అక్షరాలు సూర్యుడిని సూచిస్తాయా? మూక హల్లులు కళ్లను, ఊష్మ వర్ణాలు చెవులను, అక్షరాలు మస్తిష్కాన్ని సూచిస్తాయి.”

క్రమేణ ప్రతి వర్ణం మంత్రంగా మారి వేదాల భాషైన సంస్కృతం ప్రకృతిలోని వస్తువులకు విస్తారంగా సాదృష్యమయ్యాయి. ఈ విధంగా వేదాలు సత్యాన్ని సూచిస్తాయి. బ్రాహ్మణ అనే సత్యం యొక్క అంతర్గత ఏకత్వాన్ని బీజాక్షరమైన ఓం పదం సూచిస్తుంది.

విశ్వంలోని అన్ని పదార్థాలు మరియు శక్తులు మంత్రాల చేత ప్రభావితమయ్యి వాటి చేత మార్గ నిర్దేశం పొందుతాయి. మంత్రాల అనేక రూపాలు ఉన్నాయి.[5][6]

 • భజన – ఆధ్యాత్మిక గీతం.
 • కీర్తన – భగవంతుని నామ పునరావృత్తి.
 • ప్రార్థన – దేవుడితో తమ ఆలోచనలను అనుభూతులను పంచుకునేందుకు మార్గం ప్రార్థన.
 • శాంతపరిచే మంత్రం – శాంతపరిచే మంత్రం, స్పందన శాంతపరిచే ప్రభావం పనిచేసేలా చేస్తుంది.
 • విరుగుడు మంత్రాలు --పల్లె ప్రజలు నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు.ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.నీ దిష్టి, నా దిష్టి....థూ.థూ..థూ అంటూ దిష్టి తీస్తారు.ఆటోలు, లారీల వెనకాల 'బురీ నజర్‌వాలా తెరా మూహ్‌ హో కాలా' (దిష్టి పెట్టేవాడా నీ ముఖం మాడా!) లాంటి వాక్యాలు రాస్తారు.'ఎవరి చూపు పడిందో ? పాడు కళ్లు,పాపిష్టి కళ్ళు వామ్మోఅని భయపడతారు.షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడి దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకుని, అడవులు పట్టి తిరగవలసి వచ్చిందట.దృష్టిదోషం,చెడుచూపు,దయ్యం చూపు,దిష్టికి విరుగుళ్ళుగా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు,నల్ల తాడు, నిమ్మకాయల దండ,పసుపు, సున్నం కలిపిన నీళ్లు,ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ,తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ,కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ,చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క,పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క,మెడలో తావీజు... పచ్చిమిరపకాయలు,ఈతాకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు. హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వే యడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం.. కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్తదుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం తినే ఆహార పదార్థాన్ని ఏడుమార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును ఏడుసార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు లిఖించిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలోకట్టటం - ( డి.వి.ఆర్.భాస్కర్ సాక్షి 16.7.2011)
 • గురు మంత్రం – గురు మంత్రం ప్రార్థన సారాన్ని సూచించి మనలోని ఆత్మ పరమాత్మైన దేవుడిలోకి దించుతుంది. ఇది ఆధ్యాత్మిక మార్గంలో గురువు శిష్యుడికి తెలిపే మొదటి దీక్ష.
 • బీజ మంత్రం – బీజ మంత్రం గురు మంత్ర సారాన్ని సూచిస్తుంది. దానిని ఆత్మ యొక్క స్పందన మరియు “పిలుపు” అనవచ్చు. అగాధ ద్యానంలో ఈ మంత్రం ప్రాభావాలు చాలా త్వరగా కనబడ్తాయి. అది నక్షత్రాల స్థాయిలో పని చేయడం వలన అది మన నియతిపై ప్రభావం చూపి మన నియతిని నిర్దేశిస్తుంది.

కలుపు మొక్కలపైన పదే పదే నడిస్తే అవి అణిగినట్లు, మంత్రాల నిరంతర ఆచరణ మన స్మృతిని మనస్సుని పవిత్రం చేసి కర్మలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక మంత్రంలో ఎప్పుడూ ఓం అనే పదం మరియు దివ్య అవతార నామం ఉంటుంది. ప్రాచీన గురు-శిష్యుల సంప్రదాయం ప్రకారం కేవలం గురువే ఎప్పుడు గురు మంత్రాన్ని (సిద్ధ మంత్రం) ఉపదేశించి మరొకరికి అందేటట్లు చేస్తాడు. పదాల స్పందనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మనలోనే సమాహితమయ్యేట్లుగా సిద్ధ మంత్రం పనిచేస్తుంది. ఆధ్యాత్మిక మంత్రాలు సాధారణంగా సంస్కృతంలో రాసి ఉంటాయి, ఇవి చక్రాలను మేలుకొల్పేందుకు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శివ భగవానుడు సంస్కృత భాషను మానవులకు ప్రసరింపజేశాడు, వాటి ధ్వనులను దేవ ధ్వనులు అంటారు. “దేవ” అను పదానికి మూడు అర్థాలు ఉన్నాయి: భగవంతుడు, రక్షకుడు (దేవ రక్షకుడు) మరియు విశ్వ స్పందన. శివ భగవానుడు వర్ణాల రూపంలో దేవతలను భూమిపైకి తీసుకొచ్చాడు, అందుకే సంస్కృత వర్ణలను దేవనాగరి (దేవుడి నాగరికులు) అని అంటారు. స్పందనలు వినిపించవచ్చు వినిపించకపోవచ్చు. ఆలోచనలను, భావనలను ధ్వని రహిత స్పందనలుగా గణిస్తారు. వీటి ప్రభావం కూడా మాటలతో సమానమే.

మంత్రాలను ఐదు దశల భావించడం జరిగింది:

 • లిఖిత – రాయడం ద్వారా
 • వైఖరి – మాట్లాడడం ద్వారా
 • ఉపంశు – రహస్యంగా చెప్పడం ద్వారా
 • మానస్ – ఆలోచించడం ద్వారా
 • ఆజప – నిరంతర అంతర్ పునరావృత్తి (మనసులో స్మరిచండం) ద్వారా

మంత్ర జపంసవరించు

మంత్ర జపం అనేది వేదాల నాటి ఋషులచే కల్పించబడిన భావం, అనగా మోక్షం/విముక్తి చరమసీమై ప్రధానంగా మంత్రాలు ఇమిడి ఉన్న పూజ లేదా ఆరాధన అనే భావం. వాస్తవానికి, మంత్ర జపం అనగా మంత్రాల పునరావృత్తి,[7] ఇది హిందూ మతానికి సంబంధించిన అన్ని ధారలలో భిన్న-భిన్న యోగాల నుండి తంత్రాల వరకు ఒక ప్రముఖ ఆచారంగా మారింది. మంత్ర జపం అనేది మంత్రాల పునః పునః పునరావృత్తులతో కూడి ఉంటుంది, సాధారణంగా ఈ పునరావృత్తులు పవిత్ర సంఖ్యల (మూడవ సంఖ్య యొక్క గుణిజాలలో) చక్రాలలో చేస్తారు, పవిత్ర సంఖ్యలలో 108 అనేది చాలా ప్రఖ్యతి గాంచిన సంఖ్య. ఈ కారణం చేతే, హిందూ మతానికి సంబంధించిన మాలలో (పూసల హరాలలో) 108 పూసలు మరియు ఒక ప్రధాన పూస (కొన్నిసార్లు ‘మేరు’ లేదా ‘గురు’ పూస అని సూచించబడే) ఉండేటట్లుగా తయారు చేస్తారు. జపం చేయదలచుకున్న మంత్రాన్ని పునరావృత్తం చేస్తూ జపం చేసే భక్తుడు తన చేతి వేళ్లతో ప్రతి పూసను లెక్కపెడతాడు. 108 పునరావృత్తులు చేరుకున్న తర్వాత ఒకవేళ భక్తుడు మంత్రాల మరో చక్రాన్ని కొనసాగించాలనుకుంటే, భక్తుడు మాలను తిప్పి ప్రధాన పూసను దాటకుండా తిరిగి జపం చేయాలి.

జపం చేయడం ద్వారా భక్తుడు తన ఎంచుకున్న దేవతపైన లేదా మంత్రం యొక్క ఆధారభూత భావంపైన దృష్టి సారించడం లేదా పరమ శ్రద్ధను సాధిస్తాడు అని అంటారు. మంత్రంలోని స్పందనలూ ధ్వనులూ చాలా ప్రధానమైనవిగా పరిగణిస్తారు, ఈ విధంగా ఎన్నో హిందూమత చింతన సంప్రదాయాల[8] ప్రకారం ధ్వని ప్రతిధ్వనులు జాతక చక్రాని[9] లేదా ఆధ్యాత్మిక జీవన శక్తులను మేలుకొల్పగలతాయనీ చక్రాని స్థిరం చేయగలుగుతాయనీ అంటుంటారు.

వేదాలు, ఉపనిషత్తులు, భగవత్ గీతా, యోగసూత్రాలు, మహాభారతం, రామాయణం, దుర్గా సప్తాష్టి లేదా చండీ వంటి హిందూ మతానికి సంబంధించిన పవిత్ర పాఠాలలోని ఏ శ్లోకమైనా గొప్ప ప్రభావం చూపేందుకు పునరావృత్తం చేసేంత శక్తి గలిగి ఉంటాయని పరిగణిస్తారు అందుకనే వాటికి మంత్ర స్థానాన్ని కల్పించారు.

దేవత పేరు స్మరించడం ద్వారా ‘నామ జపాలు’ అనబడే కొన్ని సాధారణ మంత్రాలు రూపందాలుస్తాయి: “ఓం నమః (దేవత పేరు )” (“నేను గౌరవిస్తాను/నమస్కరిస్తాను….” అని అర్థం) లేదా “ఓం జై (దేవత పేరు )” (“నమస్కారాలు….” అని అర్థం). కింద ఇచ్చిన వాటితో సహా ఇంకా ఇలాంటి ఎన్నో ఇతర క్రమభేదాలు ఉన్నాయి:

 • ఓం నమః శివాయ లేదా ఓం నమో భగవతే రుద్రాయ నమః (శివ భగవంతుడికి ఓం మరియు నమస్కారాలు)
 • ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ (విష్ణు భగవానుడికి ఓం మరియు నమస్కారాలు)
 • ఓం శ్రీ గణేషాయ నమః (శ్రీ గణేషుడికి ఓం మరియు నమస్కారాలు)
 • ఓం కాలికాయయి నమః (కాలికి ఓం మరియూ నమస్కారాలు)
 • ఓం శ్రీ మహా కాలికాయయి నమః (పైన చెప్పబడిన మూల కాలీ మంత్రానికి శ్రీ [గొప్ప గౌరవానికి గల అభవ్యక్తి] మరియు మహా [గొప్ప] అనే పదాలు చేర్చి మంత్రానికి మరింత శక్తిని చేకూర్చడం జరిగింది). ఈ మంత్రం చాలా ప్రచండమయినది అవటం చేత ఈ మంత్రాన్ని చాలా త్కువగా జపం చేయుటకు ఇస్తారు అని అంటుంటారు.[10]
 • ఓం హ్రీం చండికాయయి నమః (చండికాకి ఓం మరియు నమస్కారాలు)
 • ఓం రాధా కృష్ణాయ నమః (సంబంధాలలో ప్రేమను వికసింపజేయడానికి రాధా మంత్రం)[11] ఓం రాధా కృష్ణాయ నమః (రాధా మంత్రం, ఇది సంబంధంలో ప్రేమను పెంపొందిస్తుందని చెప్పబడింది)[11]
 • ఓం నమో వెంకటేశాయ (వెంకటేశ్వర భగవానుడికి ఓం మరియు నమస్కారాలు)

దుర్గా సప్తాష్టి వంటి సంపూర్ణ మాంత్రిక పాఠాన్ని సంపూర్ణంగా జపించడాన్ని పథం అంటారు.

మంత్ర శాస్త్రంలో (శాస్త్ర, శాస్త్ర: చట్టాల గ్రంథం, నియమం లేదా [12] సిద్ధాంత గ్రంథం) భాగమైన మంత్రాల ప్రయోగాన్ని విభిన్న పాఠ్య గ్రంథాలలో వివరించబడింది.

జైన మత/హిందూ మతానికి సంబంధించిన కొన్ని మంత్రాలుసవరించు

నవకర్సవరించు

నవకర్ మంత్రం జైన మంత్రంలో ఒక ఉన్నత మంత్రం, అంతేకాక ఇది జైన మతంలో ఏ సమయంలోనైన గానం చేయగల ప్రాథమిక ప్రార్థన. ఈ మంత్రాన్ని గానం చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, భక్తుడు అరిహంతాలు, సిద్ధాలు, ఆధ్యాత్మిక గురువులు (ఆచార్యులు), బోధకులు (ఉపాధ్యాయులు) మరియు సన్యాసులందరికి గౌరవంతో తల వగ్గి ప్రణామం చేస్తాడు. ఈ విధంగా చేయడంతో కేవలం ఒక ప్రత్యేక వ్యక్తిని ఆరాధించే బదులుగా ఉన్నత ఆధ్యాత్మిక వర్గానికి చెందిన వ్యక్తులందరిని ఆరాధించినట్లైతుంది. గమనించ వలసిన ముఖ్యమైన విశయమేమిటంటే నవకర్ మంత్రంలో తీర్థాంకరాలు మరియు సిద్ధుల పేర్లు కూడా పేర్కొనబడవు. ఈ మంత్రం ఉచ్చరించేటప్పుడు, జైన భక్తుడు ఆ మంత్ర సుగుణాలను గుర్తుంచుకోవడమే కాదు వాటిని ఆచరణలో కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ మంత్రంలో జైనులు ఉన్నత ఆధ్యాత్మిక వర్గానికి చెందిన వ్యక్తులందరికి నమస్కరిస్తారు అందుకే దీనిని నమోకర్ మంత్రం అని కూడా అంటారు.

నమో అరిహంతానం నమో సిద్ధానం నమో ఆయరియానం నమో ఉవజ్జయానం నమో లోయే సవ్వ సహూనం ఎసో పంచ నమోక్కరో, సవో పావప్పనాశనో, మంగళనం చ సవ్వేసిమ, పద్మం హవాయి మంగళం .

నమో అరిహంతానం నేను అరిహంతాలకు (మత బోధకులు) నమస్కరిస్తాను.
నమో సిద్ధానం నేను సిద్ధులకు నమస్కరిస్తాను (ముక్తి పొందిన ఆత్మలు).
నమో ఆయరియానం నేను ఆచార్యాలకు నమస్కరిస్తాను (నియమాలు సృష్టించేవారు లేదా ఆధ్యాత్మిక గురువులకు).
నమో ఉవజ్జాయనం నేను ఉపాధ్యాయులకు (బోధకులు) నమస్కరిస్తాను.
నమో లోయే సవ్వ సహూనం సాధువులకు (ఋషులు) నా నమస్కారాలు.
ఎసో పంచ నమోక్కరో సవ్వ పావప్పనాశనో
మంగళనం చ సవ్వేసిం, పద్మం హవాయి మంగళం
ఈ పంచముఖ నమస్కారం (మంత్రం) అన్ని పాపాలు విర్ఞాలను నాశనం చేస్తుంది
ఇంకా ఈ మంత్రం పవిత్ర మంత్రాలలోకెల్ల మొట్టమొదటిది.

సార్వత్రిక ప్రార్థనసవరించు

सर्वेषां स्वस्ति भवतु । सर्वेषां शान्तिर्भवतु ।
सर्वेषां पूर्नं भवतु । सर्वेषां मड्गलं भवतु ॥
సర్వేశాం స్వస్థిర్ భవతు
సర్వేశాం శాంతిర్ భవతు
సర్వేశాం పూర్ణం భవతు
సర్వేశాం మంగళం భవతు
అందరికి మంచి జరగని,
అందరికి శాంతి చేకూరని,
సంపూర్ణతకు గాను అందరూ ఆరోగ్యంగా ఉండనీ,
పవిత్రతను అందరూ ఆస్వాదించనీ.
सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥
Sarve bhavantu sukhinaḥ
Sarve santu nirāmayāḥ
Sarve bhadrāṇi paśyantu
Mā kaścit duḥkha bhāgbhavet
ఓం, అందరూ సంతోషంగా ఉండనీ. అందరూ ఆరోగ్యంగా ఉండనీ.
మంచిని అందరూ ఆస్వాదించనీ మరియు ఎవ్వరూ బాధపడకూడదు.

విష్ణు మంత్రాలుసవరించు

కొన్ని ప్రసిద్ధ వైష్ణవ మంత్రాలు:

"ఓం నమో నారాయణాయ"
"ఓం నమో భగవతే వాసుదేవాయ"
"ఓం శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్"
"హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే"
"ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః"

శాంతి మంత్రాలుసవరించు

ఓం.. ఓం.. ఓం..
సహనా వవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధితమస్తూ
మావిద్ విష వహై హి
ఓం శాంతి.. శాంతి.. శాంతిహి.
మనమందరం కలిసి తీసుకున్న ఈ అధయ్యనాలు ప్రకాశవంతం కానిద్దాం;
మనమధ్య ఏ విధమైన విరోధం లేకుండా ఉందాం;
ఓం... శాంతి, శాంతి, శాంతి.
(మానవుని యెక్క శిక్షణ ఆరంభించే ముందు పఠించాలి)
– బ్లాక్ [కృష్ణ] యజుర్వేద తైత్తిరీయ ఉపనిషత్తు 2.2.2

అజ్ఞానం నుండి నన్ను సత్యానికి నడిపించుసవరించు

असतोमा सद्गमय। तमसोमा ज्योतिर् गमया।
मृत्योर्मामृतं गमय॥
Asato mā sad gamaya
Tamaso mā jyotir gamaya
Mṛtyormā amṛtam gamaya
Aum śānti śānti śāntiḥ (Bṛhadāraṇyaka Upaniṣad 1.3.28)
అజ్ఞానం నుండి నన్ను సత్యానికి నడిపించు;
చీకటి నుండి నన్ను వెలుగుకు నడిపించు;
మరణం నుండి నన్ను శాశ్వతత్వంకు నడిపించు
ఓం శాంతి, శాంతి, శాంతి

గాయత్రీసవరించు

గాయత్రీ మంత్రాన్ని అత్యధిక విశ్వవ్యాప్తమైన మొత్తం హిందూ మంత్రాలలో వాటిలో ఒకటిగా భావించబడింది, విశ్వవ్యాప్తమైన బ్రాహ్మణుని విజ్ఞాన సూత్రంగా మరియు ఆదిమమైన సూర్యుని తేజస్సును ప్రార్థించేదిగా ఉంది.

ॐ भूर्भुवस्व:
तत्सवितुर्वरेण्यम्
भर्गो देवस्य धीमहि
धियो यो न: प्रचोदयात्
ఓం భూర్ భువ స్వః
(ఓం) తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నహః ప్రచోదయాత్, (ఓం) [13]

మరికొన్ని హిందూ మంత్రాలుసవరించు

నవీన-హిందూమతం యెక్క నూతన మతసంబంధ మార్పులుసవరించు

'TM'గా పిలవబడే ట్రాన్సన్డెంటల్ మెడిటేషన్ మెళుకువ, ఏ అర్థానికి లేదా ఉద్దేశ్యానికి జతచేయకుండా అభ్యాసకులకు ఒక శబ్దంలాగా ఉపయోగించటానికి మాత్రమే మంత్రాలను ఇవ్వబడుతుంది.[15]

సూరత్ శబ్ద యోగ యెక్క మతసంబంధ అభ్యాసాలలో స్మరణ్ (పునశ్చరణం, ముఖ్యంగా ఇచ్చిన ఉపదేశంలోని మంత్రాన్ని నిశ్శబ్దంగా పునరుక్తి చేయడం ఉంటుంది), ధ్యానం (ముఖ్యంగా మనస్సు మీద(ఇన్నర్ మాస్టర్) ఏకాగ్రత, అవలోకనం, లేదా ధ్యానం ఉంచటం), మరియు భజన చేయటం (శబ్దాలు లేక శబ్దాలు పలికిన గురువుల యెక్క అంతర్గత శబ్దాలను ఆలకించడం).

"మంత్రం" యెక్క (ఉదా., మంత్రం) లేదా పవిత్ర పేరును పునశ్చరణం చేయటం అనేది ఏక్నాథ్ ఈశ్వరన్ ఉపదేశించిన ఎనిమిది-పాయింట్ల పాసేజ్ మెడిటేషన్ ప్రోగ్రాంలో 2వ పాయింట్, ఈయన విశ్వాస సంప్రదాయం నుండి వచ్చిన మంత్ర వాడకాన్ని సిఫారుసు చేశారు. మంత్రాన్ని రోజు మొత్తంలో అవకాశమున్నప్పుడల్లా ఉపయోగించాలని చెప్పబడింది.[16] మంత్రాన్ని పునరుశ్చరణ చేసే ఈ పద్ధతిలో అతిపెద్ద ప్రోగ్రాంను బాగా విశ్వాసం ఉన్న సంప్రదాయంలో లేదా సంప్రదాయాలకు సంబంధం లేకుండా ఉపయోగించడానికి అభివృద్ధి చేయబడింది.[17] ఈశ్వరన్ యెక్క మంత్ర పునరుశ్చరణ పద్ధతి సాన్ డిగో వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్ వద్ద సాంకేతిక పరిశోధన యెక్క అంశంగా ఉంది, ఇది ఆరోగ్య ప్రయోజనాలను సూచించింది, ఇందులో ఒత్తిడిని నియంత్రించటం మరియు PTSD యెక్క లక్షణాలను తగ్గించడం ఉన్నాయి.[18][19]

బౌద్ధమతంలో మంత్రంసవరించు

మూస:Buddhism

గోప్యంకాని మహాయాన బౌద్ధమతంలో మంత్రంసవరించు

చైనీయుల బౌద్ధమతంలో, పది చిన్న మంత్రాలను [20][21][22][23][24][25][26] బౌద్ధసన్యాసి యులిన్ (玉琳國師) నిశ్చయించారు, బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు మరియు లౌకికులు ఉదయం పఠనం చేయడం కొరకు ఈయన శుంజ్హి సామ్రాజ్యం యెక్క శిక్షకుడిగా ఉన్నారు.

పది మంత్రాలతో పాటు, గ్రేట్ కంపాషన్ మంత్రం(గొప్ప కరుణ మంత్రం), శురంగమ యెక్క శురంగమ మంత్రం, హృదయ సూత్రం (హార్ట్ సూత్రా) మరియు నియాన్ఫో యెక్క అనేక ఆకృతులు కూడా పఠించేవారు.

===షింగోన్ బౌద్ధమతంలో మంత్రం=== కుకై (774-835) అనే పేరున్న ఒక బౌద్ధ సన్యాసి భాష యెక్క సాధారణ సిద్ధాంత అభివృద్ధిని బౌద్ధ పూజావిధాన భాష యెక్క రెండు ఆకృతుల మాద అతను చేసిన విశ్లేషణ మీద ఆధారపడి చేశాడు: అవి ధరణి (dhāra.nī) మరియు మంత్రం . మంత్రాన్ని గూఢమైన బౌద్ధ అభ్యాసానికి పరిమితి చేయబడింది, ఇక్కడ ధరణి రహస్యమైన మరియు బహిరంగమైన పూజావిధానాలలో కనపడుతుంది. ఉదాహరణకి ధరణీలు హార్ట్ సూత్రాలో కనుగొనబడతాయి. "షింగోన్" (lit. true word )అనే పదం చైనీయుల మంత్రం అనే పదానికి జపనీయుల ఉచ్ఛరణ, చెన్ యెన్ .

ధరణి అనే పదం సంస్రృత మూలం dh.r నుండి పొందబడింది, దీనర్థం పట్టుకొని ఉండు లేదా కొనసాగించు అని ఉంది. ర్యుచి అబే సూచిస్తూ దీనిని సాధారణంగా జ్ఞాపకం ఉంచుకోవటానికి సహాయపడే ఉపకరణంగా తెలపబడుతుంది, ఇది సూత్రం యెక్క భాగం లేదా శాఖ యెక్క అర్థాన్ని చేర్చుకొని ఉంది. ధరణీలు పఠించిన వారిని అపకీర్తిపాలు చేసే ప్రభావాలు మరియు విపత్తుల నుండి రక్షించబడుతుందని కూడా భావించబడుతుంది.

మంత్రం అనే పదం సాంప్రదాయకంగా రెండు మూలాల నుండి తీసుకోబడిందని చెప్పబడింది: అవి ఆలోచించటానికి మానవుడు ; మరియు కార్యసంబంధమైన ప్రత్యయం -ట్రా . ఒకరి యెక్క ఆలోచనను బలోపేతం చేయటానికి లేదా బౌద్ధులకు జ్ఞానోదయమైన మనస్సును అభివృద్ధి చేయుటకొరకు మంత్రం ఒక భాషాశాస్త్ర సాధనంగా భావించబడుతుంది. అయినప్పటికీ, మంత్రాలను ఇహలోక అవసరాల కొరకు ఇంద్రజాల అక్షరాలుగా ఉపయోగిస్తారనేది సత్యం, ఈ అవసరాలలో సంపదను మరియు దీర్ఘ ఆయుష్షును పొందడం మరియు శత్రువులను తొలగించివేయటం ఉంటాయి. రోజువారీ జీవితంలో, చాలా మంది మంత్రోచ్ఛారణ దానియెక్క ప్రభావం చూపటంలో అంత ముఖ్యం కాదని భావిస్తారు మరియు రాసిపెట్టి ఉన్న కర్మ(定業) మూలంగా లేదా ఆ పరిస్థితిని పరిష్కరించడానికి అంతకన్నా మంచి పరిష్కారం దొరకటం వల్ల ఆశించిన ప్రభావం జరగకపోవచ్చు.

ధరణి మరియు మంత్రంకున్న వ్యత్యాసాన్ని తెలపటం చాలా కష్టం. అన్ని మంత్రాలు ధరణీలే కానీ అన్ని ధరణీలు మంత్రాలు కావు అని మనం చెప్పవచ్చు. మంత్రాలు కూడా సంక్షిప్తంగా ఉండటం ఆరంభమయ్యాయి. రెండూ కూడా అనేక తెలియలేని ధ్వన్యాత్మక పదాలను కలిగి ఉన్నాయి, ఇందులో ఓం, లేదా హమ్ వంటివి ఉన్నాయి, అందుచే కొంతమంది వీటిని అర్థరహితంగా భావిస్తారు. కుకై ధరణి యెక్క ప్రత్యేక తరగతికి చెందిన మంత్రాన్ని చేశారు, ఇందులో ధరణి యెక్క ప్రతి అక్షరం వాస్తవికత యెక్క సహజ స్వభావాన్ని విశదం చేస్తుంది– బౌద్ధుల మాటలలో అన్ని శబ్దాలు శూన్యత యెక్క లేదా స్వీయ-స్వభావం యెక్క శూన్యత స్పష్టీకరణగా చూపపడుతుంది. అందుచే అర్థాన్ని లేకుండా ఉండటంకన్నా, ధరణీలు అర్థంతో నిండి ఉంటాయని ప్రతి అక్షరం అనేక స్థాయిలలో ప్రతీకాత్మకంగా ఉంటుందని కుకై సూచించారు.

కుకై యెక్క వైవిధ్యమైన తోడ్పాటులలో ఒకటి-ఈ ప్రతీకాత్మక సంబంధం ఇంకనూ లోతుగా తీసుకొని మాట్లాడుతూ నిజానికి మంత్రాల యెక్క అక్షరాలకు మరియు పవిత్ర పఠనాంశాలకు ఇంకా సాధారణ భాషలో ఉండేవాటికి గొప్ప వ్యత్యాసం లేదని సూచించారు. ఒకవేళ మంత్రాల యెక్క చర్యలను ఎవరైనా అర్థం చేసుకుంటే, ఏ శబ్దమైనా అంతిమ వాస్తవానికి ప్రతినిధిగా అనిపిస్తుంది. శబ్దాల మీద ఈ కృషి ధ్వనివిధేయ వ్రాత విధానంలో కుకై నిష్ణాతుడు కావటానికి సహకరించాయి, కుకై కాలంలో జపాన్ వారు కనాను అనుసరించారు. అతను సాధారణంగా కనాని కనుగొన్నందుకు శ్లాఘించబడతాడు, కానీ దీనిమీద ప్రావీణ్యుల మధ్యకొంత సందేహం స్పష్టంగా ఉంది.

ఈ భాష యెక్క మంత్రం-ఆధార సిద్ధాంతం జపనీయుల ఆలోచన మరియు సమాజం మీద శక్తివంతమైన ప్రభావం కలిగి ఉంది, ఇది కుకై కాలం ముందువరకు దిగుమతి చేసుకోబడిన చైనీయుల ఆలోచనా సంస్రృతిని పాటించింది, ముఖ్యంగా మహోన్నత చైనీయుల భాష యెక్క వర్ణనలో దీనిని న్యాయస్థానం మరియు సాహిత్యంలో ఇంకా పాలిస్తున్న రాజకీయ భావనాశాస్త్రం అయిన కన్ఫుసియస్‌లో ఉపయోగించబడేది. ముఖ్యంగా కుకై భాష యెక్క ఈ నూతన సిద్ధాంతాన్ని స్వదేశ జపాను సంస్కృతికి మరియు బౌద్ధ మతానికి మధ్య సంబంధాలు ఏర్పరచటానికి ఉపయెగించగలిగారు. ఉదాహరణకి, అతను బుద్ధ మహావైరోకాన మరియు శింతో సూర్య దేవత అమతెరసు మధ్య సంబంధం ఏర్పరచారు. ఎందుకంటే రాజులు అమతెరసు నుండి వచ్చారని భావించబడేది, కుకై ఇక్కడ రాజులకు మరియు బుద్ధుడికి జతకలిపి ఒక శక్తివంతమైన సంబంధాన్ని కనుగొన్నారు, మరియు శింతోతో బౌద్ధమతాన్ని కలపటానికి మార్గాన్ని కనుగొన్నారు, ఇది కన్ఫుసియానిజంతో సాధ్యపడలేదు. తరువాత బౌద్ధమతం అత్యవరమైన దేశీయ మతంగా అయ్యింది, ఇలా కన్ఫుసియానిజం కాలేక పోయింది. మరియు ఇది భాషతోనే పొందబడింది, మరియు మంత్రం ఈ బంధాన్ని కలిగించింది. కుకై ఇంతక్రితం చేయని విధంగా మతాన్ని విశదీకరించటంలో సహాయపడినాడు: అతను మూలాధార ప్రశ్నలైన పఠనాంశం అంటే ఏమిటి, ఏవిధంగా సంజ్ఞలు పనిచేస్తాయి, మరియు అన్నింటినీ మించి భాష అంటే ఏమిటి అనే ప్రశ్నల గురించి చర్చించాడు. ఇందులో ఆధునిక కాలంలో భాష మరియు ఇతర వాటి యెక్క నిపుణులు మరియు ఆకృతిదారుల ఆధారాలను అతను తీసుకున్నారు, అయిననూ అతను చాలా వ్యత్యాసమైన అంతిమ నిర్ణయాలను అందించారు.

ఈ ఆలోచనా విధానంలో అన్ని శబ్దాలు "a" నుండి జనించాయి– ఇది చిన్న a శబ్దాన్ని father లో ఉంది. గోప్యమైన బౌద్ధమత "a" ఒక ప్రత్యేకమైన విధిని కలిగివుంది ఎందుకంటే అది శూన్యతతో లేదా దానంతట అదే ఏదీ జనించదు అనే ఉద్దేశంతో సంబంధం కలిగివుంది, కానీ ఇది దానియెక్క కారణాలు మరియు పరిస్థుతుల మీద అనిశ్చయంగా ఉంది. (డిపెన్డంట్ ఒరిజినేషన్ చూడండి) సంస్కృతంలో "a" అనేది ఒక ఉపసర్గ, ఇది పదం యెక్క అర్థాన్ని మార్చి వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది, అందుచే "విద్య" అంటే అర్థంచేసుకోవటం, మరియు "అవిద్య" అంటే అజ్ఞానం (ఇదే విధమైన అక్షరక్రమం అనేక గ్రీకు పదాలలో కనిపిస్తుంది, ఉదా. "ఎథియిజం" vs. "థియిజం" మరియు "అపాతి" vs. "పాథోస్"). అక్షరం a ను సిద్ధం లిపిలో, మరియు ధ్యానం అభ్యాసాలు ఇంకా పూజావిధానాలలో ఉచ్ఛరణలో చూడవచ్చు. షింగోన్ బౌద్ధమతానికి కేంద్రమైన మహావైరోకాన సూత్రంలో అది తెలుపుతూ: బౌద్ధుల మరియు బోధిసత్త్వుల యెక్క మూలమైన ప్రతిజ్ఞలకు ధన్యవాదాలు, ఒక మానవాతీతమైన శక్తి ఈ మంత్రాలలో ఉంటుంది, అందుచే వాటిని ఉచ్ఛరించటం వలన పరిమితి లేకుండా మానవుడు సుగుణాలను పొందుతాడు". [Conze, p. 183]

ఇండో-టిబెటన్ బౌద్ధమతంలో మంత్రాలుసవరించు

మంత్రాయణ (సంస్కృతం)ను "మంత్ర మార్గం"గా ప్రార్థించబడుతుంది, ఇది 'న్యింగ్‌మప'ను నిర్ణయించటానికి వచ్చిన వాటి యెక్క వాస్తవమైన స్వీయ-గుర్తింపు ఉన్న పేరు.[ఉల్లేఖన అవసరం] న్యింగ్‌మపను "ప్రాచీన మార్గంలో ఉన్నవి"గా ప్రార్థిస్తారు, ఈ పేరు నిర్మాణాన్ని సర్మా "తాజా", "నూతన" సంప్రదాయాల యెక్క ఉత్పత్తి క్రమం కొరకు నిర్మించబడింది. మంత్రాయణ, వజ్రాయణ యెక్క పర్యాయపదంలాగా అభివృద్ధి చెందింది.

బౌద్ధ పఠనాంశాల యెక్క ప్రముఖ అనువాదకుడు ఎడ్వర్డ్ కాంజ్ (1904–1979) బుద్ధుల వాడకంలో మంత్రం యెక్క మూడు కాలాలను ప్రత్యేకపరచారు.

కాంజ్ ప్రకారం, ఆరంభంలో వారు సహ భారతీయులలాగా, బౌద్ధులు దుష్ప్రభావాలనుండి కాపాడుకోవటానికి మంత్రాలను ఉపయోగించారు. భౌతికమైన ప్రయోజనానికి మంత్రాలను పఠించడం అనే బ్రహ్మినికల్ అభ్యాసంలో బౌద్ధ సన్యాసులు ఉండకూడదని ఆజ్ఞాపించే వినయ నియమం ఉన్నప్పటికీ, సుఖంకోరని సన్యాసులను కాపాడటానికి చాలా మంది ఉన్నారు. అయిననూ, ఈ ఆరంభ దశలో కూడా, పని వద్ద విశ్వాస అద్భుతాని కన్నా అధికంగా ఏదో ఉంది. ముఖ్యంగా రతన సుత్త విషయంలో శ్లోకాల యెక్క ప్రయోజనం "సత్యం" యెక్క భావంతో సంబంధం కలిగి ఉంటుందని గోచరిస్తోంది. సుత్త యెక్క ప్రతి శ్లోకం ముగింపు "ఈ సత్యం యెక్క సుకృతం వల్ల సంతోషం ఉండవచ్చు" అని ఉంటుంది.

కాంజ్ సూచిస్తూ తరువాత మంత్రాలు పఠించేవారి యెక్క ధార్మిక జీవితాన్ని రక్షించటానికి మరింతగా ఉపయోగించారు, మరియు మంత్రాలలోని భాగాలు కొన్ని మహాయాన సూత్రాలలో పొందుపరచారు, ఇందులో వైట్ లోటస్ సూత్రా, మరియు లంకావతార సూత్రా వంటివి ఉన్నాయి. రక్షించే పరిధి కూడా ఈ సమయంలో మారింది. సూత్రా ఆఫ్ గోల్డెన్ లైట్లో ఫోర్ గ్రేట్ కింగ్స్ జంబుద్వీపం(భారత ఉపఖండం) మొత్తాన్ని రక్షించటానికి, సూత్రాలను చాటిచెప్పే బౌద్ధసన్యాసులను కాపాడటానికి, మరియు సూత్రాలను చాటిచెప్పే సన్యాసులను రక్షించే రాజులను రక్షించడానికి దేవాంశ సంభూతుల యెక్క వేర్వేరు తరగతుల మీద అధికారాన్ని కలిగి ఉంటామని వాగ్దానం చేశారు. ఈ రకం యెక్క దేవత్వారోపణ పద్ధతిని నిచిరెన్ బౌద్ధమత పాఠశాలలో ఉంది, దీనిని 13వ శతాబ్దంలో జపాన్లో స్థాపించారు, మరియు ఇది గతంలోని అనేక క్లిష్టమైన బౌద్ధ అభ్యాసాలను డైమోకు పఠనంతో లోటస్ సూత్రం యెక్క పూజించే పద్ధతిగా దానిని తీసుకువచ్చారు: "నాం మ్యోహో రెంగే క్యో" దీనిని అనువాదం "లోటస్ సూత్రానికి వందనం" అని ఉంది.

కాంజ్ ప్రకారం మూడవ కాలం 7వ శతాబ్దంలో వారు యెక్క సొంత మార్గంలో కేంద్ర స్థానాన్ని పొంది మోక్షానికి ఒక వాహనంగా అయ్యారు. 6 మరియు 7వ శతాబ్దాలలో తంత్రం ప్రాముఖ్యతను పొందటం ఆరంధించింది, ఇది ప్రధానంగా పురాతనమైన 300CE లోని బౌద్ధ ఆకృతులలో కనిపించింది. మంత్రాయణ అనేది ఇప్పుడు చాలా సాధారణంగా పిలవబడే వజ్రాయణ యెక్క పూర్వ నామం, ఇది ఇండో-టిబెటన్ బౌద్ధమతంలో మంత్రం యెక్క స్థానాన్ని మనకు సూచిస్తుంది. వజ్రాయణ అభ్యాసం వల్ల అవలంబించేవారికి వాస్తవంగా ఉన్న వస్తువుల యెక్క వాస్తవికతను ప్రత్యక్షంగా ఇవ్వబడుతుంది. మంత్రాలు వాస్తవికత యెక్క చిహ్నాలుగా పనిచేస్తాయి, మరియు వేర్వేరు మంత్రాలు వాస్తవికత యెక్క వేర్వేరు భావాలను కలిగి ఉన్నాయి- ఉదాహరణకు జ్ఞానము లేదా కరుణ. మంత్రాలు తరచుగా ఒక కచ్చితమైన దైవంతో సంబంధం కలిగి ఉంటాయి, దీనికి ఒక మినహాయింపుగా ప్రజ్ఞాపరమిత మంత్రం హృదయ సూత్రంతో సంబంధం కలిగి ఉంది. వాస్తవికత యెక్క ప్రత్యక్ష అనుభవాన్ని బయటకు తీసుకురావటానికి వజ్రాయణా వ్యూహాలలో ప్రధానమైనది ఈ అభ్యాసాలలో సంపూర్ణ మానసిక-భౌతిక ప్రాణాన్ని వినియోగించడం. ఒక బౌద్ధ విశ్లేషణలో మానవుడు 'దేహం, వాక్కు, మరియు మనస్సును' కలిగి ఉంటాడు(ఇది: మూడు వజ్రాలను సూచిస్తుంది). అందుచే ఒక ముఖ్యమైన సాధన లేదా ధ్యానం అభ్యాసంలో ముద్రలను, లేదా ప్రతీకాత్మక కర అభినయాలను; మంత్రాల యెక్క పఠనాన్ని అలానే స్వర్గసంబంధమైన వాటిని వీక్షించడం మరియు పఠించిన మంత్రాల యెక్క అక్షరాలను దృశ్యసంవేదనం చేయడాన్ని పొందుపరచవచ్చు. ఇక్కడ స్పష్టంగా మంత్రం వాక్కుతో సంబంధం కలిగి ఉంది. ధ్యానం చేసేవారు మంత్రాక్షరాలను వారిముందు లేదా వారి దేహంలో గోచరించవచ్చు. వారు మంత్రాలను బిగ్గరగా లేదా వారి మనస్సులో అంతర్గతంగా ఉచ్ఛరించుకోవచ్చు.

ఓం మణి పద్మే హమ్సవరించు

బహుశా ఓం మణి పద్మే హమ్ అనేది బౌద్ధమతంలో అతి ప్రముఖమైన మంత్రం, ఆరు అక్షరాలు ఉన్న అవలోకితేశ్వర కరుణ యెక్క బోధిసత్త్వ మంత్రం (టిబెటన్: చెంరేజిగ్, చైనీస్: గుంయిన్ ). ఈ మంత్రం ముఖ్యంగా నాలుగు చేతులతో షడాక్షరీ ఆకారంలో ఉన్న అవలోకితేశ్వరతో సంబంధం కలిగి ఉంది. దలై లామాను అవలోకితేశ్వర యెక్క పునర్జన్మగా చెప్తారు, అందుచే ఈ మంత్రాన్ని అతని భక్తులు ముఖ్యంగా ఆరాధిస్తారు.

లామా అనగారిక గోవింద వ్రాసిన ఫౌండేషన్స్ ఆఫ్ టిబెటన్ మిస్టిసిజం పుస్తకం ఓం మణి పద్మే హమ్ వంటి మంత్రాలు ఏవిధంగా అనేక స్థాయిల సంకేత అర్థాన్ని కలిగి ఉంటాయనేది తెలపటానికి ఒక మహోన్నతమైన ఉదాహరణ.

డోనాల్డ్ లోపెజ్ ఒక చక్కటి చర్చను ఈ మంత్రం గురించి మరియు దాని యెక్క అనేక అన్వయింపుల గురించి అతని పుస్తకం ప్రిజనర్స్ ఆఫ్ షాన్గ్రి-LA: టిబెటన్ బుద్ధిజం అండ్ ద వెస్ట్లో అందించారు. లోపెజ్ ఒక ప్రావీణ్యమున్న రచయిత మరియు "కలువలోని మణి" అనే అర్థంతో ఉన్న మంత్రం యెక్క ఒకేరకమైన విశ్లేషణను సవాలు చేశారు, ఒక అన్వయింపును భాషాశాస్త్ర విశ్లేషణ కానీ లేదా టిబెటన్ సంప్రదాయం కానీ మరియు 'విదేశీ' ఈస్ట్ కు పాశ్చాత్య తూర్పుదేశాలకు చెందినవారి పద్ధతి యెక్క లక్షణశాస్త్రం కూడా మద్ధతును ఇవ్వలేదు. మణిపద్మ అనేది నిజానికి అవలోకితేశ్వర యెక్క ఆకారమైన బోధిసత్త్వ పేరు, ఇతనికి అనేక పేర్లు అనేక సందర్భాలలో ఉన్నాయి, ఇందులో పద్మపాణి లేదా చేతిలో కలువపూవు కూడా ఉంది. సంస్కృతం యెక్క పూర్తి కచ్చితమైన ఉచ్ఛారణ మీద ఉన్న బ్రాహ్మిణికల్ నిర్భంధం బౌద్ధమతం ఇతర దేశాలకు ఎగుమతి చేసిన తరువాత తీసివేయబడింది, ఇక్కడ నివాసితులు ఆ శబ్దాలను పునరుత్పత్తి చేయటం అసాధ్యంగా భావించారు. ఉదాహరణకు, టిబెట్లో మంత్రం చాలా మంది నిద్ర లేచే సమయంలో వారు చెప్తూవుంటారు, ఈ మంత్రాన్ని ఓం మణి పేమే హమ్ అని ఉచ్ఛరిస్తారు.

టిబెటన్ బౌద్ధమతంలో కొన్ని ఇతర మంత్రాలుసవరించు

ఈ క్రింద జాబితాలోని మంత్రాలు కైలాష్ - జర్నల్ ఆఫ్ హిమాలయన్ స్టడీస్, వాల్యూం 1, నెంబర్ 2, 1973 నుండి తీసుకోబడినాయి. (pp. 168–169) (ఇతర సహాయకులచే అభివృద్ధి చేయబడినాయి). ఇందులో ఓం మణి పద్మే హంగ్ యెక్క భాషాంతీకరణాలు ఉన్నాయి.

swaha అనే పదం కొన్నిసార్లు svahaగా సూచించబడినదని దయచేసి గమనించండి, మరియు దీనిని టిబెటియన్లు సాధారణంగా 'సో-హ' అని ఉచ్ఛరిస్తారు. ఆంగ్లంలోకి ప్రతిలేఖనం చేసినప్పుడు అక్షరక్రమం మారవచ్చు, ఉదాహరణకి hum మరియు hung ఒకే శబ్దానికి వాడబడతాయి. టిబెట్ బౌద్ధుల అభ్యాసంలో ఉపయోగించే మంత్రాలు వాటి సహజత్వాన్ని రక్షించడం కొరకు సంస్రృతంలో ఉంటాయి. దృష్టీకరణలు మరియు ఇతర అభ్యాసాలు సాధారణంగా టిబెటన్ భాషలో చేయబడతాయి.

 • ఓం వాగీశ్వరి హమ్ ఇది మహాబోధిసత్వ మంజుశ్రీ, టిబెటన్ మంత్రం: జంపెల్‌యాంగ్ (విలీ "'jam dpal dbyangs")... బుద్ధుడు అతని విచక్షణా స్థితిలో ఉన్నాడు.
 • ఓం మణి పద్మే హమ్ అవలోకితేస్వర, మహాబోధిసత్వ మంత్రం, బుద్ధుడు కరుణ స్థితిలో ఉన్నాడు.
 • ఓం వజ్రపాణి హమ్ రహస్య బోధనల యెక్క రక్షకుడుగా బుద్ధుడు ఉన్న మంత్రం. అది. .మహాబోధిసత్త్వ చన్న దొర్జే (వజ్రపాణి).
 • ఓం వజ్రసత్వ హమ్ వజ్రసత్వ కొరకు సంక్షిప్త మంత్రం, వజ్రసత్త్వ కొరకు పూర్తి 100-అక్షరాల మంత్రం ఉంది.
 • ఓం అహ్ హమ్ వజ్ర గురు పద్మ సిద్ధి హమ్ ఇది వజ్రగురు గురు పద్మ సంభవ యెక్క మంత్రం, ఈయన మహాయాన బౌద్ధమతం మరియు టిబెట్ లోని తంత్రాను స్థాపించారు.
 • ఓం తారే తుత్తారే తురే స్వాహ ఇది జెట్సన్ డోల్మా లేదా బౌద్ధుల తల్లి తార యెక్క మంత్రం.
 • ఓం తారే తుత్తారే తురే మమ ఆయుర్‌జ్ఞాన పుణ్యే పుష్టిం స్వాహ అనేది డోల్కర్ లేదా తెల్లటి తార జనించే మంత్రం
 • ఓం (Oh-m) తారే (Tar-ay) తుతారే (Too-tar-ay) తురే (Too-ray) సోహ (So-hah), పచ్చటి తార యెక్క మంత్రం- ఓం తార యెక్క పవిత్రమైన దేహం, వాక్కు మరియు మనస్సును సూచిస్తుంది. TARE అనగా అసంతృప్తి నుండి స్వేచ్ఛను పొందడం. TUTARE అనగా ఎనిమిది భయాలు, బహిరంగ అపాయాలు, కానీ ముఖ్యంగా అంతర్గత భయాలు, మాయ నుండి స్వేచ్ఛను పొందడం. TURE అనగా ద్వంద్వత్వం నుండి స్వేచ్ఛను పొందడం; ఇది కలవరం యెక్క నిజమైన ముగింపును చూపిస్తుంది. SOHA అనగా "మంత్రార్థం నా మనస్సులో నాటుకొని ఉండాలి."

టిబెటన్ బౌద్ధమతం ప్రకారం, ఈ మంత్రం (ఓం తారే తుతారే తురే సోహ) కేవలం వ్యాధులనే కాకుండా కష్టాలు మరియు కర్మల విపత్తులను తొలగిస్తుంది, నమ్మకస్థుల ఆశీర్వాదాలను, దీర్ఘ ఆయుష్షును మరియు మనిషి పునర్జన్మ చక్రాన్ని అధిగమించడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తుంది. దీర్ఘ ఆయుష్షును మరియు ఆరోగ్యాన్ని తార సూచిస్తుంది.

 • ఓం అమరాని జివంతియే స్వాహ అనేది బుద్ధుని యెక్క పరిమితిలేని జీవితం యెక్క మంత్రం: బుద్దా అమితాయుస్ (Tibetan Tsépagmed) స్వర్గసంబంధ ఆకృతిలో ఉంటారు.
 • ఓం ద్రుంగ్ స్వాహ అనేది మాతా నాంగ్యాల్మ యెక్క పవిత్రతా మంత్రం.
 • ఓం అమీ దేవ హ్రీ అనేది పశ్చిమ ప్యూర్‌లాండ్ యెక్క బౌద్ధుడు అమితాభ (హోపగ్మేడ్) మంత్రం, అతని చర్మం అస్తమిస్తున్న సూర్యుడి రంగును కలిగి ఉంది.
 • ఓం అమీ దేవా హ్రీ అమితాభ యెక్క మంత్రం (టిబెటన్ లోని ఓంపగ్మే).
 • ఓం అహ్ రా పా త్సా నా ధిహ్ "మధురమైన-కంఠస్వరం ఉన్నవారు", జంపేల్యాంగ్ (విలీ "'jam dpal dbyangs") లేదా మంజుశ్రీ, జ్ఞానం యెక్క బోధిసత్త్వ యెక్క మంత్రం.
 • ఓం ముని ముని మహా మునియే సక్యముని స్వాహా ఇది చారిత్రాత్మక బుద్ధుడైన బుద్దా సక్యముని యెక్క మంత్రం
 • ఓం గతే గతే పరాగతే పరసంగతే బోధి స్వాహ అనేది పరిపూర్ణమైన జ్ఞాన సూత్రం యెక్క హృదయ మంత్రం (హార్ట్ సూత్రా)
 • ఓం మైత్రి మైత్రేయ మహా కరుణ యే మైత్రి మంత్రం అనేది మైత్రేయ యెక్క బీజ మంత్రం.
 • నమో భగవతే భైషజ్య-గురు వైడూర్య-ప్రబ-రాజాయ తతగతాయ అర్హతే సమ్యాక్-సమబుద్ధాయ తద్యత *తద్యత ఓం భైషజ్యే భైషజ్యే మహా భైషజ్య రాజా-సముద్గతే స్వాహ 'మెడిసిన్ బుద్దా' యెక్క మంత్రం, మాస్టర్ ఆఫ్ హీలింగ్ సూత్రా యెక్క చైనీస్ తర్జుమా నుండి పొందబడింది.

ఇతర శాఖలలో మరియు ప్రాంతాలలో మంత్రాలుసవరించు

సిక్కు మతంలో మంత్రాలుసవరించు

సిక్కు మతంలో, మంతర్ లేదా మంత్రం అనేది గుర్బని నుండి తీసుకోబడిన శబ్దం (పదం లేదా శ్లోకం), దేవుడి మీద మరియు పది గురువుల యెక్క సందేశాల మీద మనస్సును కేంద్రీకరించటానికి చెప్పబడుతుంది.

మంత్రాలు ప్రాథమిక ప్రాముఖ్యత యెక్క రెండు అంశాలను కలిగి ఉన్నాయి- అవి శబ్దం మరియు శబ్దం . మొదటిది పదం లేక పదాల యెక్క వాస్తవ అర్థాన్ని మరియు రెండవది ప్రభావవంతమైన శబ్దాన్ని ఇస్తుంది(vibration). మంత్రం ప్రభావవంతంగా ఉండటానికి, సరైన ఉచ్ఛరణ మీద మరియు పఠనం చేసిన పదం లేదా పదాల యెక్క అర్థం మీద మనస్సును కేంద్రీకరించే స్థాయి మీద అధిక శ్రద్ధను ఉంచబడుతుంది.

దీని ప్రాముఖ్యత కారణంగా మంత్రాలు పఠనం చేసే స్థలం మరియు చుట్టు ప్రక్కల గురించి; అవి ఏవిధంగా పలకబడుతున్నాయి- అనగా., ఎంత గట్టిగా; నిశ్శబ్దంగా అనేవి; సమూహంలో; సంగీతంతో; సంగీతం లేకుండా; మొదలైనవాటి గురించి శ్రద్ధ తీసుకోవాలి. మంత్రాల వల్ల ముఖ్యంగా మనస్సు భ్రమ మరియు ప్రాపంచిక విషయాల నుండి విడుదలకావటానికి ఇంకనూ మనస్సు మీద దృష్టిని మరియు ఏకాగ్రతను తీసుకురావటానికి వీలవుతుంది.

సామెతలు : మంత్రాలకు చింతకాయలు రాలవు.

సిక్కుమతం యెక్క ప్రధాన మంత్రాలు :

ఇతర సంప్రదాయాలు లేదా సందర్భాలలో మంత్రాలుసవరించు

ఈ మంత్రాలు మనిచైయిజంలో ఉన్నాయి, వీటిలో Qīngjìng guāngmíng dàlì zhìhuì wúshàng zhìzhēn móní guāngfó (清淨光明大力智慧無上至真摩尼光佛) వంటివి ఉన్నాయి.[39][40]

తావోయిజంలో శబ్దాలు డఫాన్ యిణ్యు వులింగ్ యిన్ (大梵隱語無量音)వంటివి మరియు టిబెటన్ బౌద్ధమతంలోని మంత్రం ఓం (唵)కూడా మంత్రాలే.[41]

ఇస్లాం లో మంత్రాలుసవరించు

 • సూఫీ ప్రార్థన ల్లో, అల్లా యెక్క 99 పేర్ల,ప్రవక్త యెక్క పేర్లు పఠిస్తారు.దిక్ర్.
 • ఇస్లాం నిషేధించిన దురాచారాలలో మంత్రాలు ఒకటి.గల్ఫ్ దేశాలన్నీ మంత్రాలను నిషేధించాయి.
 • అరబ్బు దేశాలలో మహిళలు తమ భర్తలు మరో పెళ్ళి చేసుకోకుండా మంత్రగాళ్ళను ఆశ్రయిస్తారు. అరబ్ దేశాలలో సుమారు అయిదు లక్షల మంది మంత్రగాళ్ళు న్నారు.
 • మక్కాలో దయ్యాల భయానికి కోట్లాది రూపాయల విలువ చేసే భవనాలను ఖాళీ చేశారు.
 • ప్రభుత్వ లైసెన్సు లేకుండా మంత్రాలు చదివే సమయంలో లేదా కాగితాలపై మంత్రాలను రచించే సమయంలో పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేస్తే బెయిలు దొరకకపోగా, శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి.
 • ఖననం చేసిన శిశువుల మృతదేహాలను దొంగిలించి మంత్రాలు చదువుతున్నారని ప్రతి పున్నమి రోజున శ్మశాన వాటికల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.
 • మంత్రాలు చేసిన నేరానికి బహిరంగ శిరచ్ఛేధం చేస్తారు లేదా కొరడా దెబ్బల శిక్షను విధిస్తారు.
 • మంత్రాలు చదివిన తర్వాత సముద్ర జలాల్లో పారేసే భూతాన్ని వెలికి తీయడానికి పోలీసులు ప్రత్యేక గజ ఈతగాళ్ళను నియమిస్తున్నారు.
 • తమ వద్ద పనిచేసే విదేశీ ఉద్యోగులు తమ ప్రగతి, సుఖానికి సంబంధించి దిష్టి పెడుతున్నారని,ఏదైనా వస్తువు పగిలిపోతే లేదా మనిషికి జ్వరం వస్తే ఫలానా మనిషి కారణంగా ఇది జరిగిందని అరబ్బులు ఫిర్యాదు చేస్తుంటారు.

యూదా మతంలోసవరించు

 • ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములవలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను,శకునగాండ్రు కూడా తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. (నిర్గమ 7)
 • నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆయాకాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును.(సంఖ్యా కాండము 23:23)
 • బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి, ముహూర్తము లను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచ ములతోను సోదె గాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను.(2 దినవృత్తాంతములు 33:6)
 • నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు (ఇర్మియా 8:17)
 • యూదులచే ఏర్పడిన బ్రెస్లోవేర్ హసిడుట్ సంఘం యెక్క ప్రముఖ మంత్రం నా నాచ్ నచ్మా నచ్మన్ మే'ఉమన్.

క్రైస్తవ మతంలోసవరించు

 • ధ్యానంను డోమ్ జాన్ మెయిన్ బోధించారు, అందులో మంత్రాన్ని నిశ్శబ్దంగా పునరుశ్చరణం చేయటం ఉంటుంది. హెసిచాస్మ్ కూడా చూడండి.
 • ఏసు తన శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థనను పదే పదే పునరావృతం చేస్తే మంత్రం లాంటి ప్రభావం ఉంటుందని నమ్మకం.
 • మంత్రపు కట్టులేక పాము కరిచినయెడల మంత్రగానిచేత ఏమియు కాదు (ప్రసంగి 10:11)
 • తాము చేయు చున్న నరహత్య లును మాయమంత్రములును జారచోరత్వ ములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి;(ప్రకటన గ్రంథం 9:21,18:22)

ఇవి కూడా చూడండిసవరించు

గమనికలుసవరించు

 1. ఖన్నా, మధు (2003). యంత్ర: ది తంత్రిక్ సింబల్ ఆఫ్ కాస్మిక్ యూనిటీ. ఇన్నర్ ట్రెడిషన్స్. ISBN 0892811323 & ISBN 978-0892811328. p.21
 2. మక్డోనెల్, ఆర్థర్ A., అ సన్స్క్రిత్ గ్రామర్ ఫర్ స్టూడెంట్స్ § 182.1.b, p. 162(ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రెస్, 3వ ముద్రణ, 1927).
 3. విట్నీ, W.D., సన్స్క్రిత్ గ్రామర్ § 1185.c, p. 449(న్యూ యార్క్, 2003, ISBN 0-486-43136-3).
 4. 4.0 4.1 Schlerath, Bernfried (1987), ""Aša: Avestan Aša"", Encyclopaedia Iranica, 2:694-696, New York: Routledge & Kegan Paul p. 695.
 5. పరంహంస్ స్వామి మహేశ్వరానంద, ది హిడెన్ పవర్ ఇన్ హ్యూమన్స్, ఐబెరా వెర్లగ్, 2004, పుటలు 58-62 ISBN 3-85052-197-4
 6. పరంహంస్ స్వామి మహేశ్వరానంద, ది సిస్టం “యోగ ఇన్ డైలీ లైఫ్”, 2005 ఐబెరా వెర్లగ్, ISBN 3-85052-000-5, p. 400-401
 7. అ డిక్షనరీ ఆఫ్ హిందూయిజం, మార్గరెట్ అండ్ జేమ్స్ స్టుట్లే (మున్షిరామ్ మనోహర్లాల్ పబ్లిషర్స్) 2002, p.126
 8. అ డిక్షనరీ ఆఫ్ హిందూయిజం, pp.57,58
 9. అ డిక్షనరీ ఆఫ్ హిందూయిజం, p.156
 10. మెడిటేషన్ అండ్ మంత్రాస్, స్వామి విష్ణు-దేవానంద (మోతిలాల్ బనారసీదాస్ పబ్లిషర్స్) 1981, p.66
 11. 11.0 11.1 శక్తి మంత్రాస్, థామస్ ఆష్లే-ఫర్రాండ్ (బాల్లన్టైన్ బుక్స్) 2003, p.182
 12. అ డిక్షనరీ ఆఫ్ హిందూయిజం, p.271
 13. మోడిటేషన్ అండ్ మంత్రాస్, p.75
 14. 14.0 14.1 14.2 మోడిటేషన్ అండ్ మంత్రాస్, p.80
 15. షియర్,జోనతోన్,సంపాదకుడు.ది ఎక్సపీరియన్స్ ఆఫ్ మోడిటేషన్: ఎక్సపర్టస్ ఇంట్రడ్యూస్ ది మేజర్ ట్రెడిషన్స్ ,pg.28.పారగోన్ హౌస్. St పాల్, MN.,2006.
 16. హిందూమతంలో అవకాశం ఉన్న సందర్భాలలో జప విధానాన్ని పునరావృతం చేయడం.
 17. ఏక్నాథ్ ఈశ్వరన్ (2008). ది మంత్రం హ్యాండ్‌బుక్ (5th ed.). టోమలెస్, CA: నీలగిరి ప్రెస్. ISBN 1586380281 (ముందుగా 1977లో ప్రచురించారు).
 18. జిల్ E. బోర్మన్, స్టీవెన్ తోర్ప్, జూలీ L. వెతేరెల్, & శాహ్రోఖ్ గోల్స్హన్ (2008). మతసంబంధ ఆధారంగా ఉన్న సంఘం యెక్క చేరిక ప్రమాదం తరువాత క్రమభంగాలు ఉన్నవారి కొరకు ఏర్పడింది. జర్నల్ ఆఫ్ హోలిస్టిక్ నర్సింగ్ v26 n2, pp 109-116. PMID 18356284, DOI: 10.1177/0898010107311276.
 19. జిల్ E. బోర్మన్ & డౌగ్ ఒమన్ (2007). మంత్రం లేదా పవిత్రమైన పేరు పునరుశ్చరణ: సంక్షిప్త మతసంబంధ అభ్యాసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు. థామస్ G. ప్లాంటే, & కార్ల్ E. తోరేసెన్ (Eds.), స్పిరిట్, సైన్స్ అండ్ హెల్త్: హౌ ది స్పిర్చువల్ మైండ్ ఫ్యూయల్స్ ఫిజికల్ వెల్నస్ (pp. 94-112) (అంశాల పట్టిక), వెస్ట్‌పోర్ట్, CT: ప్రాగెర్. ISBN 978-0-275-99506-5
 20. "pinyin of ten mantras". మూలం నుండి 2007-03-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-03-24. Cite web requires |website= (help)
 21. ఇంట్రడక్షన్ టు మహాయాన బుద్ధిస్ట్స్ సూత్రాస్ అండ్ ృ మంత్రాస్
 22. http://www.siddham-sanskrit.com/s-sanskrit2/ChuaBTuan/Ten-small-mantras.htm
 23. క్వాంగ్ డుక్
 24. తు వీన్ హా సేన్
 25. వాన్ ఫట్ డన్హ: కాంగ్ ఫు ఖుయ
 26. http://www.dharmaradio.org/dharmatalks/mp3/B101/On_Mahayana_Practice.pdf
 27. 本師『大自在王佛』的出處
 28. 問(無太佛彌勒)是什麼意思 ?
 29. http://www.tbsn.org/chinese/sutra/West/WEST43.htm
 30. http://www.ctestimony.org/gb108/108034.htm
 31. http://www.laijohn.com/archives/pc/Tan,Khong/auto-talk/2.htm
 32. 口訣辨正
 33. 同善社#
 34. 在理教与杨柳青
 35. "(三)理 教". మూలం నుండి 2011-06-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-20. Cite web requires |website= (help)
 36. "畫符念咒:清代民間秘密宗教的符咒療法" (PDF). మూలం (PDF) నుండి 2012-03-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-20. Cite web requires |website= (help)
 37. 歹年冬,厚肖人
 38. "人生守則廿字真言感恩、知足、惜福,天帝教祝福您!". మూలం నుండి 2012-03-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-20. Cite web requires |website= (help)
 39. 摩尼教“大神咒”研究 - 傳統中國研究
 40. 摩尼教的转世生命:从救世到捉鬼
 41. 道教咒術初探

సూచనలుసవరించు

 • అబే, R. ది వీవింగ్ ఆఫ్ మంత్ర: కుకై మరియు అంతర్భూతమైన బౌద్ధుల యెక్క నిర్మాణంపై ఉపన్యాసం . న్యూ యార్క్: కొలంబియా యూనివర్సిటీ ప్రెస్, 1999.
 • బెయేర్, S. మేజిక్ అండ్ రిచ్యువల్ ఇన్ టిబెట్: ది కల్ట్ ఆఫ్ తార . (ఢిల్లీ: మోతిలాల్ బానర్సిస్‌దాస్, 1996).
 • కాంజ్, E. బుద్ధిజం : ఇట్స్ ఎస్సన్స్ అండ్ డెవలప్మెంట్ . (లండన్ : ఫాబెర్, c1951).
 • ఏక్నాథ్ ఈశ్వరన్ మంత్రం హ్యాండ్‌బుక్ నీలగిరి ప్రెస్ (4th ed. ISBN 9780915132980) (5th ed. ISBN 9781586380281
 • గెలోన్గ్మ కర్మ ఖేచోంగ్ పల్మో. మంత్రాస్ ఆన్ ది ప్రేయర్ ఫ్లాగ్ . కైలాష్ - జర్నల్ ఆఫ్ హిమాలయన్ స్టడీస్, వాల్యూం 1, నెంబర్ 2, 1973. (pp. 168–169).
 • గోమ్బ్రిచ్, R. F. తెరవాడ బౌద్ధమతం: ప్రాచీన బెనారస్ నుండి ఆధునిక కొలంబో వరకు సాంఘిక చరిత్ర . (లండన్, రౌట్‌లెడ్జ్, 1988)
 • గోవింద (లమ అనగారిక). ఫౌండేషన్స్ ఆఫ్ టిబెటన్ మిస్టిసిజం . (లండన్ : రిడెర్, 1959).
 • ఖన్నా, మధు. యంత్ర: ది తంత్రిక్ సింబల్ ఆఫ్ కాస్మిక్ యూనిటీ. (ఇన్నెర్ ట్రెడిషన్స్, 2003). ISBN 089 2811 323 & ISBN 089 2811 328
 • లోపెజ్, D. ప్రిజనర్స్ ఆఫ్ శాంగ్రి-లా: టిబెటన్ బుద్ధిజం అండ్ ది వెస్ట్ . (చికాగో : చికాగో విశ్వవిద్యాలయ ముద్రణ, 1998)
 • ములిన్, G.H. ది దలై లామాస్ ఆన్ తంత్రా, (ఇథకా : స్నో లయన్, 2006).
 • ది రిడెర్ ఎన్సైక్లోపెడియా ఆఫ్ ఈస్టర్న్ ఫిలాసఫీ అండ్ రెలిజియన్ . (లండన్ : రిడెర్, 1986).
 • స్కిల్టన్, A. బుద్ధిజం యెక్క ఒక సంక్షిప్త చరిత్ర . (బిర్మింగ్హం : విండ్హార్స్ పబ్లికేషన్స్, 1994).
 • సంఘరక్షిత. ట్రాన్స్‌ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ వరల్డ్: గోల్డెన్ లైట్ సూత్రం నుండి పొందిన అంశాలు . (బిర్మింగ్‌హాం : విండ్‌హార్స్ పబ్లికేషన్స్, 1994).
 • వాల్ష్, M. ది లాంగ్ డిస్కోర్స్స్ ఆఫ్ బుద్ధా: డిఘ నికాయ యెక్క అనువాదం . (బోస్టన్ : విజ్డం పబ్లికేషన్స్, 1987)
 • దుర్గానంద, స్వామి. మెడిటేషన్ రివల్యూషన్ . (ఆగమ ప్రెస్, 1997). ISBN 0-9654096-0-0
 • విష్ణు-దేవానంద, స్వామి. మెడిటేషన్ అండ్ మంత్రాస్ . (మోతిలాల్ బనర్సిదాస్ ప్రచురణకర్తలు, 1981). ISBN 81-208-1615-3
 • ఆష్లే-ఫరాండ్, థామస్. శక్తి మంత్రాస్ . (బాల్లన్టైన్ బుక్స్ 2003). ISBN 0-345-44304-7
 • స్టుట్లే, మార్గరెట్ అండ్ జేమ్స్. అ డిక్షనరీ ఆఫ్ హిందూయిజం . (మున్షిరామ్ మనోహర్లాల్ ప్రచురణలు, 2002). ISBN 81-215-1074-0

బాహ్య లింక్లుసవరించు

హిందూమత మంత్రంసవరించు

బౌద్ధుల మంత్రాలుసవరించు

వేద మరియు హిందూ మంత్రాలుసవరించు

మూస:బౌద్ధమతం విషయాలు

"https://te.wikipedia.org/w/index.php?title=మంత్రం&oldid=2800592" నుండి వెలికితీశారు