దుష్యంత్ చౌతాలా

దుష్యంత్ సింగ్ చౌతాలా (జననం 3 ఏప్రిల్ 1988) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 27 అక్టోబర్ 2019 నుండి హర్యానా రాష్ట్ర 6వ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

దుష్యంత్ చౌతాలా
దుష్యంత్ చౌతాలా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 అక్టోబర్ 2019
గవర్నరు సత్యదేవ్ నారాయణ్ ఆర్య
బండారు దత్తాత్రేయ
ముందు చందర్ మోహన్

జననాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 డిసెంబర్ 2018

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
24 అక్టోబర్ 2019
ముందు ప్రేమలత సింగ్
నియోజకవర్గం ఉచన

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందు కుల్దీప్ బిష్ణోయ్
తరువాత బ్రిజేంద్ర సింగ్
నియోజకవర్గం హిసార్

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు,
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
14 జులై 2019

టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అఫ్ ఇండియా అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 జనవరి 2017

వ్యక్తిగత వివరాలు

జననం (1988-04-03) 1988 ఏప్రిల్ 3 (వయసు 35)
Hisar, హర్యానా, భారతదేశం
రాజకీయ పార్టీ జననాయక్ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (డిసెంబర్ 2018 వరకు)
బంధువులు ఓం ప్రకాశ్ చౌతాలా (తాత)
పూర్వ విద్యార్థి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (బీఎస్సీ)
నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ (ఎల్‌ఎల్‌ఎం) [1]

రాజకీయ జీవితం మార్చు

దుష్యంత్ చౌతాలా 2014లో లోక్‌సభ ఎన్నికలలో హిసార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికై అతి పిన్న వయస్కుడైన సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. ఆయన 2014 నుండి 2016 వరకు పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 2015 నుండి 2018 వరకు స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, 2016 నుండి 2019 వరకు వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. దుష్యంత్ చౌతాలా 2019 ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయాడు.

దుష్యంత్ చౌతాలా 2019 హర్యానా శాసనసభ ఎన్నికలలో జననాయక్ జనతా పార్టీ నుండి ఉచన కలాన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై భారతీయ జనతా పార్టీతో పొత్తుల్లో భాగంగా హర్యానా ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]

మూలాలు మార్చు

  1. "Dushyant Chautala(Jannayak Janta Party):Constituency- HISAR(HARYANA) - Affidavit Information of Candidate".
  2. The New Indian Express (27 October 2019). "The phenomenal rise of Dushyant Chautala, Lok Sabha's youngest MP and Deputy CM of Haryana". Archived from the original on 7 September 2022. Retrieved 7 September 2022.
  3. NDTV (28 October 2019). "Haryana Swearing-In Ceremony - "Biggest Gift," Says Ajay Chautala As Son Dushyant Takes Oath". Archived from the original on 7 September 2022. Retrieved 7 September 2022.