బండారు దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ 1947 జూన్ 12న జన్మించారు.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు.
బండారు దత్తాత్రేయ | |||
| |||
18వ హర్యానా రాష్ట్ర గవర్నర్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 జులై 2021 - ప్రస్తుతం | |||
రాష్ట్రపతి | రాంనాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ముందు | సత్యదేవ్ నారాయణ్ ఆర్య | ||
20వ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్
| |||
పదవీ కాలం 11 సెప్టెంబర్ 2019 – 6 జులై 2021 | |||
ముందు | కాలరాజ్ మిశ్రా | ||
కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 1 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | నరేంద్ర సింగ్ తోమార్ | ||
తరువాత | సంతోష్ గంగ్వార్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | ఎం.అంజన్ కుమార్ యాదవ్ | ||
తరువాత | జి.కిషన్ రెడ్డి | ||
నియోజకవర్గం | సికింద్రాబాద్ | ||
పదవీ కాలం 10 మార్చ్ 1998 – 16 May 2004 | |||
ముందు | పీవీ. రాజేశ్వర్ రావు | ||
తరువాత | ఎం.అంజన్ కుమార్ యాదవ్ | ||
నియోజకవర్గం | సికింద్రాబాద్ | ||
పదవీ కాలం 20 జూన్ 1991 – 10 మే 1996 | |||
ముందు | టంగుటూరి మణెమ్మ | ||
తరువాత | పీవీ. రాజేశ్వర్ రావు | ||
నియోజకవర్గం | సికింద్రాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గౌలిగూడ, హైదరాబాద్, హైదరాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం | 1947 జూన్ 12||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | వసంత (పెళ్లి - 1989) | ||
సంతానం | బండారు విజయలక్ష్మి, బండారు వైష్ణవ్ | ||
నివాసం | రాంనగర్, హైదరాబాద్, తెలంగాణ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ (బీఎస్సీ) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కేబినెట్ | వాజపేయి 2వ మంత్రివర్గం వాజపేయి 2వ మంత్రివర్గం నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గం | ||
వెబ్‌సైటు | bandarudattatreya.org |
సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు 3 సార్లు ఎన్నికైనారు. అటల్ బిహారీ వాజపేయి హయంలో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు.[2]
దత్తాత్రేయ 2021 జులై 18న, హర్యానా 18వ గవర్నర్‌గా నియమితులయ్యారు.[3]
జననం
మార్చుబండారు దత్తాత్రేయ 1947 జూన్ 12 వ తేదీన హైదరాబాద్ గౌలిగూడలో జన్మించాడు.[4] ఆయన తండ్రి బండారు అంజయ్య, తల్లి బండారు ఈశ్వరమ్మ. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన డిగ్రీ పూర్తి చేశారు. బండారు దత్తాత్రేయ 1989 లో వసంతతో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు పిల్లలు విజయలక్ష్మి, బండారు వైష్ణవ్.[5]
రాజకీయ ప్రస్థానం
మార్చు1980లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనారు. 1981-89 కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. బండారు దత్తాత్రేయ తొలిసారిగా 1991లో సికింద్రాబాదు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైనారు.
1996-98 కాలంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1998, 1999లలో కూడా ఇదే స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించడమే కాకుండా రెండు సార్లు కేంద్ర మంత్రిమండలిలో స్థానం పొందారు. కేంద్రంలో పలు పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు. తిరిగి..2014 ఎన్నికల్లోనూ ఆయన సికింద్రాబాద్ స్థానం నుంచే పార్లమెంట్కు ఎన్నికయ్యారు.
బండారు దత్తాత్రేయ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు.2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ దక్కలేదు. 2019 లో కేంద్ర ప్రభుత్వం బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు.[6][7]
గవర్నర్
మార్చుబండారు దత్తాత్రేయను 2019 సెప్టెంబరు 1న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది. ఆయన 2019 సెప్టెంబరు 11న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 27వ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశాడు.[8] హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హరియాణా గవర్నర్‌గా నియమిస్తూ 2021 జూన్ 6న రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.[9][10][11] ఆయన హర్యానా 18వ గవర్నర్‌గా 15 జూలై 2021న ప్రమాణ స్వీకారం చేశాడు.[12]
ఇతర విశేషాలు
మార్చుదసరా పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయిక పద్ధతిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో[13] అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటారు. ఈ సందర్భంగా రాజకీయ సామాజిక ప్రముఖులను ఆహ్వానించి, తెలంగాణ సాంప్రదాయిక వంటకాలతో విందు ఇస్తారు. కరోనా కారణంగా 2020లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ఆయన ప్రకటించాడు.[14]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-03. Retrieved 2014-02-06.
- ↑ Outlook India (2020). "Outlook India Photo Gallery - Bandaru Dattatreya". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ "Bandaru Dattatreya sworn in as 18th governor of Haryana". The Indian Express (in ఇంగ్లీష్). 15 July 2021. Retrieved 10 March 2022.
- ↑ Sakshi (12 June 2020). "దత్తన్నకు జన్మదిన శుభాకాంక్షలు". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ The News Minute (23 May 2018). "Former Union Minister Bandaru Dattatreya's 21-yr-old son dies of heart attack" (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ నమస్తే తెలంగాణ (2 September 2019). "ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు". ntnews.com. Archived from the original on 2 September 2019. Retrieved 2 September 2019.
- ↑ సాక్షి, హోం » తెలంగాణ (2 September 2019). "గౌలిగూడ టు సిమ్లా". Sakshi. Archived from the original on 2 September 2019. Retrieved 2 September 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (11 September 2019). "హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం". ntnews.com. Archived from the original on 11 September 2019. Retrieved 11 September 2019.
- ↑ EENADU (6 July 2021). "మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
- ↑ BBC News తెలుగు. "మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, దత్తాత్రేయ హరియాణాకు." Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
- ↑ TV9 Telugu (6 July 2021). "గవర్నర్లుగా రాణించిన మన తెలుగు వారు.. తాజాగా హరిబాబుతో పదికి చేరిన సంఖ్య. మిగతా వారెవరంటే". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (15 July 2021). "హర్యానా 18వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం.. వీడియో - Bandaru Dattatreya takes oath as Governor of Haryana in Chandigarh". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ నమస్తే తెలంగాణ (2 October 2017). "తెలంగాణ సంస్కృతి గొప్పది". ntnews.com. నమస్తే తెలంగాణ. Archived from the original on 2 September 2019. Retrieved 2 September 2019.
- ↑ The New Indian Express (25 October 2020). "No Alai Balai this year, announces Bandaru Dattatreya". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.