విజయనగర సామ్రాజ్యం చివరి పాదంలోనూ, తరువాత కొంతకాలం రాయలసీమలో కొంతభాగానికి స్థానిక నాయకులుగా లేక రాజప్రతినిధులుగా పనిచేసిన ఒక వంశం వారిని సాయపనేని కమ్మ నాయకులు అని అంటారు[1][2].

సాయపనేని నాయకులు చరిత్ర శ్రీ కృష్ణదేవరాయల వారి కాలంనుండి తెలియవస్తుంది[3]. యుద్ధములలో సాయప్ప నాయుని శౌర్యపరాక్రమాలకు సంతసించిన రాయలవారు శ్రీశైలం దగ్గరలోవున్న గుడిపాడు గ్రామంను అమరంగా వ్రాసి ఇచ్చారు.సాయప్ప కొడుకు వేంగళ నాయుడు, మనుమడు వేంకటాద్రి నాయుడు తదుపరి ఈ అమరంను 533 గ్రామములుగా విస్తరించారు. దీనిని దూపాటి సీమ అంటారు. అరవీటి వంశస్థులు, గొల్లకొండ సుల్తానుల సంధి కాలమున శాయపనేని వారు పలు కష్టములకోర్చి పాలన సాగించారు. వీరు ఎదుర్కొనిన క్లిష్ఠ పరిస్థితులను దూపాటి కైఫీయతులో ఒక కరణం చాల చక్కగా వర్ణించెను[4]

గంగయ్య నాయుడు 1564 ప్రాంతంలో రామరాయల వారి సేనాధిపతిగా ఉన్నాడు. వేంకటాద్రి రచించిన ప్రబంధము 'సకలజనసంజీవనము' తెలుగు సాహిత్యములో ఎన్నదగిన గ్రంథము. గండికోట పాలకుడగు తిమ్మానాయుడు వేంకటాద్రి సోదరి వేంకటాంబను పెండ్లాడెను.

1626లో గంగప్ప నాయుని కాలములో రాయలసీమ గొల్లకొండ సుల్తానుల వశమైనది. శాయపనేని వారు సుల్తానులకు తలొగ్గక తప్పలేదు. 1802లొ థామస్ మన్రో గొల్లకొండ నవాబు నుండి రాయలసీమను పొంది బ్రిటిషు రాజ్యంలో కలిపాడు.

మూలాలుసవరించు

  1. సాయపనేనివారి చరిత్ర: పరిశోధక గ్రంథము, కొడాలి లక్ష్మీనారాయణ, 1976, ఇతిహాస పరిశోధకమాల
  2. కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
  3. Copper Plate and Stone Inscriptions of South India, Alan Butterworth and V. V. Chetty, 1905, Government of Madras, p. 1174
  4. Textures of Time: Writing History in South India, V. Narayanarau, D. D. Shulman and S. Subrahmanyam, 2003, Other Press LLC, pp. 264-270, ISBN 1590510445

వెలుపలి లంకెలుసవరించు