దూబగుంట నారాయణకవి

తెలుగు కవి

పంచతంత్రం అను నీతికథలను సంస్కృతము నుండి తెలుగులోకి అనువదించిన కవులలో ప్రముఖులలో ఒకరు ఈ దూబగుంట నారాయణకవి. ఈయన కాలాన్ని నిశ్చయించుటకు సరిఅయిన ఆధారములు మాత్రం దొరకలేదు. కాని ఈయన సా.శ. 1400-1500 మధ్యకాలానికి సంబంధిచిన వాడని చెప్పుదురు. నారాయణకవి తాను కృతి ఇచ్చిన [[బసవరాజు శ్కడుకు అయిన కుశుని వంశమువాడట. కుశుని వంశములో బెజవాడ దుర్గను మెప్పించి రాజయిన మాధవవర్మ పుట్టినాడు. అతని వంశములో కొమ్మరాజు, అతనికి అన్నలదేవుడు, అతనికి సింగరాజు, అతనికి పెదవల్లభుడు, పినవల్లభుడు అను ఇద్దరు. వారిలో పెదవల్లభునికి అన్నలదేవివలన సింగరాజు, తమ్మరాజు, తిరుమలరాజు అని ముగ్గురు. వారిలో తమ్మరాజుకున్ను వేమాజమ్మకున్ను కృతిభర్త బసవరాజు పుట్టినాడు. నారాయణకవి తాను బ్రహ్మయ్య కును, నాగమాంబ కున్ను పుత్రుడనని చెప్పుకున్నాడు. కాని తన వంశమును గురుంచి ఎక్కువగా చెప్పలేదు. ఇతని గురువు నాగనార్యుడు.

నెల్లూరు మండలములో ఉదయగిరిలో కుంటమరాజు వల్లభయ్య కుమారుడు తమ్మరాజు. సం.1460లో గోపాలకృష్ణ దేవాలయమును కట్టించినట్లు ఒక శిలాశాసన మున్నది, కృతిభర్త తండ్రి ఈతమ్మరాజే అయితే కృతికర్త అతనికొడుకు కాలములో సుమారు సం. 1500 లో ఉండి ఉండవచ్చునని వీరేశలింగం పంతులుగారు ఊహించారు.