దూలం నాగేశ్వర రావు

దూలం నాగేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

దూలం నాగేశ్వర రావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 09 జూన్1957
కైకలూరు, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు దూలం వీరన్న, బూసమ్మ
జీవిత భాగస్వామి వీరకుమారి
సంతానం వీర ఆది వినయ్‌కుమార్, వీర శ్యామ్‌ ఫణికుమార్‌
నివాసం కైకలూరు

జననం, విద్యాభాస్యం

మార్చు

దూలం నాగేశ్వర రావు 09 జూన్1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలం, కైకలూరులో దూలం వీరన్న, బూసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం

మార్చు

దూలం నాగేశ్వర రావు రాజకీయాల్లోకి రాకముందు ఆక్వా రైతుగా, పలు ఫ్యాక్టరీల యజమానిగా వ్యాపార రంగంలో ఉన్నాడు. ఆయన 1987 నుండి 88 వరకు కైకలూరులోని వేంకటేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్‌గా, 2006 నుండి 2011 వరకు కైకలూరు సర్పంచ్‌గా, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. దూలం నాగేశ్వర రావు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ పై 9,357 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

మార్చు
  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "కృష్ణా జిల్లా ...వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Archived from the original on 21 మార్చి 2019. Retrieved 22 December 2021.
  3. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.