కైకలూరు

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, కైకలూరు మండలం లోని గ్రామం


కైకలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్ నం. 521 333., ఎస్.టి.డి.కోడ్ = 08677.

కైకలూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 21,292
 - పురుషులు 10,459
 - స్త్రీలు 10,294
 - గృహాల సంఖ్య 4,877
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677
కైకలూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో కైకలూరు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో కైకలూరు మండలం స్థానం
కైకలూరు is located in Andhra Pradesh
కైకలూరు
కైకలూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో కైకలూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం కైకలూరు
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 75,125
 - పురుషులు 37,804
 - స్త్రీలు 37,321
అక్షరాస్యత (2001)
 - మొత్తం 66.55%
 - పురుషులు 71.78%
 - స్త్రీలు 61.26%
పిన్‌కోడ్ 521333

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

 • భీమవరం నుండి గుడివాడ వెళ్ళే ప్రధాన రహదారిలో గుడివాడకు ముప్ఫై కిలో మీటర్ల దూరంలో కలదీ ఊరు.

సమీప గ్రామాలుసవరించు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలుసవరించు

మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, ఏలూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

 • బైపాస్ రోడ్:- ఊరిలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా కైకలూరు బయటినుండి బైపాస్ రోడ్డు నిర్మింపబడింది.
 • ప్రయాణీకుల విశ్రాంతి మందిరము:- (బస్టాండ్) ఊరికి చివరగా ఆకివీడు మార్గములో పెద్ద బస్టాండు 1994లో కట్టబడింది.

రైలు వసతిసవరించు

 • రైల్వే స్టేషను. కలిదిండి మార్గములో పాత స్టేషను తీసివేసి కొత్తగా 2006 సంవత్సరములో కట్టబడింది.
 • గుడివాడ - నర్సాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202
 • విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
 • గుడివాడ - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77204
 • కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 69 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

 • రక్షకభట నిలయము ఉంది. ఇది ఆకివీడు మార్గములో బస్టాండు సమీపములో ఉంది.
 • వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ 10 లక్షలతో బారీ ఎత్తున పాత టాంకు ప్రక్కగా నిర్మించబడింది. (రూ.2 తో ఒక కేను నీరు లభ్యమగుచున్నది. టాంకు పరిరక్షకుల జీతభత్యాల కొరకు)

గ్రామములోని వైద్యసౌకర్యాలుసవరించు

సామాజిక ఆరోగ్య కేంద్రంసవరించు

ఈ ఆరోగ్య కేంద్రానికి, జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాల గుర్తింపు లభించినది. సదరు ధృవీకరణ పత్రాలను ఈ ఆరోగ్య కేంద్రం అధికారికి, 29-9-2020న కృష్ణా జిల్లా కలెక్టర్, 2020,సెప్టెంబరు-29న అందజేసినారు. [9]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

 1. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయము.
 2. శ్రీ శ్యామలాదేవి ఆలయం:- ఊరి ముఖ్యదేవత అయిన శ్రీశ్యామలాంబ పేరుమీదుగా ఇక్కడ సింహభాగం అంగళ్ళు, మనుషులు ప్రతివాటికీ శ్యామల పేరే అధికంగా కనిపిస్తుంది. శ్రీ శ్యామలాంబ అమ్మవారి శ్రీ చండీ మహాయాగ సహిత శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఘనంగా జరుగును. [2]
 3. శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయము:- మీసాల వెంకన్నగా భక్తులు ఆరాధించే ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో నిర్వహించెదరు. [3]
 4. శ్రీషిర్డీ సాయిబాబా దేవాలయము,
 5. కాలువగట్టున కల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయము.
 6. శ్రీ రామకృష్ణ సేవాసమితి, ఎన్.జి.వో.కాలనీ.

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

ఈ మండలం మొదలు వరి, చేపలచెరువులు, రొయ్యల చెరువుల సాగుబడి ప్రారంభమైన తరువాత చాలా అభివృద్ధి చెందినది.

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

 • అట్లూరి పుండరీకాక్షయ్య :- తెలుగు సినిమా నిర్మాత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది.
 • బలే వెంకటరావు అఖిల భారత మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. ఆ సంఘానికి భారత దేశానికి చెందిన అధ్యక్షులు, మన రాష్ట్రానికి, 11 మందితోకూడిన ఒక కమిటీని ప్రకటించగా, ఆ కమిటీలో శ్రీ వెంకటరావుని, కార్యదర్శిగా నియమించారు. [6]
 • పరిమి రామకృష్ణశాస్త్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేకప్రాంతాలలో రామాయణం, సుందరకాండలను ప్రచారంచేసి, రామాయణ వాచస్పతి గా బిరుదు పొందిన శ్రీ పరిమి రామకృష్ణశాస్త్రి, కైకలూరు గ్రామానికి చెందినవారే. వీరు 2016,ఫిబ్రవరి-14వ తేదీ ఆదివారం, రథసప్తమి రోజున హైదరాబాదులో ఆనారోగ్యంతో పరమపదించారు. [8]
 • జన్యావుల ధనార్జునరావు (జె.డి.రావు) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "I.S.R.O"లో అత్యంత కీలకమైన విభాగంలో పనిచేయుచూ, ఇటీవల ప్రారంభించిన అంగారక గ్రహ యాత్ర "మాం" విజయవంతంలో ముఖ్య పాత్ర వహించిన శ్రీ జన్యావుల ధనార్జునరావు (జె.డి.రావు), కైకలూరుకు చెందినవారే. వీరికి 2014,నవంబరు-10న కైకలూరులో ఘనసన్మానం చేసారు. [4]
 • వడ్లమన్నాటి పాండురంగారావు విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయిలు మరియూ ఎం.పి.టి.సి. సభ్యులు. వీరు 2015,ఏప్రిల్-25నుండి 30 వరకు గోవాలో నిర్వహించిన 36వ జాతీయ వెటరన్ పోటీలలో 70 సంవత్సరాల విభాగంలో, 100 మీటర్ల పరుగు పందెంలోనూ మరియూ 400 మీటర్ల రిలే పరుగు పందెంలోనూ పాల్గొని, రెండు పందేలలోనూ కాంశ్య పతకాలు సాధించారు. ఈ విజయాలు సాధించిన వీరు, ఆగష్టు-2015 లో ఫ్రాన్స్ దేశంలో నిర్వహించు ప్రపంచస్థాయి వెటరన్ పోటీలకు ఎంపికైనారు. [5]
 • అసిఫ్ పాషా ఆక్వా రైతు, కె.ఎం.సి. అను చేపల కంపెనీకి యజమాని. వీరు "జాతీయ ఉత్తమ చేపల రైతు" పురస్కారానికి ఎంపికైనారు. 2015,జూలై15వ తేదీనాడు, కాకినాడలో జరిగిన ఒక సభలో, వీరిని సన్మానించి వీరికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు. [7]

గ్రామ విశేషాలుసవరించు

ప్రసిద్ధిగాంచిన అటపాక పక్షుల సంరక్షణ కేంద్రం, ఇక్కడికి రెండు కి.మీ. దూరంలో ఉంది.

కైకలూరు శాసనసభ నియోజకవర్గంసవరించు

పూర్తి వ్యాసం కైకలూరు శాసనసభ నియోజకవర్గంలో చూడండి.

మండలంలో ఉన్న గ్రామాల జాబితాసవరించు

1.ఆచవరం 2.ఆలపాడు 3.ఆటపాక 4.భుజబలపట్నం 5.దొడ్డిపట్ల 6.గోనెపాడు 7.గోపవరం 8.కైకలూరు 9.కొల్లేటికోట 10.కొట్టాడ 11.పల్లెవాడ 12.పెంచికలమర్రు 13 చినకొట్టాడ 14.పెదకొట్టాడ 15.జంగంపాడు 16.రాచపట్నం 17.రామవరం 18.సీతనపల్లి 19.సింగాపురం 20.సోమేశ్వరం (కైకలూరు) 21.శ్యామలాంబపురం 22.తామరకొల్లు 23.వదర్లపాడు 24.వరాహపట్నం 25.వేమవరప్పాడు 26.వింజరం 27.చటాకాయ్ 28.పందిరిపల్లెగూడెం 29. నర్సాయిపాలెం

గణాంకాలుసవరించు

జనాభా (2001) -మొత్తం 20753 -పురుషులు 10459 -స్త్రీలు 10294 -గృహాలు 4877 - హెక్టార్లు 1096

జనాభాసవరించు

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. ఆచవరం 556 2,378 1,205 1,173
2. ఆలపాడు 471 1,893 960 933
3. ఆటపాక 1,144 4,883 2,453 2,430
4. భుజబలపట్నం 1,548 6,090 3,044 3,046
5. దొడ్డిపట్ల 398 1,504 764 740
6. గోనెపాడు 269 998 498 500
7. గోపవరం 535 2,001 1,009 992
8. కైకలూరు 4,877 20,753 10,459 10,294
9. కొల్లేటికోట 2,001 7,621 3,798 3,823
10. కొట్టాడ 771 3,109 1,576 1,533
11. పల్లెవాడ 726 2,955 1,499 1,456
12. పెంచికలమర్రు 466 1,811 905 906
13. రాచపట్నం 583 2,320 1,184 1,136
14. రామవరం 340 1,471 728 743
15. సీతనపల్లి 426 1,577 815 762
16. సింగాపురం 26 96 43 53
17. సోమేశ్వరం (కైకలూరు) 249 1,059 528 531
18. శ్యామలాంబపురం 164 696 360 336
19. తామరకొల్లు 703 2,945 1,477 1,468
20. వదర్లపాడు 416 1,749 885 864
21. వరాహపట్నం 698 2,790 1,382 1,408
22. వేమవరప్పాడు 646 2,726 1,359 1,367
23. వింజరం 423 1,700 873 827

మూలాలుసవరించు

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Kaikaluru". Archived from the original on 9 మే 2015. Retrieved 6 July 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
 2. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013,సెప్టెంబరు-21. [3] ఈనాడు కృష్ణా; 2014,మే-13; 16వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-11; 6వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,మే-3; 2వపేజీ. [6] ఈనాడు గుంటూరు సిటీ; 2015,జూన్-4; 8వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,జులై-12; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-16; 7వపేజీ. [9] ఈనాడు అమరావతి;2020,సెప్టెంబరు-30;5వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కైకలూరు&oldid=3120052" నుండి వెలికితీశారు