దూలగొండి
దూలగొండి లేదా దురదగొండి ఒక రకమైన ఔషధ మొక్క. దీనినే పిల్లిగాలు, పిల్లియడుగు, లేదా కోతితోక అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయనామం ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens). ఇది ఫాబేసి (చిక్కుడు) కుటుంబానికి చెందినది. ఇవి అన్ని రకాల నేలలలో పెరుగుతాయి. దీనికి కల చిన్న చిన్నకాయలపై భాగమున పొడిలాంటి సున్నితమైన ముళ్ళు కలిగి ఉంటుంది. వీటిని శరీరముపై స్పర్శింపజేసిన దురద కలుగును.
దూలగొండి | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | ఎమ్. ప్రూరీన్స్
|
Binomial name | |
ముకునా ప్రూరీన్స్ |
ఉపయోగాలు
మార్చుదీని విత్తనాలు అతిసారం, పక్షవాతం, నరాల బలహీనత, వీర్యపుష్టి, ఋతుక్రమ వ్యాధులు, జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.[1]
మూలాలు
మార్చు- ↑ ముకునా ప్రూరీన్స్ (దూలగొండి), ఔషధి దర్శని (సాగుకు అనువైన ఔషధ మొక్కలు, రైతుల సమాచారం, ఆంధ్రప్రదేశ్ ఔషధ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీ. 28.