ద్విదళబీజాలు
తల్లి వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం, చతుర్భాగయుత లేదా పంచభాగయుత పుష్పాలు, విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం ద్విదళబీజాల (Dicotyledons) ముఖ్యలక్షణాలు.
మాగ్నోలియాప్సిడా (ద్విదళబీజాలు) | |
---|---|
Magnolia పుష్పం | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | మాగ్నోలియోప్సిడా |
Orders | |
See text. |
వర్గీకరణ
మార్చుపరిపత్రం (Perianth)లో ఉండే వలయాల సంఖ్య, ఆకర్షణపత్రాలు అసంయుక్తమా లేక సంయుక్తమా అనే అంశాలపై ఆధారపడి ద్విదళబీజాలను మూడు ఉపతరగగులుగా విభజించారు.
- ఉపతరగతి 1: పాలిపెటాలె లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. పుష్పాసనం (Thalamus) ఆకారం ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
- శ్రేణి-థలామిఫ్లోరె (Thalamiflorae): దీనిలో పుష్పాసనం పొడవుగాగాని, శంకు ఆకారంలోగాని లేదా కుంభాకారంలోగాని ఉంటుంది. ఉదా: మాల్వేసి.
- శ్రేణి-డిస్కిఫ్లోరె (Disciflorae): దీనిలో పుష్పాసనం పళ్ళెం లేదా చక్రం వంటి ఆకారంలో ఉంటుంది.
- శ్రేణి-కెలిసిఫ్లోరె (Calyciflorae): దీనిలో పుష్పాసనం గిన్నె వంటి ఆకారంలో ఉంటుంది. ఉదా: ఫాబేసి.
- ఉపతరగతి 2: గామోపెటాలె లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు సంయుక్తంగా ఉంటాయి. కేసరాలు ముకుటదళోపరిస్థితంగా ఉంటాయి. అండాశయం లక్షణాలు, పుష్పవలయాల్లో ఉండే భాగాల సంఖ్య ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
- ఉపతరగతి 3: మోనోక్లామిడె లో పరిపత్రం రక్షక, ఆకర్షణపత్రావళులుగా విభజన చూపించకుండా ఏకపరిపత్రయుతంగా ఉంటుంది. దీనిలో ఎనిమిది శ్రేణులున్నాయి.
ముఖ్యమైన కుటుంబాలు
మార్చు- అంబెల్లిఫెరె (Apiaceae or Umbelliferae)
- అకాంథేసి (Acanthaceae)
- అనకార్డియేసి (Anacardiaceae)
- అనోనేసి (Annonaceae)
- అపోసైనేసి (Apocynaceae)
- అమరాంథేసి (Amaranthaceae)
- ఆస్టరేసి (Asteraceae or Compositae)
- కాక్టేసి (Cactaceae)
- కాజురైనేసి (Casuarinaceae)
- కారికేసి (Caricaceae)
- కుకుర్బిటేసి (Cucurbitaceae)
- థియేసి (Theaceae)
- డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae)
- డ్రోసిరేసి (Droseraceae)
- పెపావరేసి (Papaveraceae)
- ప్లంబజినేసి (Plumbaginaceae)
- ఫాబేసి (Fabaceae or Leguminosae)
- బ్రాసికేసి (Brassicaceae or Cruciferae)
- బిగ్నోనియేసి (Bignoniaceae)
- మాగ్నోలియేసి (Magnoliaceae)
- మాల్వేసి (Malvaceae)
- మెనిస్పెర్మేసి (Menispermaceae)
- మిర్టేసి (Myrtaceae)
- మోరేసి (Moraceae)
- యుఫోర్బియేసి (Euphorbiaceae)
- రానన్కులేసి
- రామ్నేసి (Rhamnaceae)
- రూటేసి (Rutaceae)
- రూబియేసి (Rubiaceae)
- రోసేసి (Rosaceae)
- లామియేసి (Lamiaceae or Labiatae)
- వెర్బినేసి (Verbenaceae)
- వైటేసి (Vitaceae)
- సపిండేసి (Sapindaceae)
- సపోటేసి (Sapotaceae)
- సొలనేసి (Solanaceae)
Look up ద్విదళబీజాలు in Wiktionary, the free dictionary.