దేవకి

కృష్ణుని కన్నతల్లి

దేవకి శ్రీకృష్ణుని తల్లి.[1] దేవకుడి కూతురు. వసుదేవుడు ఈమె భర్త. కంసుడు ఈమె పినతండ్రి ఉగ్రసేనుడి కొడుకు. పూర్వజన్మలో ఈమె అదితి.

రథముపై ప్రయాణిస్తున్న దేవకి వసుదేవులు.

పూర్వరంగం

మార్చు

దేవకి స్వయంవరం సమయంలో శిని, సోమదత్తుడి మధ్య పోరాటం జరుగుతుంది. శిని తన స్నేహితుడు వాసుదేవుని కోసం ఆమెను అపహరిస్తాడు.[2] దేవకి సోదరీమణులను కూడా వాసుదేవునికిచ్చి వివాహం జరిపిస్తాడు.[3]

పెళ్ళి అయిన తర్వాత కంసుడు నూతన వధూవరులను రథంలో ఎక్కించుకుని మధురకు చేరుస్తానని ముందుకు వస్తాడు. వారు దారిలో వెళుతుండగా దేవకి గర్భంలో జన్మించే అష్టమ సంతానంతో అతనికి మరణం ప్రాపిస్తుందనీ పలుకుతుంది. దాంతో ఆగ్రహం చెందిన కంసుడు దేవకిని చంపబోతాడు. అప్పుడు వాసుదేవుడు అడ్డుకుని దయచేసి ఆమెను చంపవద్దనీ ఆమెకు పుట్టబోయే సంతానాన్ని కంసుడికి అప్పగిస్తాననీ మాట ఇస్తాడు. దాంతో కంసుడు ఆమెను చంపే ప్రయత్నాన్ని విరమించుకుంటాడు.[4][5][6]

మూలాలు

మార్చు
  1. డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ప్రచురణ).
  2. http://www.sacred-texts.com/hin/m07/m07140.htm
  3. http://bhagavata.org/canto9/chapter24.html#Text%2021-23
  4. http://bhagavata.org/canto10/chapter1.html#Text%2030
  5. http://bhagavata.org/canto10/chapter1.html#Text%2034
  6. http://bhagavata.org/canto10/chapter1.html#Text%2054
"https://te.wikipedia.org/w/index.php?title=దేవకి&oldid=2312337" నుండి వెలికితీశారు