అదితి (సంస్కృతం अदिति, హద్దులు లేనిది).[1] సంస్కృతంలో పద ధాతువు అంటే కట్టబడటం. దితి అంటే కట్టబడి ఉంది. అ is negative కావున అదితి అంటే ఎల్లలు లేదా హద్దులు లేనిది అని అర్థం. వేద పురాణాలలో అదితి దేవతల తల్లి, కశ్యపుని భార్య. దక్షుని- ధరణిల కూతురు. దితి, వినత, కద్రువలు ఈమె సవతులు. కశ్యపునికీ, అదితికీ కలిగిన సంతానం ద్వాదశాదిత్యులు. మహావిష్ణువు వామనావతారంలో ఈమెకు జన్మిస్తాడు. వరుణుడి శాపం వల్ల అదితి, కశ్యపులే ద్వాపర యుగంలో దేవకి, వసుదేవులుగా జన్మిస్తారు. అదితి అంశతోనే సమస్త చరాచరజగత్తు సృష్టించబడింది. ఋగ్వేదంలో అదితి వాక్ గా సూచింబడింది. వేదాంతంలో మూలప్రకృతి లేదా ప్రకృతిగా చెప్పబడింది. సమస్త శూన్యానికి గర్భమైన అదితి, బ్రహ్మ యొక్క స్త్రీ అంశగా పరిగణించడింది. అదితి యొక్క దివ్యాంశ పునర్జన్మ చక్రాన్ని ఋగ్వేద సూక్తం "దక్షుడు అదితి నుండి ఉద్భవించాడు. అదితి దక్షుని కూతురు" (ఋగ్వేదం 10వ మండలం.72.4) సూచనప్రాయంగా తెలియజేస్తున్నది. ఒక అత్యంత మార్మిక అంశలో అదితి దివ్యజ్ఞానము. అదితి సృష్టి అధిదేవత, చేతన, భూత భవిష్యత్తు, ఫలసారము.[2]

బ్రహ్మదేవునితో అదితి

మూలాలు మార్చు

  1. Dictionary of Hindu Lore and Legend (ISBN 0-500-51088-1) by Anna Dhallapiccola
  2. http://www.theosociety.org/pasadena/etgloss/adi-ag.htm
"https://te.wikipedia.org/w/index.php?title=అదితి&oldid=3858701" నుండి వెలికితీశారు