దేవదారు లేదా దేవదారువు (ఆంగ్ల భాష Deodar) వివృతబీజాలలో పైన్ జాతికి చెందిన వృక్షం.

దేవదారు
A young tree in cultivation
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. deodara
Binomial name
Cedrus deodara
దేవదారు వృక్షం

ఈ పత్రి దేవదారు వృక్షానికి చెందినది. ఇది ఎక్కువగా అరణ్యాల్లో పెరుగుతుంది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది. పార్వతీ దేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు ,కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.

భౌతిక లక్షణాలు

మార్చు

ఈ ఆకు ఎల్లప్పుడూ పచ్చ రంగులో ఉంటుంది.ఆకారంలో సూదికొనలతో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది.

శాస్త్రీయ నామం

మార్చు

ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Cedrus deodara.

ఔషధ గుణాలు

మార్చు

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :[1]

  • దేవదారు పత్రాల చిగుళ్లు మేహశాంతిని కలిగిస్తాయి.
  • దీని ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువజేస్తుంది.
  • ఈ చెట్టు ఆకులు, పువ్వులు కూడా మంచి ఔషధులే.

సువాసన గుణం

మార్చు

ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

ఇతర ఉపయోగాలు

మార్చు

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు : ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. దేవదారు శరీర వేడిని తగ్గిస్తుంది.

ఆయుర్వేదంలో

మార్చు

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది చర్మ వ్యాధులు,చిన్న చిన్న దెబ్బలు మానడానకి ఉపయోగపడుతుంది.




మూలాలు

మార్చు
  1. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=దేవదారు&oldid=4299573" నుండి వెలికితీశారు