దేవదారు
దేవదారు లేదా దేవదారువు (ఆంగ్ల భాష Deodar) వివృతబీజాలలో పైన్ జాతికి చెందిన వృక్షం.
దేవదారు | |
---|---|
A young tree in cultivation | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. deodara
|
Binomial name | |
Cedrus deodara |
ఈ పత్రి దేవదారు వృక్షానికి చెందినది. ఇది ఎక్కువగా అరణ్యాల్లో పెరుగుతుంది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది. పార్వతీ దేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు ,కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.
భౌతిక లక్షణాలు
మార్చుఈ ఆకు ఎల్లప్పుడూ పచ్చ రంగులో ఉంటుంది.ఆకారంలో సూదికొనలతో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది.
శాస్త్రీయ నామం
మార్చుఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Cedrus deodara.
ఔషధ గుణాలు
మార్చుఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :[1]
- దేవదారు పత్రాల చిగుళ్లు మేహశాంతిని కలిగిస్తాయి.
- దీని ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువజేస్తుంది.
- ఈ చెట్టు ఆకులు, పువ్వులు కూడా మంచి ఔషధులే.
సువాసన గుణం
మార్చుఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
ఇతర ఉపయోగాలు
మార్చుఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు : ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. దేవదారు శరీర వేడిని తగ్గిస్తుంది.
ఆయుర్వేదంలో
మార్చుఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది చర్మ వ్యాధులు,చిన్న చిన్న దెబ్బలు మానడానకి ఉపయోగపడుతుంది.
మూలాలు
మార్చు- ↑ "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)