దేవరంపాడు (రాజుపాలెం)

దేవరంపాడు, పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/ఆలయాలు మార్చు

మత్స్య రూప శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మార్చు

కొండమోడుకు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో, దేవరంపాడు గుట్టపై వేంచేసియున్న ఈ స్వామివారిని, ఈ ప్రాంతంలో భక్తులు నేతి వెంకన్న గా పిలుచుకుంటారు. భక్తులు తమ పాడిపశువులు ఈనిన తరువాత, తొలిసారి కవ్వంతో చిలకగా వచ్చిన వెన్నను దాచి, ఉత్సవ వారాలలో స్వామివారిని ఆ వెన్నతో అభిషేకించడం ఆనవాయితీ. ఈ ఆలయానికి పై కప్పు లేకపోవడంతో, మద్యాహ్న సమాయానికి భానుడి కిరణాలు మూలవిరాట్‌ను నేరుగా తాకడంతో, ఎండవేడికి వెన్న కరిగి నెయ్యిలాగా మారి ఆ నేతిలో స్వామివారు జలకాలాడుచున్నట్లు ఉండటంతో, స్వామివారు నేతి వెంకన్నగా ప్రసిద్ధులైనారు. జిల్లాలో కోటప్పకొండ తరువాత పెద్దదిగా మారి ఈ క్షేత్రం, "పల్నాటి తిరుమల"గా వినుతికెక్కింది. ఈ స్వామివారి తిరునాళ్ళు, ప్రతియేటా శివరాత్రి పర్వదినం తరువాత వచ్చే మొదటి శనివారం ప్రారంభంఅవుతాయి. తరువాత వరుసగా మూడు శనివారాలు జరుగుతాయి.ఈ ఉత్సవాలకు పిల్లలులేని దంపతులు వచ్చి, ఆలయ ఆవరణలోని మర్రిచెట్టుకు ముడుపులు కట్టి, ప్రత్యేక పూజలు చేస్తారు. రైతులు జోడెడ్ల బండ్లకు ప్రభలు కట్టి, ఉత్సాహంగా కొండకు తరలివస్తారు. ఈ తిరునాళ్ళకు, ఈ జిల్లా నుండియేగాక, ప్రకాశం నల్గొండ జిల్లాల నుండి భక్తులు తరలివస్తారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు