దేవరపల్లి ప్రకాశ్ రావు

దేవరపల్లి ప్రకాశ్ రావు టీ అమ్ముకొని జీవనం సాగించే ఓ తెలుగు వ్యక్తి. అతను సమాజానికి చేసిన సేవలకు గానూ 2019 లో పద్మశ్రీ పురస్కారాన్ని యిచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది[1].

జీవిత విశేషాలు మార్చు

ప్రకాశ్ రావు పూర్వీకులు ఒడిశాలో స్థిరపడ్డారు. కటక్‌లోని బక్సీ బజార్ ప్రాంతంలో ఆయన టీ స్టాల్ నడుపుతున్నాడు. ఆ బస్తీలో ఉండేవాళ్లంతా పేదలే. అక్కడ పిల్లలు చదువకోవడానికి కనీసం స్కూల్ కూడా లేకపోవడంతో తన ఇంట్లోని రెండు గదుల్లో ఒక గదిని స్కూల్‌గా మార్చేశాడు. రోజూ టీ, రొట్టెలు, వడలు విక్రయించగా వచ్చే రూ.600 ఆదాయంలో సగాన్ని పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు. సాధారణ జీవనం సాగించే ఆయన సేవాగుణంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.[2]

సంఘ సేవ మార్చు

 
పద్మశ్రీ పురస్కారం

అతను పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. చాలా సంవత్సరాల కిందట ఒడిషాకు వలస వెళ్లారు. ఆ నేపథ్యంలో కటక్ లోని బక్సీ బజార్ ప్రాంతంలో టీ కొట్టు పెట్టుకుని, దానిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. టీ అమ్మడం ద్వారా రోజుకు ఆయన దాదాపు 600 రూపాయల దాకా సంపాదిస్తాడు. అందులో కొంతభాగం కుటుంబ ఖర్చులకు వినియోగించుకుంటూ మిగతా మొత్తం పేదల కోసం ఖర్చు పెడుతున్నాడు. అంతేకాదు పాలు, బ్రెడ్ లాంటివి ఫ్రీగా అందిస్తున్నారు. ఇదంతా కూడా 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తుండటం విశేషం. అదలావుంటే తన రెండు గదుల ఇంటినే బడిగా మార్చారు ప్రకాష్ రావు. పిల్లలకు చదువు నేర్పిస్తూ ఉచిత భోజనం పెడుతున్నాడు. ప్రకాష్ రావు స్కూల్ ఏర్పాటు చేసేంతవరకు అక్కడ బడి అంటేనే తెలియని పరిస్థితి. కూలీ పనులు చేసుకునేవారు ఎక్కువగా ఉండే ఆ ఏరియాలో బడి ఏర్పాటు చేసి, వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు ప్రకాష్ రావు.

అతనికి 8 భాషలలో పట్టు ఉంది. అతనికి ఉన్న జ్ఞానంతో సమాజంలో బలహీన వర్గాల పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2018లో కటక్ సందర్శించినపుడు అతనిని కలిసాడు. ప్రధాని "మన్ కీ బాత్" లో అతనిని ప్రస్తావించాడు. అతని కృషిని ప్రశంసించాడు. ప్రకాశ్‌రావు 1976 నుండి క్రియాశీలకంగా రక్తదానం చేస్తూనే ఉన్నాడు. [3]

మూలాలు మార్చు

  1. "Amaravati పద్మశ్రీ జాబితాలో ఛాయ్‌వాలా.. ప్రకాష్ రావు మన తెలుగువారే..!".
  2. "టీ అమ్ముకునే తెలుగోడికి పద్మ శ్రీ పురస్కారం."
  3. "Padma Shri chaiwala's life lesson: Do your duty, world will recognise you". 2019-01-26.

బయటి లంకెలు మార్చు