దేవిపురం
దేవిపురం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, ఉన్న అరుదైన హిందూమత ఆలయ సముదాయం. ఈ ఆలయ సముదాయం ప్రధానంగా హిందూమతనికి సంబంధించిన శక్తి పాఠశాలకు అనుబంధముగా ఉంది.అది దేవత స్వరూపమైన సహ్రక్షి (వెయ్యి కళ్ళు కలిగింది) కి, ఆమె భర్త కామేశ్వరుడు (శివుని ఆంశ) కు అంకితం.
దేవిపురం | |
---|---|
భౌగోళికాంశాలు: | 17°45′55.32″N 83°4′58.64″E / 17.7653667°N 83.0829556°E |
పేరు | |
దేవనాగరి: | देवीपुरम् |
Sanskrit transliteration: | Devīpuram |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | విశాఖపట్నం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | సహ్రక్షి రూపంలో ఉన్న శక్తి |
నిర్మాణ శైలి: | దక్షిణ భారత ఆర్కిటెక్చర్ |
ఆలయాల సంఖ్య: | 3 |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 1985-1994 |
నిర్మాత: | యెన్.ప్రహ్లాద శాస్త్రి |
వెబ్‌సైటు: | devipuram.com |
ఆలయ విశిష్టత
మార్చుదేవిపురం ప్రాముఖ్యత సహ్రక్షి మేరు ఆలయం, [1] శ్రీ మేరు యంత్ర ఆకారంలో నిర్మించిన ఏకైక మూడు అంతస్తుల నిర్మాణం. అంటే శ్రీవిద్య ఉపాసన కేంద్రమైన శ్రీ చక్రం అని పిలిచే పవిత్రమైన హిందూ మతం రేఖాచిత్రం.108 అడుగుల (33 మీ) చదరపు కొలత గలిగిన బేస్ పై 54 అడుగుల (16 మీ) ఎత్తు, పొడవు గల ఆలయం.ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండలపై కామాఖ్య పీఠం, శివాలయం ఉన్నాయి.
సహ్రక్షి మేరు ఆలయం గర్భగుడిలో 100 కంటే ఎక్కువగా వున్న మనిషి సైజు విగ్రహలను ప్రదక్షిణాల ద్వారా చేరు కొనవచ్చును.ఈ దేవాలయంలో విగ్రహలకు కుల, సంప్రదాయాలు లేదా లింగ నిమిత్తం లేకుండా సొంతముగా పూజ చేసుకోవచ్చు.
చరిత్ర
మార్చుయన్.ప్రహ్లాద శాస్త్రి ( అమృతఆనంద నాథ సరస్వతి), 2007 లో దేవీపురాన్ని స్థాపించాడు.[1] దేవీపురంలో సహ్రక్షి మేరు ఆలయం నిర్మాణం 1985 లో ప్రారంభమైంది.ఈ దేవాలయం పూర్తియై మెదటి కుంభాభిషేకం హిందూమత సంప్రదాయం ప్రకారం 1994 లో జరిగింది. పన్నెండవ వార్షికోత్సవం ఫిబ్రవరి 2007 లో జరిగింది. దేవీపురం స్థాపకుడు ప్రహ్లాద శాస్త్రి మాజీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, అణు భౌతిక శాస్త్రవేత్తగా ముంబైలో ఉన్న టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో 23 సంవత్సరాల కెరీర్ వదిలి 1983 లో దేవీపురం ఆలయ పని ఆరంభించారు. అతను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.