దేవిశెట్టి చలపతిరావు
దేవిశెట్టి చలపతిరావు తెలుగు రచయిత,[1] ఒక ఆధ్యాత్మిక గురువు.[2]
దేవిశెట్టి చలపతిరావు | |
---|---|
వ్యక్తిగతం | |
జననం | |
మతం | హిందూ మతం |
Philosophy | "అద్వైత వేదాంత" |
Senior posting | |
Literary works | సామాజిక రచయిత, ఆధ్యాత్మికవేత్త.ఆధ్యాత్మిక జ్ఞానపీఠ మఠం వ్యవస్థాపకులు. |
బాల్యం, విద్య, తల్లిదండ్రులు
మార్చు1946 సెప్టెంబర్ 12వ తేదీన గుంటూరు జిల్లా తుర్లపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి వీరరాఘవయ్య, తల్లి పుల్లమ్మ. వీరి నివాసం చిలకలూరిపేట. ప్రాధమికవిద్య తుర్లపాడు గ్రామంలోను, ఉన్నత విద్య చిలకలూరిపేటలోను అభ్యసించి, బాపట్ల వ్యవసాయకళాశాల నుండి బి.ఎస్.సి(వ్యవసాయం) ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు.
రచనలు
మార్చు1994లో వేదాంత విషయాలు సులభంగా అర్థమయ్యేరీతిలో ‘కర్మసిద్ధాంతం’ అనే గ్రంధాన్ని రచించి ప్రచురింపజేశాడు. తిరిగి 2002లోను, 2008లోను, 2009లోను, 2013లోను, 2015లోను, 2018లోను ముద్రణ జరిగింది. 1998లో శుక్లయజుర్వేదము నందలి ‘ఈశావాస్యోపనిషత్తు’ గ్రంధం అందరికి అర్ధమయ్యే విధంగా సరళమైన, వాడుకభాషలో ఈ గ్రంధం వ్రాసి ప్రచురింపజేశాడు[3].
ఇవిగాక ‘శ్రీ నారదభక్తిసూత్రాలు’, శంకరాచార్యుల ‘ఆత్మబోధ’, ‘శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం’ పై ఎంతో వివరణాత్మకంగా, సోదాహరణంగా, విపులమైన వ్యాఖ్యను వ్రాసి ప్రచురింపచేశాడు. 2013లో సదాశివబ్రహ్మేంద్రసరస్వతి స్వామి ‘ఆత్మవిద్యావిలాసం’, భగవద్గీత 3, 4, 5 అధ్యాయములను ప్రచురింపచేశాడు. 2015 లో ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు, భగవద్గీత 6 నుండి 18 అధ్యాయములు ప్రచురింపజేశాడు. 2017 లో బ్రహ్మసూత్రములపై వ్యాఖ్యను ప్రచురింపజేశాడు. 2019లో వివేకచూడామణిపై విపులమైన వ్యాఖ్యను 8 గ్రంధముల భాగాలుగా ప్రచురింపజేశాడు. 2020లో శ్రీగురుగీతను 3 గ్రంధముల భాగాలుగా ప్రచురింపజేశాడు. అలాగే 108వ ఉపనిషత్తు ముక్తికోపనిషత్తును ప్రచురింపజేశాడు. ఇవిగాక విజయవాడ నుండి వెలువడే ధ్యానమాలిక మాసపత్రికలో 2008 నుండి భగవద్గీతను, 2009 నుండి మహాభారతమును ధారావాహికంగా ప్రచురిస్తున్నాడు[4].
ఆధ్యాత్మికం
మార్చు1994 లో ‘ఆధ్యాత్మిక జ్ఞానపీఠాన్ని’ స్థాపించి, ప్రసన్న బండ్లమాంబ రాజమాతాదేవిచే ప్రారంభింపజేశాడు. అప్పటి నుండి ప్రతిరోజూ సత్సంగము, ప్రతినెల గీతాపారాయణలతోపాటు శ్రీకృష్ణ జన్మాష్టమి, గీతాజయంతి, శంకరాచార్యజయంతి, రమణమహర్షి జయంతి, ఆషాఢ - కార్తీక - మాఘ - వైశాఖ పౌర్ణమిల యందు ఆధ్యాత్మిక సదస్సులు, జన్మదినోత్సవం, విజ్ఞానయాత్రలు, వనసమారాధనలు, ధ్యానతరగతులు, వార్షికోత్సవం మొదలగు అనేక కార్యక్రమాలను జరుపుకొనుటలోను, నిరంతర జప, ధ్యాన, ఆత్మవిచారణ, సాక్షీభావన, బ్రహ్మనిష్ఠ మొ||న సాధనలతో, పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడుపుచున్నాడు.
మూలాలు
మార్చు- ↑ "చలపతిరావు పుస్తకాలు".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "చలపతిరావు మరిన్ని వివరాలు".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "దేవిశెట్టి చలపతిరావు పుస్తకాలు".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ స్వామీజీ, దేవి శెట్టి చలపతిరావు. "పరంజ్యోతి".