దేశంలో దొంగలు పడ్డారు

దేశంలో దొంగలు పడ్డారు
(1985 తెలుగు సినిమా)
Desamlo dongalu paddaru.jpg
దర్శకత్వం టి.కృష్ణ
తారాగణం సుమన్ ,
విజయశాంతి ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఈతరం పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

 • సుమన్ - శివం
 • విజయశాంతి - అరుణ
 • పి.ఎల్.నారాయణ - వెంకయ్య
 • సుత్తివేలు - బడిపంతులు
 • సాక్షి రంగారావు
 • రాజేంద్రప్రసాద్
 • నర్రా వెంకటేశ్వరరావు
 • ప్రసాద్ బాబు

సాంకేతిక వర్గంసవరించు

 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం - టి.కృష్ణ
 • సంగీతం - చక్రవర్తి
 • ఛాయాగ్రహణం - ఆర్.రామారావు
 • మాటలు - ఎం.వి.ఎస్.హరనాథరావు
 • నిర్మాత - పోకూరి వెంకటేశ్వరరావు

కథసవరించు

శివం ఎం.ఎ.పట్టా ఉన్న నిరుద్యోగి. అతడి చెల్లెలికి పెళ్ళి అయినా కట్నం ఇవ్వలేదన్న కారణంతో కన్నవారింట్లోనే ఉండిపోతుంది. అరుణ ఆదర్శభావాలు కల యువతి. వందేమాతరం అనే పత్రికను నిర్భయంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె తాత వెంకయ్య గాంధేయవాది. అచ్చం గాంధీగారిలా దుస్తులు వేసుకుని, ఇంకా భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదని వాపోతూవుంటాడు. శివం కష్టపడి ఒక ఆనకట్టవద్ద వర్క్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సంపాదిస్తాడు. కంట్రాక్టరు సిమెంటులో ఇసుక ఎక్కువ కలుపుతున్నాడని అధికార్ల దృష్టికి తెస్తాడు. అయినా లాభం ఉండదు. డ్యాము కొట్టుకు పోయి ప్రాణనష్టం జరుగుతుంది. దానికి కారణం శివం అలసత్వమేనని కేసుపెడతారు. శివంకు జైలుశిక్ష పడుతుంది. ఎం.ఎల్.ఎ. అద్భుతరావు, కాంట్రాక్టరు ప్రభృతులు వెంకయ్యను హతమారుస్తారు. జైలు నుండి తప్పించుకుని వచ్చిన శివం జనంలో తిరుగుబాటు తీసుకుని వస్తాడు. జనవాహినిలో చైతన్యానికి నాంది జరిగింది అనే భావాన్ని వ్యక్తం చేసే విధంగా చిత్రం పరిసమాప్తమవుతుంది[1].

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ తదితరులు పాడారు[2].

క్ర.సం పాట పాడినవారు
1 ఉదయం కని ఉదయం కోసం ఎద ఎదలో రగిలెను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి బృందం
2 చూడు మల్లేశా చూడు మల్లేశా దేశమెట్టు పోతోందో కనరా ఎస్.పి.శైలజ
3 దేశంలో దొంగలు పడ్డారు అరె దేశాన్ని దోచుకు తింటారు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
4 మౌనమే ఉదయరాగమై ఎదలలో అలా కదులుతూ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

మూలాలుసవరించు

 1. వెంకట్రావ్ (2 February 1985). "చిత్ర సమీక్ష - 'దేశంలో దొంగలు పడ్డారు '". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 10 February 2020.
 2. కొల్లూరి భాస్కరరావు. "దేశంలో దొంగలు పడ్డారు - 1985". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 10 February 2020.