దేశమంటే (పాట)
దేశమంటే దేశమంటే అనే పాట ఝుమ్మంది నాదం (2010) సినిమా కోసం చంద్రబోస్ రచించారు. ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.
ఈ పాటను మహాకవి గురజాడ అప్పారావు రచించిన ముత్యాలసరాలు లోని దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్ అనే గీతాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన రచన.
పాట
మార్చుదేశమంటే దేశమంటే
మతం కాదోయ్, గతం కాదోయ్
అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్నచేతి గన్ను కాదోయ్
క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్రవ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్
దేశమంటే
గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్
రాజధనుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్
అబలపై ఆమ్లాన్ని జల్లే అరాచకమే కాదు కాదోయ్
పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్
దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు
హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు
క్రోధమెందుకు కరుణ పంచు
స్వార్ధమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు
కక్షలెందుకు కౌగిలించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు
రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు
కొత్త బంగరు భవిత నీదే కానుకందించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే
దేశమంటే మనుషులోయ్