దొనడి రమేశ్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు

దొనడి రమేశ్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1]

దొనడి రమేశ్
దొనడి రమేశ్


పదవీ కాలం
13 జనవరి 2020 – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 27 జూన్‌ 1965
కమ్మపల్లి, సోమల మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు డీవీ నారాయణ నాయుడు, అన్నపూర్ణ
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం మార్చు

దొనడి రమేశ్ 27 జూన్‌ 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, సోమల మండలం, కమ్మపల్లి గ్రామంలో డీవీ నారాయణ నాయుడు, అన్నపూర్ణ దంపతులకు జన్మించాడు. ఆయన కమ్మపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు, తిరుపతిలోని ఎస్‌వీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, ఎస్‌వీ ఆర్ట్స్‌ కాలేజీలో బీకాం పూర్తి చేసి నెల్లూరులోని వీఆర్‌ లా కళాశాలలో బీఎల్‌ పట్టా అందుకోని 1990లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం మార్చు

దొనడి రమేశ్ బీఎల్‌ పూర్తి చేశాక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నారాయణ వద్ద జూనియర్‌గా చేరి కొంతకాలం తర్వాత సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి పరిపాలనా ట్రిబ్యునల్‌లో కేసులు వాదించాడు. ఆయన 2000 నుండి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా సర్వీసు సంబంధ వివాదాల వ్యవహారాలను, 2007 నుంచి 2013 వరకు ఏపీ సర్వశిక్షా అభియాన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2014 నుంచి 2019 వరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2020 జనవరి 11లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 2020 జనవరి 13న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.[3]

మూలాలు మార్చు

  1. The New Indian Express (12 January 2020). "Andhra Pradesh High Court gets four new judges". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  2. Andrajyothy (11 January 2020). "హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  3. Sakshi (11 January 2020). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.