ద్రోహి (2023 సినిమా)

ద్రోహి 2023లో విడుదలైన తెలుగు సినిమా. ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా బ్యానర్‌లపై రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ దాస్ పెందుర్తి దర్శకత్వం వహించాడు. సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్, మహేష్ విట్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో గ్లింప్స్ ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి[1], ట్రైల‌ర్‌ను హీరో త్రిగుణ్ విడుదల చేయగా సినిమాను నవంబర్ 3న విడుదల చేశారు.

ద్రోహి
దర్శకత్వంవిజయ్ దాస్ పెందుర్తి
రచనగణేష్
నిర్మాతరాజశేఖర్ రవి పూడి
శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి
తారాగణంసందీప్ బొడ్డపాటి
దీప్తి వర్మ
షకలక శంకర్
మహేష్ విట్ట
ఛాయాగ్రహణంఏ. వెంకట్
కూర్పుబి.మహేంద్రనాథ్
సంగీతంఅనంత నారాయణన్, సన్నీ సంకురు
నిర్మాణ
సంస్థలు
ప్లే వరల్డ్ క్రియేషన్స్
సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్
గుడ్ ఫెల్లోస్ మీడియా
విడుదల తేదీ
2023 నవంబరు 3 (2023-11-03)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • సందీప్‌ కుమార్ బొడ్డపాటి
  • దీప్తి వర్మ
  • డెబి
  • 'షకలక' శంకర్‌
  • నిరోజ్‌
  • శివ
  • మహేష్‌ విట్ట
  • మెహబూబ్
  • చాందినీ గొల్లపూడి

కథ మార్చు

సందీప్ (అజయ్) తన ఇద్దరి స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. చేసే ప్రతి బిజినెస్ ఫెయిల్ అయినా తన భార్య దీప్తి వర్మ (చంద్రిక) తనకు సపోర్టుగా ఉంటుంది. ఈ క్రమంలో తన జీవితంలో అనుకొని సంఘటన జరిగి చంద్రిక చనిపోతుంది. తన భార్యను చంపిన కేసులో తనని అనుమానితుడిగా పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ కేసు నుంచి హీరో బయట ఎలా పడ్డాడు ? అసలు ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[2]

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా
  • నిర్మాత: రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ దాస్ పెందుర్తి
  • సంగీతం: అనంత్‌ నారాయణ
  • సినిమాటోగ్రఫీ: ఏ. వెంకట్
  • డిఐ : రక్షిత్‌ కుమార్‌ గజ్జల
  • ఎడిటర్:బి.మహేంద్రనాథ్
  • పాటలు: నరేంద్ర కుమార్‌
  • కథ: గణేష్

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (9 September 2023). "'ద్రోహి' ఫస్ట్ లుక్ విడుదల చేసిన క్రిష్ - క్రిమినల్ ఎవరు?". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
  2. Sakshi (3 November 2023). "ద్రోహి సినిమా రివ్యూ". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.