షకలక శంకర్
షకలక శంకర్ ఒక తెలుగు సినీ నటుడు.[1] ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పేరు తెచ్చుకుని తరువాత పలు చిత్రాల్లో నటించాడు.[2]
వ్యక్తిగత జీవితం
మార్చుశంకర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడు. ఆర్థిక స్తోమత లేక పదోతరగతి దాకా చదువుకున్నాడు. ఒకసారి చిరంజీవి శివుడిగా నటించిన మంజునాథ సినిమా చిత్రీకరణ చూసి ఎలాగైనా సినిమాల్లో చేరాలని 2002 లో హైదరాబాదుకు వచ్చాడు. అప్పటికి అతని చేతిలో ఉన్న పని పెయింటింగు మాత్రమే.[3] శంకర్ ఏప్రిల్ 2016 లో తన మరదలు పార్వతిని అరసవిల్లి లో వివాహం చేసుకున్నాడు. తన వివాహాన్ని పెద్ద ఎత్తున ఖర్చు చేయకుండా ఆ డబ్బుతో అవసరమైన వారికి పుస్తకాలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశాడు. అందుచేత ఆ వివాహానికి తన సినీ మిత్రులెవరూ హాజరు కాలేదు.[4]
కెరీర్
మార్చుహైదరాబాదుకు వచ్చిన కొత్తల్లో తన స్నేహితుల దగ్గర ఉంటూ నాలుగేళ్ల పాటు పెయింటింగ్ పనులు చేశాడు. తరువాత ప్రముఖ నటి నిర్మలమ్మ వద్ద కొద్ది రోజులు పనిచేశాడు. అప్పుడే అతనికి సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కొద్దొ రోజులు ఆఫీస్ బాయ్ గా, ప్రొడక్షన్ బాయ్ గా పనిచేశాడు. రన్ రాజా రన్ సినిమా దర్శకుడు శంకర్ కు తను తీసిన ఓ లఘుచిత్రంలో అవకాశం ఇచ్చాడు.[3] తరువాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో చలాకీ చంటి బృందంలో సభ్యుడిగా ప్రవేశించాడు. తరువాత షకలక శంకర్ పేరుతో తనే సొంతంగా ఓ బృందం కూడా నడిపాడు. ప్రముఖ రాం గోపాల్ వర్మ ను అనుకరించడం, తనదైన శ్రీకాకుళం యాసతో, పవన్ కల్యాణ్ అభిమానిగా ఓ పాటను పాడటం లాంటి విలక్షణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తరువాత వరుసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు.
సినిమాలు
మార్చు- భవనమ్ (2024)
- శివం భజే (2024)
- ఓఎంజీ (2024)
- ఆ ఒక్కటీ అడక్కు (2024)
- గీతాంజలి మళ్ళీ వచ్చింది (2024)
- దళారి (2023)
- ద్రోహి (2023)
- అన్స్టాపబుల్ (2023)
- వాల్తేరు వీరయ్య (2023)
- రాజయోగం (2022)
- గాలోడు (2022)
- డై హార్డ్ ఫ్యాన్ (2022)
- దర్జా (2022)
- కార్పొరేటర్ (2021)
- బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది(2021)
- చెక్ మేట్ (2021)
- రాంగ్ గోపాల్ వర్మ (2020)
- మత్తు వదలరా (2019)
- భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (2019)
- నేనే కేడీ నెం.1 (2019)
- శంభో శంకర (2018)
- జంబలకిడిపంబ (2018)
- జతకలిసే
- సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు(2016)[5]
- నందిని నర్సింగ్హోం
- గీతాంజలి
- ఎక్స్ప్రెస్ రాజా
- రన్ రాజా రన్
- బంతిపూల జానకి
- కుందనపు బొమ్మ
- ప్రేమికుడు
- గరం
- రైట్ రైట్
- రాజుగారి గది
- కవ్వింత
- ఇంట్లో దెయ్యం నాకేం భయం
- ధర్మస్థలి
మూలాలు
మార్చు- ↑ "షకలక శంకర్ బయోగ్రఫీ, అతను నటించిన సినిమాలు". in.bookmyshow.com. Retrieved 13 October 2016.
- ↑ విలేకరి. "అదృశ్యమై..నటుడయ్యాడు". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 13 October 2016.
- ↑ 3.0 3.1 విలేకరి. "'షకలక' శంకర్". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 13 October 2016.
- ↑ "Comedian Shakalaka Shankar gets married". timesofindia.indiatimes.com. TNN. Retrieved 12 October 2016.
- ↑ "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.