ద్రౌపదీ వస్త్రాపహరణం

హెచ్. వి. బాబు 1936 లో దర్శకత్వం వహించిన చిత్రం.

ద్రౌపదీ వస్త్రాపహరణం 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యడవల్లి సూర్యనారాయణ, చిలకలపూడి సీతారామాంజనేయులు, నెల్లూరు నాగరాజారావు, చొప్పల్లి సూర్యనారాయణ, కన్నాంబ, వేమూరి గగ్గయ్య, అరణి సత్యనారాయణ, నాగభూషణం, దొమ్మేటి సత్యనారాయణ, రామతిలకం, వేమూరి పరబ్రహ్మ శాస్త్రి, కటారి శకుంతల, పువ్వుల నాగరాజకుమారి నటించారు.

ద్రౌపదీ వస్త్రాపహరణం
(1936 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం హెచ్.వి.బాబు
రచన మల్లాది అచ్యుతరామ శాస్త్రి
తారాగణం యడవల్లి సూర్యనారాయణ,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
నెల్లూరు నాగరాజారావు,
చొప్పల్లి సూర్యనారాయణ,
కన్నాంబ,
వేమూరి గగ్గయ్య,
అరణి సత్యనారాయణ,
నాగభూషణం,
దొమ్మేటి సత్యనారాయణ,
రామతిలకం,
వేమూరి పరబ్రహ్మ శాస్త్రి,
కటారి శకుంతల,
పువ్వుల నాగరాజకుమారి
సంగీతం మనువంటి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ కృత్తివెన్ను బ్రదర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించిన సి.యస్.ఆర్.ఆంజనేయులు
చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించిన సి.యస్.ఆర్.ఆంజనేయులు
ఒక సన్నివేశంలో దుర్యోధనుడిగా యడవల్లి సూర్యనారాయణ

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: హెచ్.వి.బాబు
  • రచన: మల్లాది అచ్యుతరామ శాస్త్రి
  • సంగీతం: మనువంటి వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: కృత్తివెన్ను బ్రదర్స్

పాటలు-పద్యాలు

మార్చు
శిశుపాల పాత్రధారి వేమూరి గగ్గయ్య ఆలపించిన పద్యాలు

1: కులమా గోత్రమా యురాపేరా సభలో కూర్చుండ- వేమూరి గగ్గయ్య

2: వారిధులన్ గలంతు సురవర్గము త్రుళ్ళిడగింతు - వేమూరి గగ్గయ్య

3: స్నానంబు సలుపు లేజవరాండ్ర చీరలు కాజేసినందుకా- వేమూరి గగ్గయ్య

4.అతిదూర్త కలన మత్పతుల వంచించిన ఖలులు- పసుపులేటి కన్నాంబ

5.అనితరి ధన్య సంపదల కాశ్రయమైన ద్విజత్వమన్యరా- చొప్పల్లి సూర్యనారాయణ

6.అమలచరిత్ర నీదు బహుళాదర దృప్తినిజేసి-చొప్పల్లి సూర్యనారాయణ

7.అరవిందాక్ష భవతూస్వి పామిల బ్రత్యక్షంభు- చొప్పల్లి సూర్యనారాయణ

8.ఆత్మనాథుడు శకుని సాహాయ్యమునను ద్యూతమున- శకుంతల

9.ఆనంద జయహారతి యదుకుల గిరిధారి నీకు- బృందం

10.ఆశలుబెంచు విద్విష నిషానలమున్ కలిగించు- ఆరణి సత్యనారాయణ

11.ఎందుకు మీ తపంబు జపమెందుకు నిస్టులు - కోటిసూర్యం

12.ఎవ్వాని వాకిట నిభమధపంకంబు రాజ భూషణా- దొమ్మేటీ సత్యనారాయణ

13.ఏమికానున్నదో కదా ఈశ్వరేచ్చ గుండియల్ కొట్టుకొన- పసుపులేటి కన్నాంబ

14.ఏల ఈ లీల బాళీదేలా చెలియ చలోక్తులకా- చిలకలపూడి సీతారామాంజనేయులు

15.ఏ వంశవృద్ధి సంభావించి దుర్ఘట బ్రహ్మచర్యమును- మద్ధిపట్ల సూర్యనారాయణ

16.కపటద్యూత సమాగత ద్రవిన దుష్కాదంబరీపానను- దొమ్మేటి సూర్యనారాయణ

17.కురుకుల వర్ధనుండు ప్రతికూల మనోగతభావనా- కుంపట్ల సుబ్బారావు

18.జయ జయ జయ అజహర హరిశౌరి మురారి - బృందం

19.కురువృద్ధుల్ గురువృద్ధి భాంధవులనేకులు- దొమ్మేటి సూర్యనారాయణ

20.చూడ చూడ కలికి శోభమౌగ పతుల ప్రేమలో- రామతిలకం

21.జనన మరణాత్మక ప్రపంచమున కీవు కారణ - పి.సూరిబాబు

22.జలముల గట్టి త్రోసిరి విషం బిడియుoటిరి భోజ్యమందు- దొమ్మేటి సూర్యనారాయణ

23.తులసీమాతా దుఃఖరహితా హి భుజాత- పసుపులేటి కన్నాంబ

24.దయగనవా దామోదరా ఔనా హి సుమనా- నాగరాజకుమారి

25.ధన్యతరాగ మోదిత హితప్రదు డాగురుధైవ్య - చిలకలపూడి సీతారామాంజనేయులు

26.నీ భక్తి తెలియతరమా ఇంపు నింపు ఈ చీర- చిలకలపూడి సీతారామాంజనేయులు

27.నీ సుకుమార సుందర వినీలతనూలతిక - రామతిలకం

28.పాదము క్రింద వినీనొకప్రక్క పరుండబెట్టి-దొమ్మేటి సూర్యనారాయణ

29.ప్రాగ్జ్యోతిషంబున భగవత్తుపై మేముపోయిన - చిలకలపూడి సీతారామాంజనేయులు

30.బలమగు రాజ్యసంపదలు బాయున్ గాక- చొప్పల్లి సూర్యనారాయణ

31.భామరో ఎంత బెలవయి పల్కితినమ్మా- పసుపులేటి కన్నాంబ

32.భావనిర్మిత మహాప్రసాద భాహ్యాదౌ - యడవల్లి సూర్యనారాయణ రావు

33.మురళీధర వర గోపకిషోరా గురుప్రణయ బాసురా- పి.సూరిబాబు

34.మేలుకోవే కౌరవేశ రమణ రిపుహరణ - బృందం

35.యాగ సమాప్తమందలి భయంకరమైన త్రయోధ- చొప్పల్లి సూర్యనారాయణ

36.యాదవ పుణ్యభూమినులందు కరంబు చలంబు-

37.రమణీరో యాలకింపుము శిరమ్మున్న పింఛము- చిలకలపూడి సీతారామాంజనేయులు

38.రే సాధువసంతా ముదితవనాల తాంతా - రామతిలకo

39.విధితయశునడు పాండుపృద్వీపతినా కనుజన్ము- కుంపట్ల సుబ్బారావు

40.వెరపా లజ్జయా మానమా తగవా గంభీర ప్రలాపంబులా- వెల్లంకి వెంకటేశ్వర్లు

41.శ్రీరంగా మోహనా చక్రధరా గిరిధర నరగుణ - బృందం

42.సతీసుకుమార రాణి గుణ సస్య వివర్ధన పుణ్యభూమి - ఆరణి సత్యనారాయణ

43.సహింతురా దురాగతుల క్షమింతురా జాలి బాసినారా- పసుపులేటి కన్నాంబ

44.హృదయము సందడించును సహింపగరాని దురంత- పసుపులేటి కన్నాంబ

45.హే హే ద్వారకావాసా బాలకృష్ణా దాస శరణ్య- పసుపులేటి కన్నాంబ .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.