ద్వాదశి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పన్నెండవ తిథి ద్వాదశి. చాంద్రమానంలో శుక్లపక్షంలో వచ్చు ద్వాదశిని శుద్ధ ద్వాదశి అనీ, కృష్ణపక్షంలో వచ్చు ద్వాదశిని బహుళ ద్వాదశి అని పిలుస్తారు. ద్వాదశికి అధి దేవత - విష్ణువు. దీనికి ముందు వచ్చు తిథి ఏకాదశి అయితే తర్వాత వచ్చు తిథి త్రయోదశి.
పండుగలు సవరించు
కార్తీక శుద్ధ ద్వాదశి - క్షీరాబ్ధి ద్వాదశి : సవరించు
అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి.అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది.[1]
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని 'బృందావని ద్వాదశి'గా పిలుస్తారు.
రామలక్ష్మణ ద్వాదశి సవరించు
జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహములను తయారుచేయించి , పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానముచేయవలెనని వరాహపురాణము చెప్పుచున్నది. కనుకనే ఆ ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగల్గినది.[2]
మూలాలు సవరించు
- ↑ Madhuri, Geddam Vijaya. "క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఇదే.. ఈరోజు అలా చేస్తే చాలా మంచిదట." Hindustantimes Telugu. Retrieved 2022-12-25.
- ↑ "జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకర కైలాస గమనం". శంకరవాణి (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-06-13. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25.