ద బీటిల్స్

గొప్ప బ్యాండ్ కళాకారుడు

ద బీటిల్స్ అన్నది జాన్ లెనాన్, పాల్ మెక్ కర్ట్నీ, జార్జి హారిసన్, రింగో స్టార్ వంటివారు సభ్యులుగా లివర్‌పూల్లో 1960 సంవత్సరంలో ప్రారంభమైన ఇంగ్లీష్ రాక్ బ్యాండ్. వారు రాక్ యుగంలోకెల్లా అత్యంత ప్రాచుర్యమైన ఘట్టంగా పేరొందింది.[1] స్కిఫిల్, బీట్, 1950ల నాటి రాక్ అండ్ రోల్ వంటి రకాల శైలీ సంగీతాలే కాకుండా పాప్ బల్లాడ్ లు, భారతీయ సంగీతం, సైకెడెలియా, హార్డ్ రాక్ వంటి సంగీత శైలులతో, అప్పుడప్పుడు శాస్త్రీయ సంగీత అంశాలు, వినూత్నమైన, అసంప్రదాయిక రికార్డింగ్ విధానాలు కలగలిసి ద బీటిల్స్ సంగీతంలో ఉండేవి.[2] 1960ల తొలినాళ్ళలో వారి విపరీతమైన ప్రజాదరణ బీటిల్ మానియాగా రూపొందిందింది, అయతే రానురానూ గీతరచయితలు లెనన్, మెక్ కార్ట్నీలు ప్రారంభించి విస్తరించిన సోఫిస్టికేషన్ కారణంగా 1960ల నాటి కౌంటర్ కల్చర్ లోనిని ఆదర్శాల రూపంగా భాగంగా బీటిల్స్ ని చూడడం ప్రారంభమైంది.[3]

ద బీటిల్స్
A square quartered into four head shots of young men with moptop haircuts. All four wear white shirts and dark coats.
1964లో ఫ్యాబ్ ఫోర్ చిత్రం. పైన ఎడమ చిత్రం నుంచి క్లాక్ వైజ్: జాన్ లెనన్, పాల్ మెకర్ట్నీ రింగో స్టిర్, జార్జి హారిసన్.
వ్యక్తిగత సమాచారం
మూలంలివర్‌పూల్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్ డమ్
సంగీత శైలి
క్రియాశీల కాలం1960–1970
లేబుళ్ళు
  • ఈఎంఐ
  • పాలీడర్ రికార్డ్స్
  • పార్లొఫోన్
  • స్వాన్ రికార్డ్స్
  • వీ-జే రికార్డ్స్
  • కాపిటల్ రికార్డ్స్
  • యునైటెడ్ ఆర్టిస్ట్స్ రికార్డ్స్
  • యాపిల్ రికార్డ్స్
సంబంధిత చర్యలు
  • ది క్వారీమేన్
  • బిల్లీ ప్రెస్టాన్
  • ప్లాస్టిక్ ఓనో బ్యాండ్
పూర్వపు సభ్యులు
  • జాన్ లెనాన్
  • పాల్ మెక్ కార్ట్నీ
  • జార్జ్ హ్యారిసన్
  • రింగో స్టార్
ఇతరులు..

స్టూవార్ట్ సూట్ క్లిఫ్ గిటార్ వాద్యకారునిగా బీటిల్స్ 1960 నుంచి మూడేళ్ళ పాటు లివర్ పూల్, హ్యాంబర్గ్ నగరాల్లోని క్లబ్బుల్లో ప్రదర్శనలు ఇచ్చి తమ తొలినాళ్ళలో ప్రాచుర్యం పెంచుకున్నారు. ప్రధాన సభ్యులైన లెనన్, మెక్ కార్ట్నీ, హారిసన్ లు పెటె బెస్ట్ సహా పలువురు డ్రమ్మర్లను మారుస్తూ చివరికి స్టార్ వారితో చేరి స్థిరంగా నిలిచారు. మేనేజర్ బ్రియాన్ ఎప్ స్టెయిన్ వారిని ప్రొఫెషనల్ బ్యాండ్ గా మలచగా, నిర్మాత జార్జ్ మార్టిన్ వారికి మార్గదర్శకత్వం చేపట్టి, రికార్డింగ్స్ విస్తృతంగా చేయిస్తూ 1962లో లవ్ మీ డూ అన్న మొదటి హిట్ తర్వాత యుకెలో కూడా ప్రాచుర్యం విస్తరించేలా కృషిచేశారు. తర్వాతి సంవత్సరంలో బ్రిటన్లో బీటిల్ మానియా పెరగడం ప్రారంభమైన నాటి నుంచి వారికి ఫాబ్ ఫోర్ అన్న మారుపేరు వచ్చింది. 1964 తొలినాళ్ళకల్లా వారు అంతర్జాతీయ స్థాయి తారలుగా ఎదిగి యునైటెడ్ స్టేట్స్ పాప్ మార్కెట్ పై చేసిన బ్రిటీష్ ఆక్రమణలో నేతృత్వం వహించారు. 1965 నుంచి బీటిల్స్ రబ్బర్ సోల్ (1965), రివాల్వర్ (1966), పెప్పర్స్ లోన్లీ హార్ట్స్ క్లబ్ బ్యాండ్ (1967), ద బీటిల్స్  (సాధారణంగా ద వైట్ ఆల్బంగా పేరొందింది, 1968), అబ్బే రోడ్ (1969) వంటి వినూత్నమైన రికార్డింగులు విడుదల చేస్తూ కొనసాగారు. 1970లో వారు విడిపోయాకా కూడా వేర్వేరు స్థాయిల్లో విజయవంతమైన మ్యూజిక్ కెరీర్ కొనసాగిస్తూ వచ్చారు. లెనిన్ డిసెంబరు 1980లో కాల్పుల్లో మరణించగా, హ్యారిసన్ నవంబరు 2001లో కాలేయ క్యాన్సర్ వల్ల చనిపోయారు. జీవించివున్న మెక్ కార్ట్నీ, స్టిర్ ఇంకా సంగీతపరంగా చురుకుగానే ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల రికార్డులు అమ్ముడుపోయాయన్న అంచనా ఆధారంగా ద బీటిల్స్ బ్యాండ్ అమ్మకాల పరంగా చరిత్రలోకెల్లా ప్రాచుర్యం పొందిన బ్యాండ్ గా నిలుస్తోంది. బ్రిటీష్ చార్టుల్లో చాలా నంబర్ వన్ స్థానానికెక్కిన ఆల్బంలు అందించినదీ, యుకెలో సింగిల్ రికార్డులు అతి ఎక్కువ అమ్ముడుపోయిన చరిత్ర కలిగినదీ ఈ బీటిల్స్ బ్యాండే. ఆర్ఐఎఎ ప్రకారం, బీటిల్స్ సంగీతకారులు 178 మిలియన్ల సర్టిఫైడ్ యూనిట్లతో అమెరికాలోనూ అతి ఎక్కువ విలువ కల సంగీతకారులుగా నిలిచారు. 2008లో బిల్ బోర్డ్ పత్రిక వారి సార్వకాలికంగా అత్యంత విజయవంతమైన హాట్ 100 కళాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు; As of 2016, హాట్ 100 చార్ట్ లో నంబర్ వన్ పాటల్లో 20 వీరివే.  10 గ్రామీ పురస్కారాలు, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ స్కోర్ విభాగంలో ఒక ఆస్కార్ పురస్కారం, 15 ఇవార్ నోవెల్లో పురస్కారాలు పొందినవారిగా నిలిచారు. 1988లో రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో  ఈ గ్రూపును చేర్చారు, గ్రూపులోని నలుగురు సభ్యులు విడివిడిగా వ్యక్తిగతంగా 1994 నుంచి 2015 మధ్యకాలంలో హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు. 20వ శతాబ్దిలో అత్యంత ప్రభాశాలురైన 100 మంది జాబితాలో సంయుక్తంగా చోటు పొందారు.

మూలాలు

మార్చు
  1. Unterberger, Richie.Unterberger, Richie. ద బీటిల్స్ at Allmusic. Retrieved 5 July 2013.
  2. Schinder, Scott; Schwartz, Andy (2007). Icons of Rock: An Encyclopedia of the Legends Who Changed Music Forever. Westport, CT: Greenwood Press. ISBN 978-0-313-33845-8.
  3. Gould, Jonathan (2007). Can't Buy Me Love: The Beatles, Britain and America. New York: Three Rivers Press. ISBN 978-0-307-35338-2.