ద మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి
ద మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి (The Monk Who Sold his Ferrari) వ్యక్తిత్వ వికాస రచయిత, వక్త అయిన రాబిన్ శర్మ రాసిన పుస్తకం. ఇది 25 సంవత్సరాల వరకు న్యాయవాదిగా పనిచేసిన రాబిన్ శర్మ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రాసిన వ్యాపారనీతికథ.
రచయిత(లు) | రాబిన్ శర్మ |
---|---|
దేశం | కెనడా |
భాష | ఆంగ్లం |
ప్రచురణ సంస్థ | హార్పర్ కోలిన్స్ |
ప్రచురించిన తేది | ఏప్రిల్ 21, 1999 |
పుటలు | 198 పుటలు |
ISBN | 978-0062515674 |
ప్రచురణ
మార్చుఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ పబ్లిషర్స్ 1999 లో ప్రచురించారు. ఈ పుస్తకం 2013 నాటికి ముప్ఫై లక్షలకు పైగా ప్రతులు అమ్ముడయ్యాయి.[1]
సారాంశం
మార్చుఈ పుస్తకంలో ప్రధానంగా రెండు పాత్రలు ఉన్నాయి. ఒకరు జులియన్ మాంటిల్, రెండు అతని స్నేహితుడు జాన్. కథ వీరిద్దరి మధ్య సంభాషణ రూపంలో సాగుతుంది. జూలియన్ తన హాలిడే హోమ్, రెడ్ ఫెరారీని విక్రయించిన తర్వాత హిమాలయ ప్రయాణంలో తన ఆధ్యాత్మిక అనుభవాలను వివరిస్తాడు. అమెరికాలో పేరు గాంచిన న్యాయవాది అయిన జూలియన్, ఒకసారి కేసు వాదిస్తుండగా కోర్టులోనే గుండె నొప్పితో కుప్పకూలిపోతాడు. ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో బయటపడ్డ జూలియన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన న్యాయవాద వృత్తికి రాజీనామా చేస్తాడు. తనకు చిరకాలంగా ఉన్న కోరికను నెరవేర్చుకోవడం కోసం భారతదేశానికి వెళ్ళి అక్కడ హిమాలయాల్లో ఉన్న కొంతమంది యోగులను కలుసుకోవాలని అనుకుంటాడు. అక్కడు జన సామాన్యానికి దూరంగా ఉండే శివన మఠ యోగులను కులుసుకుని, వారిలో ఒకడైన రామన్ యోగి నుంచి శిక్షణ పొందుతాడు. ఆ శిక్షణలో తాను పొందిన పరిజ్ఞానాన్ని జాన్ కి తెలియజేస్తాడు.
అధ్యాయాలు
మార్చు- మేలుకొలుపు
- విలక్షణ అతిథి
- జూలియన్ మాంటిల్ లో ఆకస్మిక పరిణామం
- శివన యోగులతో అద్భుత సమాగమం
- ఆధ్యాత్మిక విద్యార్థి
- వ్యక్తిగత వికాసంలోని విజ్ఞత
- అసాధారణమైన ఉద్యానవనం
- నీ అంతర్జ్వాలను వెలిగించు
- స్వీయ నాయకత్వం అనే ప్రాచీన కళ
మూలాలు
మార్చు- ↑ Sharma, Robin S. (2006). The Monk Who Sold His Ferrari : A Fable About Fulfilling Your Dreams And Reaching Your Destiny. Mumbai, Agartha road, India: Jaico Pub. House. p. 1. ISBN 9788179921623.