హిమాలయాలు

ఆసియాలోని పర్వత శ్రేణి

హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్, చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.[1]

హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.

ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరాలున్నాయి. సుమారు నూరు శిఖరాలు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.[2]

ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర, యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు. వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ, 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.

హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు

మార్చు
శిఖరం పేరు ఇతర పేర్లు, అర్థం ఎత్తు (మీటర్లు) ఎత్తు (అడుగులు) మొదటి అధిరోహణ వ్యాఖ్యలు/గమనికలు అక్షాంశరేఖాంశాలు[3]
ఎవరెస్టు శిఖరం సాగర్ మాతా, "ఆకాశ నుదురు",
చోమోలాంగ్మా, "విశ్వమాత"
8,848 29,029 1953 ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు. 27°59′17″N 86°55′31″E / 27.98806°N 86.92528°E / 27.98806; 86.92528
కే-2 చోగో గాంగ్రి 8,611 28,251 1954 ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్, చైనాలోని జింజియాంగ్ లో గలదు. 35°52′53″N 76°30′48″E / 35.88139°N 76.51333°E / 35.88139; 76.51333
కాంచనగంగ కాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" 8,586 28,169 1955 ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్), నేపాల్ లో గలదు. 27°42′12″N 88°08′51″E / 27.70333°N 88.14750°E / 27.70333; 88.14750 *
లోట్‌సే "దక్షిణ శిఖరం" 8,516 27,940 1956 ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్, టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు 27°57′42″N 86°55′59″E / 27.96167°N 86.93306°E / 27.96167; 86.93306
మకాలూ "మహా నల్లనిది (The Great Black)" 8,462 27,765 1955 ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. 27°53′23″N 87°5′20″E / 27.88972°N 87.08889°E / 27.88972; 87.08889
చో ఓయు ఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత" 8,201 26,905 1954 ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. 28°05′39″N 86°39′39″E / 28.09417°N 86.66083°E / 28.09417; 86.66083
ధవళగిరి "తెల్లని పర్వతం" 8,167 26,764 1960 ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. 28°41′48″N 83°29′35″E / 28.69667°N 83.49306°E / 28.69667; 83.49306
మానస్లూ కుటాంగ్, "ఆత్మ పర్వతం" 8,156 26,758 1956 ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు. 28°33′00″N 84°33′35″E / 28.55000°N 84.55972°E / 28.55000; 84.55972
నంగా పర్వతం దయామీర్, "నగ్న పర్వతం" 8,126 26,660 1953 ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు. 35°14′14″N 74°35′21″E / 35.23722°N 74.58917°E / 35.23722; 74.58917
అన్నపూర్ణ "పంటల దేవత" 8,091 26,545 1950 ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు. 28°35′44″N 83°49′13″E / 28.59556°N 83.82028°E / 28.59556; 83.82028
గాషెర్‌బ్రమ్ I "అందమైన పర్వతం" 8,080 26,509 1958 ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. 35°43′28″N 76°41′47″E / 35.72444°N 76.69639°E / 35.72444; 76.69639
విశాల శిఖరం ఫైచాన్ కాంగ్రి 8,047 26,401 1957 ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు.. 35°48′38″N 76°34′06″E / 35.81056°N 76.56833°E / 35.81056; 76.56833
గాషెర్‌బ్రమ్ II - 8,035 26,362 1956 ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు.. 35°45′28″N 76°39′12″E / 35.75778°N 76.65333°E / 35.75778; 76.65333
షిషాపాంగ్మా జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" 8,013 26,289 1964 ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు.. 28°21′12″N 85°46′43″E / 28.35333°N 85.77861°E / 28.35333; 85.77861
గాషెర్‌బ్రమ్ IV - 7,925 26,001 1958 ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనాలో గలదు. . 35°45′38″N 76°36′58″E / 35.76056°N 76.61611°E / 35.76056; 76.61611
మషేర్బ్రం / K1 మషెర్బ్రమ్ 7,821 25,660 1960 ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. . 35°38′28″N 76°18′21″E / 35.64111°N 76.30583°E / 35.64111; 76.30583
నందా దేవి "ఆశీర్వదించు-దేవత" 7,817 25,645 1936 ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్లో గలదు.. 30°22′33″N 79°58′15″E / 30.37583°N 79.97083°E / 30.37583; 79.97083
రాకాపోషి "మెరిసే కుడ్యము" 7,788 25,551 1958 శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. . 36°08′33″N 74°29′22″E / 36.14250°N 74.48944°E / 36.14250; 74.48944
గాంగ్‌ఖర్ పుయెన్సుమ్ గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" 7,570 24,836 అధిరోహించలేదు ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్లో గలదు.. 28°02′50″N 90°27′19″E / 28.04722°N 90.45528°E / 28.04722; 90.45528 *
అమా దబ్లామ్ "తల్లి , ఆమె నెక్లేస్" 6,848 22,467 1961 ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూలో గలదు. .

ధార్మిక స్థానాలు

మార్చు
 
జమ్మూ లోని వైష్ణోదేవి మందిరం.
 
టిబెట్ పీఠభూమి ఆగ్నేయం నుండి ఎవరెస్టు పర్వతం దృశ్యచిత్రం.

హిమాలయాలలో హిందూ, బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Oracle Education Foundation: Indian Himalayas". Archived from the original on 2007-10-11. Retrieved 2008-05-07.
  2. "Himalayan Mountain System". Retrieved 2007-08-07.
  3. Coordinates were established by comparing topographical maps with satellite images and SRTM-derived terrain maps. The terrain maps and satellite images often don't match exactly. An asterisk (*) indicates that the map and image are shifted by more than 100 m (4") and/or that the landscapes around the summit don't match.

ఇతర పఠనాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

చిత్రమాలిక

మార్చు