ధరిత్రి దినోత్సవం

ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం. 1970 లో మొదటి ధరిత్రి దినోత్సవం జరుపుకున్నాం.[1] [2]పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం.

ధరిత్రి దినోత్సవం
ధరిత్రి దినోత్సవం
ప్రాముఖ్యతపర్యావరణ పరిరక్షణకు మద్దతు
ప్రారంభం1970
జరుపుకొనే రోజుఏప్రిల్ 22
ఆవృత్తివార్షికం

చరిత్రసవరించు

పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం. మొదట ఐక్యరాజ్యసమితి 1969, మార్చిలో జాన్‌మెక్కల్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా రాజకీయవేత్త గేలార్డ్‌ నెల్సన్‌ ప్రారంభించాడు. 1962లో సెనెటర్‌ నెల్సన్‌కి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రీ దినోత్సవం. తన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమవడం గమనించి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు నెల్సన్‌ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ప్రెసిడెంట్‌ కెన్నెడిని కలసి తన ఆలోచనను వివరించాడు.దీని ప్రకారం ప్రెసిడెంట్‌ కెన్నెడి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు దేశమంతటా పర్యటించాల్సి ఉంటుంది. ఈ ఆలోచన నచ్చి కెన్నెడి పర్యటించేందుకు ఒప్పుకున్నాడు.కాని ప్రెసిడెంట్‌ కెన్నెడి పర్యటన సఫలీకృతం కాలేదు. ఎవ్వరూ ఈ సమస్యపై అప్పటి సమాజం పెద్దగా పట్టించుకోలేదు.1969లో సెనెటర్‌ నెల్సన్‌కి మరొక ఆలోచన వచ్చింది. మన వాతావరణంలో జరిగే మార్పులనూ వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికీ తెలియ చెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే తన ఆలోచనకు రూపకల్పన చేస్తూ, ఒక వార్తాపత్రిక ద్వారా ప్రజలకూ ఈ ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించారు. 1970 ఏప్రిల్‌ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం జరిగింది. ఆరోజు ఆ దేశంలోని ప్రజలంతా ధరిత్రిని రక్షించుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రమాణాలు చేసారు. ఇలా తొలుత అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాపితమైంది. ప్రజలలో మరింత అవగాహన కలిగించేందుకు ఎర్త్‌ డే నెట్‌వర్క్‌ ఏర్పడింది.

మూలాలుసవరించు

  1. "Earth Day Network". Earthday.net. Retrieved April 22, 2011.
  2. "Earth Day International". Archived from the original on March 15, 2010. Retrieved April 15, 2013.

వెలుపలి లంకెలుసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.