ధర్మలాల్ కౌశిక్
ధరమ్‌లాల్ కౌశిక్ (జననం: 1958 ఫిబ్రవరి 1) భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2009 నుండి 2014 వరకు ఛత్తీస్‌గఢ్ శాసనసభకు 3వ స్పీకరుగా పనిచేసాడు. 2019 జనవరి 4న, 2018 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ చేతిలో భారతతీయ జనతా పార్టీ ఓడిపోవడంతో ఛత్తీస్‌గఢ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 మార్చి వరకు బీజేపీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
రాజకీయ జీవితం
మార్చుకౌశిక్ తొలిసారిగా 1998లో బిల్హా విధానసభ నియోజకవర్గం నుంచి మధ్య ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుండి ఛత్తీస్‌గఢ్ ఏర్పడిన తర్వాత, కౌశిక్ 2003 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసాడు కానీ భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన సియారామ్ కౌశిక్ చేతిలో ఓడిపోయాడు. తరువాత జరిగిన 2008
ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలలో, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి సియారామ్ కౌశిక్‌పై 6,070 ఓట్ల తేడాతో విజయం సాధించి ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికయ్యారు. మళ్ళీ, అతను 2013 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి సియారామ్ కౌశిక్ చేతిలో ఓడిపోయాడు. 2018 డిసెంబరు 11న 2018న, అతను మళ్లీ బిల్హా విధానసభ నియోజకవర్గం ఎన్నికల్లో గెలిచి ఛత్తీస్‌గఢ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడయ్యాడు.