ధర్మశాల
ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నగరం, కాంగ్రా జిల్లా లోని ఒక మునిసిపల్ కౌన్సిల్. ఇది జిల్లా ప్రధాన కేంద్రం. దీన్ని గతంలో భాగ్సు పిలిచేవారు. దలైలామా నివాసం, ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి చెందిన మధ్య టిబెట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ధర్మశాలలో ఉన్నాయి. ఇది కాంగ్రా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర్మశాల పట్టణం దాదాపు 8.51 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, సముద్ర మట్టానికి 1457 మీటర్ల (4780 అడుగులు) ఎత్తున ఉంది. క్రింద లోయలలో పెరిగిన ప్రధాన పంటలు, గోధుమ, తేయాకు. ధర్మశాల పట్టణం గాగ్గల్ విమానాశ్రయం ద్వారా చేరుకోవచ్చు.
Dharamshala
Dharamsala | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
City | ||||||||
Nickname: Dhasa | ||||||||
Coordinates: 32°12′55″N 76°19′07″E / 32.21528°N 76.31861°E | ||||||||
Country | India | |||||||
State | Himachal Pradesh | |||||||
District | Kangra | |||||||
Named for | Derives its name from an old Hindu sanctuary, called Dharamsàl which stood there once.[1] | |||||||
Member of legislative Assembly | Sudhir Sharma[2] | |||||||
Government | ||||||||
• Type | Municipal Corporation | |||||||
• Body | Dharamshala Municipal Corporation[3] | |||||||
• Mayor | Onkar Singh Nehria | |||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 27.60 కి.మీ2 (10.66 చ. మై) | |||||||
Elevation | 1,457 మీ (4,780 అ.) | |||||||
జనాభా (2015)[4] | ||||||||
• Total | 62,596 | |||||||
• Rank | 2nd in HP | |||||||
• జనసాంద్రత | 2,300/కి.మీ2 (5,900/చ. మై.) | |||||||
Time zone | UTC+5:30 (IST) | |||||||
PIN | 176 215 | |||||||
Telephone code | +91- 01892 | |||||||
Vehicle registration | HP- 39(RLA), 68(RTO), 01D/02D(Taxi) | |||||||
Climate | Cwa |
టిబెట్ కాందిశీకులు
మార్చు1959 లో ప్రస్తుత దలైలామా (14 వ దలైలామా) టిబెట్ నుండి తప్పించుకుని ధర్మశాలకు రావడంతో ఇక్కడికి టిబెట్ కాందిశీకుల రాక మొదలైంది. వారిని ఎగువ ధర్మశాలలో ఉన్న మెక్‌లియోడ్‌గంజ్ లో తలదాచుకునేందుకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుమతించాడు. స్వాతంత్ర్యానికి ముందు ఈ ప్రాంతం బ్రిటిషు వారికి వేసవి విడిదిగా ఉండేది. "'అడవుల్లో నిష్ప్రయోజనంగా పడి ఉన్న ఆ నిర్జన పట్టణాన్ని' నెహ్రూ వాళ్లకు సంతోషంగా అప్పగించాడు."[5] 1960 లో దలైలామా అక్కడ తన ప్రవాస ప్రభుత్వాన్ని, నామ్‌గ్యాల్ విహారాన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ధర్మశాల అనేక శతాబ్దాలుగా హిందువులకు, బౌద్ధులకూ ధార్మిక స్థలంగా ఉంటూ వచ్చింది. 19 వశతాబ్దం లోనే టిబెట్ వలసదారులు అక్కడ బౌద్ధారామాలను స్థాపించారు. 1970లో టెంజిన్ గ్యాట్సో (14 వ దలైలామా) 80,000 రాత ప్రతులతోను, టిబెట్ చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన ఇతర గ్రంథాలతోనూ కూడిన గ్రంథాలయాన్ని స్థాపించాడు. టిబెటాలజీకి సంబంధించి ఇది ప్రపంచం లోనే అత్యుత్తమ అధ్యయన కేంద్రంగా భావిస్తారు.
ప్రస్తుతం అనేక వేల మంది టిబెటన్లు ధర్మశాల లోని మెక్‌లియోడ్‌గంజ్ లో స్థిరపడ్డారు. అనేక ఆరామాలు, పాఠశాలలనూ వాళ్ళు స్థాపించారు. ప్రస్తుతం ఇది పెద్ద పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. ధర్మశాల హిమాచల ప్రదేశ్ రాష్ట్రపు శీతాకాల రాజధాని. ఇక్కడున్న శాసనసభలో శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ధర్మశాల ప్రఖ్యాత పక్షి పరిశీలనా కేంద్రం కూడా.[6]
శీతోష్ణస్థితి
మార్చుధర్మశాలలో ఋతుపవన ఆధారిత ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవి కాలం ఏప్రిల్లో మొదలై, జూన్‌లో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 36 °C (97 °F)కు చేరి జూన్ మధ్య వరకు ఉంటాయి. జూలై నుండి సెప్టెంబరు మధ్య వరకు వర్షాకాలం ఉంటుంది. సగటున 3,000 మి.మీ. వరకు వర్షం పడుతుంది. ధర్మశాల రాష్ట్రంలో కెల్లా అత్యధిక వర్షపాతం ఉండే ప్రదేశాల్లో ఒకటి.
శరత్కాలం నవంబరు చివరి వరకూ ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 16–17 °C (61–63 °F). వరకు ఉంటాయి. శీతాకాలం డిసెంబరులో మొదలై, ఫిబ్రవరి వరకూ ఉంటుంది. ఎగువ ధర్మశాలలో మంచు కురియడం మామూలే. 2012 జనవరి 7 న కురిసిన మంచు ఇటీవలి కాలంలో అత్యధికం.
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అత్యధిక రికార్డు °C (°F) | 24.7 (76.5) |
28.0 (82.4) |
31.6 (88.9) |
35.6 (96.1) |
38.6 (101.5) |
38.6 (101.5) |
42.7 (108.9) |
37.8 (100.0) |
34.8 (94.6) |
34.6 (94.3) |
26.6 (79.9) |
27.2 (81.0) |
42.7 (108.9) |
సగటు అధిక °C (°F) | 15.7 (60.3) |
17.1 (62.8) |
21.5 (70.7) |
26.5 (79.7) |
30.3 (86.5) |
31.2 (88.2) |
27.3 (81.1) |
26.6 (79.9) |
26.6 (79.9) |
25.2 (77.4) |
21.7 (71.1) |
17.8 (64.0) |
24.0 (75.2) |
సగటు అల్ప °C (°F) | 6.0 (42.8) |
7.3 (45.1) |
10.9 (51.6) |
15.4 (59.7) |
19.1 (66.4) |
20.9 (69.6) |
20.0 (68.0) |
19.7 (67.5) |
18.0 (64.4) |
14.3 (57.7) |
10.3 (50.5) |
7.2 (45.0) |
14.1 (57.4) |
అత్యల్ప రికార్డు °C (°F) | −1.9 (28.6) |
−1.6 (29.1) |
2.4 (36.3) |
7.3 (45.1) |
8.8 (47.8) |
12.6 (54.7) |
14.3 (57.7) |
14.1 (57.4) |
11.2 (52.2) |
8.0 (46.4) |
4.8 (40.6) |
−1.0 (30.2) |
−1.9 (28.6) |
సగటు వర్షపాతం mm (inches) | 80.2 (3.16) |
123.5 (4.86) |
125.2 (4.93) |
65.4 (2.57) |
80.2 (3.16) |
241.2 (9.50) |
765.4 (30.13) |
787.4 (31.00) |
354.1 (13.94) |
56.3 (2.22) |
26.1 (1.03) |
50.9 (2.00) |
2,755.8 (108.50) |
సగటు వర్షపాతపు రోజులు | 4.5 | 6.1 | 6.4 | 5.2 | 5.2 | 9.8 | 20.6 | 22.4 | 13.0 | 2.8 | 1.4 | 2.8 | 100.2 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 66 | 63 | 54 | 47 | 45 | 53 | 80 | 86 | 78 | 63 | 62 | 65 | 63 |
Source: India Meteorological Department[7][8] |
ఇతర విశేషాలు
మార్చుటీ తోటలు
మార్చుధర్మశాల టీ తోటలకు, ముఖ్యంగా కాంగ్రా టీకి ప్రసిద్ధి. దీనితో పాటు అనేక ఇతర రకాల టీ కూడా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, టీ తోటల్లో, టీ తయారీ కర్మాగారాల్లో సందర్శకులు చూడవచ్చు, వివిధ రకాల టీని రుచి చూడవచ్చు.[9]
ధర్మశాల అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్
మార్చు2012 లో ధర్మశాల అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ను రితు సరీన్, టెంజింగ్ సోనమ్ లు స్థాపించారు.[10]
ట్రెక్కింగు
మార్చుధర్మశాల నుండి అనేక ట్రెక్కింగు దారులు బయలుదేరి చంబా వైపు సాగుతాయి.దేవదారు, పైన్, ఓక్ అడవుల గూండా, వాగులు వంకలను దాటుకుంటూ ఈ ట్రెక్కింగులు సాగుతాయి.
క్రికెట్ స్టేడియం
మార్చుధర్మశాలలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం ఉంది. ఇద్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ జట్టుకు స్థావరం. ఐపిఎల్ లోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు స్వంత మైదానం కూడా. ప్రప్ంచం లోని అత్యంత ఎత్తైన క్రికెట్ స్టేడియాలలో ఇది ఒకటి.
చిత్ర మాలిక
మార్చు-
ధర్మశాల లోయ
మూలాలు
మార్చు- ↑ "Gazetteer of the Kangra District" (PDF). Calcutta Central Press. 1883–1884.
- ↑ https://hpvidhansabha.nic.in/Member/Details/491 [bare URL]
- ↑ "Home". edharamshala.in.
- ↑ "Demographics – MCD-Dashboard-Document Management System".
- ↑ Craig, Mary (1999). Tears of Blood : a Cry for Tibet. Washington, D.C.: Counterpoint. pp. 142. ISBN 9781582430256. OCLC 41431635.
- ↑ "Some of the Best Bird Watching Spots in India". Petzenia Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 4 December 2016. Archived from the original on 10 అక్టోబరు 2017. Retrieved 2017-10-10.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Station: Dharamshala Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 243–244. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 15 February 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M68. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 15 February 2020.
- ↑ "Our Story". Ddharmsala Tea Company. Retrieved 11 October 2018.
- ↑ Ali Khan, Murtaza (9 November 2018). "The warmth of human stories". The Hindu. Retrieved 17 May 2019.