ధర్మారావు (పాత్ర)

ధర్మారావు విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలలోని ప్రధాన పాత్ర. ధర్మారావు పాత్రను విశ్వనాథ సత్యనారాయణ నవలలోని ప్రతీకాత్మకమైన పాత్రలకూ, వాస్తవికమైన పాత్రలకూ నడుమ లంకెగా రాశారు. విశ్వనాథ సత్యనారాయణ స్వయంగా తన వ్యక్తిత్వాన్ని, భావాలని తీసుకుని తనకు ప్రతిరూపంగానే ధర్మారావు పాత్రను తీర్చిదిద్దినట్టు సాహిత్యలోకంలో ప్రతీతి. పాత్రను అభిమానించినవారూ, ఖండించినవారూ, వ్యతిరేకించినవారూ కూడా కొల్లలుగానే ఉండడంతో ధర్మారావు పాత్ర చుట్టూ విస్తృతమైన చర్చ జరిగింది.

ధర్మారావు
సృష్టికర్తవిశ్వనాథ సత్యనారాయణ
సమాచారం
లింగంమగ
వృత్తికొన్నాళ్ళు ఉపన్యాసకుడు, ట్యూటర్, మరికొన్నాళ్ళు నిరుద్యోగి
దాంపత్యభాగస్వామిఅరుంధతి
బంధువులురామేశ్వరశాస్త్రి (తండ్రి), గిరిక (చెల్లెలు)
మతంహిందువు
జాతీయతభారతీయుడు