ధార్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ధార్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, మాళ్వా ప్రాంతానికి చెందిన ధార్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. స్వాతంత్ర్యం పొందటానికి ముందు ఇది ధార్ సంస్థానానికి రాజధానిగా ఉండేది.

ధార్
పట్టణం
ధార్ is located in Madhya Pradesh
ధార్
ధార్
నిర్దేశాంకాలు: 22°35′53″N 75°18′14″E / 22.598°N 75.304°E / 22.598; 75.304Coordinates: 22°35′53″N 75°18′14″E / 22.598°N 75.304°E / 22.598; 75.304
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాధార్
సముద్రమట్టం నుండి ఎత్తు
559 మీ (1,834 అ.)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం93,917
భాషలు
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుMP-11
జాలస్థలిwww.dhar.nic.in

భౌగోళికంసవరించు

ధార్ పట్టణం 34 మైళ్లు (55 కి.మీ.) మోవోకు పశ్చిమాన 34 కి.మీ. దూరంలో, సముద్ర మట్టం నుండి 559 మీటర్ల ఎత్తున ఉంది.ఇది బంజరు కొండలతో, సరస్సులు చెట్ల మధ్య సుందరంగా ఉంటుంది. పట్టణంలో పాత ప్రాకారాలతో పాటు అనేక ఆసక్తికరమైన భవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సాంస్కృతిక, చారిత్రిక, జాతీయ ప్రాముఖ్యత కలిగినవి. [1]

ధార్ సంస్థానంసవరించు

1818 లో జరిగిన మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం తరువాత ధార్, బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. సెంట్రల్ ఇండియా ఏజెన్సీకి చెందిన భోపవార్ ఏజెన్సీలో భాగంగా ధార్ సంస్థానం బ్రిటిష్ ఇండియా ఏలుబడిలో ఉండేది. 4,600 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ రాజ్యంలో అనేక రాజపుత్ర, భిల్లు పాలకులు ఉన్నారు.1857 నాటి తిరుగుబాటులో ఈ సంస్థానాన్ని బ్రిటిషు వారు జప్తు చేశారు. కాని 1860 లో రాజా ఆనంద్ రావు III పవార్‌కు (అప్పట్లో మైనరు) బైరుసియా జిల్లా మినహా మిగతా భాగాన్ని అప్పగించారు. బైరుసియా జిల్లాను భోపాల్ బేగంకు మంజూరు చేసారు. 1877 లో మహారాజా కెసిఎస్ఐ అనే వ్యక్తిగత బిరుదును పొందిన ఆనంద్ రావు 1898 లో మరణించాడు; అతని తరువాత ఉడాజీ రావు II పవార్ అధికారానికి వచ్చాడు. [1]

జనాభాసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ధార్ జనాభా 93,917. వీరిలో 48,413 మంది పురుషులు, 45,504 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 11,947 మంది. అక్షరాస్యుల సంఖ్య 68,928, ఇది జనాభాలో 73.4%, పురుషుల అక్షరాస్యత 78.1% స్త్రీల అక్షరాస్యత 68.4%. ధార్ లో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 84.1%, ఇందులో పురుషుల అక్షరాస్యత 89.9%, స్త్రీల అక్షరాస్యత 78.0%. షెడ్యూల్డ్ కులాలు జనాభా 7,549, షెడ్యూల్డ్ తెగల జనాభా 16,636. 2011 నాటికి పట్టణంలో 18531 గృహాలున్నాయి. [2]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [3] ధార్ జనాభా 75,472. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. ధార్ అక్షరాస్యత 70%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీ అక్షరాస్యత 63%. ధార్ జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మతంసవరించు

ధార్‌లో మతం (2011)[4]
మతం శాతం
హిందూ మతం
  
79.62%
ఇస్లాం
  
17.39%
జైనమతం
  
2.05%
ఇతరాలు
  
0.94%
Distribution of religions

మూలాలుసవరించు

  1. 1.0 1.1   One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Dhar". Encyclopædia Britannica (in ఇంగ్లీష్). Vol. 8 (11th ed.). Cambridge University Press. p. 142.
  2. "Census of India: Dhar". www.censusindia.gov.in. Retrieved 25 November 2020.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  4. "C-1 Population By Religious Community". census.gov.in. Retrieved 25 November 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ధార్&oldid=3087375" నుండి వెలికితీశారు