ధీరశంకరాభరణం రాగము

(ధీరశంకరాభరణం నుండి దారిమార్పు చెందింది)

ధీరశంకరాభరణం రాగము కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త రాగము.[1] దీనిని శంకరాభరణం రాగము అని కూడా పిలుస్తారు. హిందుస్థానీ సంగీతంలో బిలావల్ రాగం, పాశ్చాత్య సంగీతంలో సి-మేజర్ దీనితో సమానమైనవి.

Shankarābharanam scale with shadjam at C

రాగ లక్షణాలు

మార్చు
  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G3 M1 P D2 N3 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D2 P M1 G3 R2 S)

ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము. ఇది 65 వ మేళకర్త రాగమైన మేచకళ్యాణి కి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.

ఉదాహరణలు

మార్చు
  • దశరధరామ గోవింద నన్ను- దయజూడు పాహి ముకుంద - రామదాసు కీర్తన.
  • ఇతడేనా ఈ లోకములో గల - రామదాసు కీర్తన.
  • తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు - రామదాసు కీర్తన.
  • రక్షింపు మిది యేమొ రాచకార్యము పుట్టె - రామదాసు కీర్తన.
  • ఎంతో మహానుభావుడవు నీవు - రామదాసు కీర్తన.
  • రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా - రామదాసు కీర్తన.
  • నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ - రామదాసు కీర్తన.

ధీరశంకరాభరణం జన్యరాగాలు

మార్చు

శంకరాభరణం రాగంలో చాలా జన్య రాగాలు వున్నాయి. వీటిలో కొన్ని ఆరభి, అఠాణా, కురింజి, కేదారం, నాగధ్వని, బిళహరి, దేవగాంధారి, హంసధ్వని, కదనకుతూహలం, శుద్ధ సావేరి.

బేగడ రాగము

మార్చు
ఉదాహరణలు
  • సకలేంద్రియము లార సమయముగాదు - రామదాసు కీర్తన.
  • ఏలాగు తాళుదు నేమి సేతురా రామా - రామదాసు కీర్తన.

ఆరభి రాగము

మార్చు
ఉదాహరణలు
  • నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ - రామదాసు కీర్తన.

బిళహరి రాగము

మార్చు
ఉదాహరణలు
  • s:భావయే పవమాన నందనం - రామదాసు కీర్తన.
  • ఎవరు దూషించిన నేమివచ్చె మరి - రామదాసు కీర్తన.
  • రక్షించే దొరవని నమ్మితి నిన్ను - రామదాసు కీర్తన.
  • రామయ్య భద్రాచలధామా శ్రీరామ - రామదాసు కీర్తన.

కేదార రాగము

మార్చు
ఉదాహరణలు
  • భజరే శ్రీరామం హే మానస - రామదాసు కీర్తన.

నవరోజు రాగము

మార్చు
ఉదాహరణలు

కురింజి రాగము

మార్చు
ఉదాహరణలు

మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్