క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికి అనేది ఒక ప్రసిద్ధిచెందిన కీర్తన.
దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన అన్నమాచార్యులు రచించారు. ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని పట్టపురాణైన అలమేలు మంగకు నీరాజనం అనగా హారతి ఇస్తూ కీర్తిస్తాడు.
ఈ కీర్తనను శంకరాభరణం జన్యమైన కురింజి రాగం, ఖండచాపు తాళంలో గానం చేస్తారు.[1]
కీర్తన
మార్చుక్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని - నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు - నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు - నిలువు మాణిక్యముల నీరాజనం
పగటు శ్రీ వేంకటేశుని పట్టపు రాణియై - నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేలు మంగ చక్కదనముల కెల్ల - నిగుడు నిజ శోభనపు నీరాజనం
చరణ కిసలయములకు సఖియంభోరులకు - నిరతము ముట్టెల నీరాజనం
అరిడి జఘనంబునకు అతివ నిజనాభికి - నిరతి ననవర్ణ నీరాజనం
భారతీయ సంస్కృతి
మార్చు- ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి ఈ కీర్తనను శుద్ధమైన కర్ణాటక సంగీతంలో గానం చేశారు.[2]
పూర్తి పాఠం
మార్చు- వికీసోర్స్లో క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని పూర్తి కీర్తన.
మూలాలు
మార్చు- ↑ "కర్ణాటిక్ సైట్ లో క్షీరాబ్ధి కన్యకకు కీర్తన సాహిత్యం". Archived from the original on 2011-09-22. Retrieved 2011-10-25.
- ↑ ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గానం చేసిన కీరాబ్ధి కన్యకకు కీర్తన.