ధీరశంకరాభరణం రాగము
ధీరశంకరాభరణం రాగము కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త రాగము.[1] దీనిని శంకరాభరణం రాగము అని కూడా పిలుస్తారు. హిందుస్థానీ సంగీతంలో బిలావల్ రాగం, పాశ్చాత్య సంగీతంలో సి-మేజర్ దీనితో సమానమైనవి.
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R2 G3 M1 P D2 N3 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N3 D2 P M1 G3 R2 S)
ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము. ఇది 65 వ మేళకర్త రాగమైన మేచకళ్యాణి కి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
ఉదాహరణలు
మార్చు- దశరధరామ గోవింద నన్ను- దయజూడు పాహి ముకుంద - రామదాసు కీర్తన.
- ఇతడేనా ఈ లోకములో గల - రామదాసు కీర్తన.
- తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు - రామదాసు కీర్తన.
- రక్షింపు మిది యేమొ రాచకార్యము పుట్టె - రామదాసు కీర్తన.
- ఎంతో మహానుభావుడవు నీవు - రామదాసు కీర్తన.
- రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా - రామదాసు కీర్తన.
- నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ - రామదాసు కీర్తన.
ధీరశంకరాభరణం జన్యరాగాలు
మార్చుశంకరాభరణం రాగంలో చాలా జన్య రాగాలు వున్నాయి. వీటిలో కొన్ని ఆరభి, అఠాణా, కురింజి, కేదారం, నాగధ్వని, బిళహరి, దేవగాంధారి, హంసధ్వని, కదనకుతూహలం, శుద్ధ సావేరి.
బేగడ రాగము
మార్చు- ఉదాహరణలు
- సకలేంద్రియము లార సమయముగాదు - రామదాసు కీర్తన.
- ఏలాగు తాళుదు నేమి సేతురా రామా - రామదాసు కీర్తన.
ఆరభి రాగము
మార్చు- ఉదాహరణలు
- నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ - రామదాసు కీర్తన.
బిళహరి రాగము
మార్చు- ఉదాహరణలు
- s:భావయే పవమాన నందనం - రామదాసు కీర్తన.
- ఎవరు దూషించిన నేమివచ్చె మరి - రామదాసు కీర్తన.
- రక్షించే దొరవని నమ్మితి నిన్ను - రామదాసు కీర్తన.
- రామయ్య భద్రాచలధామా శ్రీరామ - రామదాసు కీర్తన.
కేదార రాగము
మార్చు- ఉదాహరణలు
- భజరే శ్రీరామం హే మానస - రామదాసు కీర్తన.
నవరోజు రాగము
మార్చు- ఉదాహరణలు
- జో అచ్యుతానంద - త్యాగరాజు కీర్తన.
- భజరే మానస రామం - రామదాసు కీర్తన.
కురింజి రాగము
మార్చు- ఉదాహరణలు
- క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని _ అన్నమాచార్య కీర్తన
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్