నంగేలి
19వ శతాబ్దంలో కేరళ ట్రావెన్కోర్ పాలించిన రాజులు స్త్రీల రొమ్ములపై పన్ను (ముళకరం అని పిలిచేవారట) విధించేవారు. ఈ పన్నులను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులుపడాల్సి వచ్చేది. కానీ భారతదేశంలోని ఏ చారిత్రక పుస్తకాల్లో ఈ పన్ను గురించి అధికారికంగా గుర్తించబడలేదు.[1]
నేపథ్యం
మార్చుట్రావెన్కోర్ రాజ్యంలో గడ్డాలు, మీసాలపై, వక్షోజాలపై పన్ను విధించేవారు. మహిళలు, పురుషులు ఆభరణాలు ధరించినా పన్ను వసూలు చేసేవారు.[2]
చరిత్ర
మార్చుట్రావెన్కోర్ రాజ్యం లోని చేరితాలా గ్రామంలో నంగేలి దంపతులు ఉండేవారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం వీరిది. ట్రావెన్కోర్ రాజ్యంలో అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి. గిరిజన, బడుగు, బలహీన వర్గాల మహిళలు వక్షోజాలపై వస్త్రాల్ని ధరించకూడదు. అగ్రకులాలకు చెందిన స్త్రీలు లోన రవికె వేసుకుని, పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది.
ఒకవేళ దిగువ వర్గానికి చెందిన మహిళలు వక్షోజాలు కనపడకుండా వస్త్రాలు ధరించాలంటే కచ్చితంగా రాజు అనుమతి తీసుకోవాలి. అయితే పన్ను కట్టనిదే రాజు అనుమతి ఇవ్వడు. రొమ్ముల పరిమాణాన్ని బట్టి ఈ పన్ను విధించేవారు. ఈ నిబంధనలు నంగేలికి నచ్చలేదు. ట్రావెన్ కోర్ రాజు ఆజ్ఞను నంగేలి ధిక్కరించింది.
నంగేలి వక్షోజ పన్ను వసూలు చేయడానికి ఆమె ఇంటివద్దకు వెళ్లిన ప్రవతియార్, రాజు ఆదేశాల మేరకు పన్ను కట్టాల్సిందిగా ఆమెకి చెప్పాడు. ఈ వ్యవహారంపై కోపంతో రగిలిపోతున్న నంగేలి తన రెండు వక్షోజాలను కొడవలితో కోసుకొని అరటి ఆకులో అతనికి సమర్పించింది. ఆమె చేసిన పనికి అధికారులు వణికి అక్కడ నుండి పారిపోయారు. ఆమె రక్తపు మడుగుల్లో అక్కడే చనిపోయింది.[3]ఆమె భర్త ఇది జీర్ణించుకోలేక ఆమె చితిమంటలపై పడి తానూ మరణించాడు. దీంతో ట్రావెన్ కోర్ రాజ్యంలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి.[4][5][6]
సి.బి.ఎస్.ఇ వివాదం
మార్చుతొమ్మిదో తరగతి సోషియాలజీ పాఠ్యపుస్తకంలోని కులం, సంఘర్షణ, దుస్తుల మార్పు అనే వచనాన్ని సిబిఎస్ఇ తొలగించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అనుసరించి సి.బి.ఎస్.ఇ లో ఈ అభ్యంతరకరమైన పాఠన్ని తొలగించాలని సిఫారసు చేసింది.[7]
మీడియా
మార్చుమహిళల శరీర భాగాలపై వేసిన పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నంగేలి ప్రతిఘటన ఆధారంగా రూపొందించిన పులి(Puli: The 19th Century) చిత్రం 2023 ఏప్రిల్ 15న విడుదలయింది.[8]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "The woman who cut off her breasts to protest a tax" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2016-07-28. Retrieved 2020-01-19.
- ↑ W. Crooke. "Nudity in India in Custom and Ritual", Journal of the Royal Anthropological Institute. 1919. p. 239f
- ↑ "The woman who cut off her breasts to protest a tax" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2016-07-28. Retrieved 2020-01-19.
- ↑ "The woman who cut off her breasts to protest a tax". BBC News. 28 July 2016.
- ↑ S. Pillai, Manu (2019). "The woman with no breasts". The Courtesan, the Mahatma and the Italian Brahmin: Tales from Indian History. Chennai: Westland Publications Private Limited. ISBN 9789388689786.
- ↑ Allen, Charles (2017). Coromandel : A personal history of South India. London: Little, Brown. p. 285. ISBN 9781408705391. OCLC 1012741451.
- ↑ "దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ". virasam.org. Retrieved 2020-01-19.[permanent dead link]
- ↑ "రొమ్ములపై పన్నులను వ్యతిరేకించిన 'పులి' చిత్ర ప్రదర్శన | Prajasakti". web.archive.org. 2023-05-08. Archived from the original on 2023-05-08. Retrieved 2023-05-08.
{{cite web}}
: no-break space character in|title=
at position 55 (help)CS1 maint: bot: original URL status unknown (link)