నందిని భక్తవత్సల

కన్నడ సినిమా నటి.

నందిని భక్తవత్సల, కన్నడ సినిమా నటి.[1] 1973లో వచ్చిన కాడు సినిమాలోని నటనకు ఉత్తమ నటిగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. సినీ నిర్మాత భక్తవత్సలతో నందిని వివాహం జరిగింది.

జీవిత విషయాలు మార్చు

నందిని మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెల్లిచేరిలో జన్మించింది. ఈమె అసలు పేరు ప్రేమ. నందిని చిన్నతనంలోనే తన కుటుంబం మైసూర్‌కు వెళ్ళింది. అక్కడి మహారాజా కాలేజీలో నందిని తండ్రి ఓ.కె. నంబియార్ ప్రొఫెసర్ గా ఇంగ్లీష్, హిస్టరీ బోధించేవాడు. ఆ తరువాత, ప్రొఫెసర్ నంబియార్ సెంట్రల్ కాలేజీకి బదిలీ అయినప్పుడు నందిని కుటుంబం బెంగుళూరుకు వెళ్ళింది. మైసూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల, మహారాణి కళాశాలల నుండి పట్టభద్రురాలైంది.[2] కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, కన్నడ చిత్ర పరిశ్రమ టైటాన్ అయిన మూల భక్తవత్సలను వివాహం చేసుకుంది.[1] గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రలో నటించిన కాడు సినిమాలోని నందిని పాత్రకు ఉత్తమ నటిగా ఆ సంవత్సరం జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది.[2] ఈమెకు ఆనంద రంగ, వేద్ మను, దేవ్ సిరి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. బెంగళూరులోని ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసింది.[3]

సినిమాలు మార్చు

  1. 1996: ప్రేమ్‌గ్రాంత్
  2. 1995: పాండవ్
  3. 1994: హాన్స్టే ఖెల్టే
  4. 1993: ఫ్లాట్ ఫామ్
  5. 1990: మా ఓ మా
  6. 1985: రామ్ తేరి గంగా మెయిలీ
  7. 1978: సత్యం శివం సుందరం: లవ్ సబ్‌లైమ్
  8. 1973: కాడు
  9. 1971: హల్చుల్
  10. 1969: తలాష్
  11. 1969: విశ్వస్
  12. 1968: సాతి
  13. 1968: నీల్ కమల్
  14. 1967: గుణేగర్
  15. 1965: పూనమ్ కి రాత్
  16. 1959: ధూల్ కా ఫూల్
  17. 1958: సాధన
  18. 1951: నౌజావన్
  19. 1950: దీవ దండి

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Film World. T.M. Ramachandran. 1973. p. 205.
  2. 2.0 2.1 "21st National Award for Films". Directorate of Film Festivals. Archived from the original on 1 November 2013. Retrieved 28 July 2021.
  3. "Music Society/Rani Vijaya Devi/Committee & Patrons". International Music & Arts Society. Retrieved 28 July 2021.

బాహ్య లింకులు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Nandini పేజీ