నందిపల్లి (వేంపల్లె మండలం)
నందిపల్లి అనేది ఒక గ్రామపంచాయతీ. ఇది కడప జిల్లాలోని వేంపల్లి మండలంలో ఉంది. ఊర్లో దాదాపుగా 1100 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. నంది పల్లె గ్రామం 2020 వరకు కత్తలూరు గ్రామపంచాయతీలో పెద్ద గ్రామంగా ఉండేది. గ్రామం 2020 సంవత్సరం నుండి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడినది. గ్రామ ప్రజల ముఖ్య ఆదాయం వ్యవసాయం ద్వారా వస్తున్నది. ఈ గ్రామ రెవెన్యూ విలేజ్ కత్తులూరు. నందిపల్లెకు సంబంధించిన ప్రభుత్వ బాధ్యతలు కత్తులూరు గ్రామ సచివాలయం నుండి నిర్వహింపబడతాయి. దగ్గరలోని పుణ్యక్షేత్రాలు వృషభ ఆచల దేవస్థానం, గండి ఆంజనేయ స్వామి దేవస్థానాలు. గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు అయినటువంటి నీటి వసతి, పాఠశాల, పశువుల ఆసుపత్రి, వీధి దీపాలు,సిమెంటు రోడ్లు, నిర్మించబడ్డాయి.
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |