నక్కల
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
బి.సి.ఏ.గ్రూపు కులస్తులు.మెళ్ళో పూసలు...చంకలో చేతి సంచి...విచిత్రంగా కట్టుకునే లుంగీ, ముడివేసుకున్న జుట్టు...ముసలివాళ్లయినా కట్టుకునే లంగావోణిలు.. నగ్నంగా పసిపిల్లలు... నోటినిండా వక్కాకు...నుదుటి మీద, వంటి నిండా పచ్చబొట్లు.పట్టణం నడిబొడ్డునే మన కళ్ళముందే తిరుగుతుంటారు. ఆధునిక కాలంలో అనాగరికతకు ఆనవాళ్ళు నక్కలోళ్లు.జనసంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఠీవిగా ఫుట్‌పాత్‌పై కాలుపై కాలేసుకొని పడుకొని రేడియోలో పాటలు వింటూప్రతి నగరంలో వారు కనిపిస్తారు. ఫుట్‌పాత్‌లు, రోడ్డు పక్క మార్జిన్లే వారికి ఇళ్ళు, ఎస్టీ లక్షణాలున్న కులం.వీరిని నక్కలోళ్ళు, పూసలోళ్ళు అని పిలుస్తుంటారు. మంచి రద్దీ సెంటర్లలో రోడ్ల పక్కనే గుంపులు గుంపులుగా నివసిస్తారు. వీరిలో ఆడవాళ్ళు ఫుట్‌పాత్‌ల మీద అద్దాలు, దువ్వెన్లు, పిన్నులు, రిబ్బన్లు వంటి ఫ్యాన్సీ వస్తువులను అమ్ముతుంటారు. మగవారు గుంపులుగా పక్కనే ఉండే గ్రామ ప్రాంతాలకు, కాలువలు, నదులు ఉండే ప్రాంతాలకు వెళ్ళి పక్షులను వేటాడతారు. వేటాడిన వాటిలో కొంగలను, కముజుపిట్టలను పట్టణాల్లో విక్రయిస్తారు. నక్కలను వేటాడటం వీరి సాంప్రదాయవృత్తి. వీరిలో మహిళే ఇంటి పెద్ద. కుటుంబ పోషణంతా మహిళలే చూస్తారు. పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళ వంటివన్నీ మహిళలే నిర్ణయిస్తారు. గుంపుకు ఒక నాయకుడు ఉంటాడు. నాయకుడి మాటకు తిరుగుండదు. కాకపోతే ఎవరైనా ఇద్దరు గొడవ పడితే ఓ ఏడాది పాటు వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు. వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఏడాది పాటు తమ తెగ నుండి వెలి వేస్తారు.మాంసాహారం మాత్రం తప్పనిసరి. నెలరోజుకొకసారైనా స్నానం చేయరు. జట్టు కత్తిరించడం మహాపాపంగా భావిస్తారు.