నటాషా దోషి
నటాషా దోషి (జననం 1993 ఆగస్టు 2) ఒక భారతీయ నటి, మోడల్. మలయాళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. 2012లో అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన మాంత్రికన్‌తో ఆమె చిత్రసీమలో రంగప్రవేశం చేసింది.
నటాషా దోషి | |
---|---|
జననం | |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి, మోడల్, డెంటిస్ట్[1] |
క్రియాశీల సంవత్సరాలు | 2012 – ప్రస్తుతం |
జీవితం తొలి దశలో
మార్చుముంబాయిలో జన్మించిన నటాషా దోషి బాల్యంలోనే నటించడం ప్రారంభించింది.[2] శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణి కూడా. మిస్ కేరళ 2010లో ఆమె మిస్ టాలెంటెడ్ అవార్డును అందుకుంది.[3]
కెరీర్
మార్చునటాషా దోషి మొదటి సినిమా 2012లో వచ్చిన మాంత్రికన్ అనే డాక్యుమెంటరీ హారర్-కామెడీ మలయాళ చిత్రం. అదే సంవత్సరంలో ఆమె దక్షిణ కొరియా రొమాంటిక్ డ్రామా చిత్రం 3-ఐరన్( 3-Iron) ఆధారంగా మలయాళ చిత్రం హైడ్ ఎన్ సీక్(Hide n' Seek)లో గౌరీగా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత ఆమె ఫ్రాన్సిస్ తన్నికల్ దర్శకత్వం వహించిన కాల్ మీ @(Call me @),[4] నౌషాద్ దర్శకత్వం వహించిన కాపుచినో అనే మలయాళ రొమాంటిక్ కామెడీలో జానకి ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.[5] 2018లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం జై సింహా[6]తో తెలుగులో నటాషా దోషి అరంగేంట్రం చేయడమేకాక నటిగా మరింత గుర్తింపు పొందింది, ఇందులో ఆమె నయనతార, నందమూరి బాలకృష్ణలతో కలిసి నటించింది.[7][8]
ఫిల్మోగ్రఫీ
మార్చు2012 | మాంత్రికన్ | దియా | మలయాళం | మొదటి మలయాళ చిత్రం |
2012 | హైడ్ ఎన్ సీక్ | గౌరీ | మలయాళం | |
2014 | కాల్ మీ @ | ప్రియంవద | మలయాళం | |
2017 | కాపుచినో | జానకి | మలయాళం | |
2018 | జై సింహా | ధన్య | తెలుగు | మొదటి తెలుగు చిత్రం |
2018 | కోతల రాయుడు | ధనలక్ష్మి | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ "Coming back stronger". deccanchronicle.com. 6 August 2017. Retrieved 16 October 2017.
- ↑ "N Balakrishna's next venture to include bhojpuri actress Natasha Doshi - India Live Today Movies". indialivetoday.com. 5 September 2017. Archived from the original on 17 అక్టోబరు 2017. Retrieved 16 October 2017.
- ↑ Staff Reporter (6 August 2010). "Thampy sweeps awards at Miss Kerala contest". Retrieved 16 October 2017 – via www.thehindu.com.
- ↑ "Natasha's on a signing spree - Times of India". indiatimes.com. Retrieved 16 October 2017.
- ↑ "Balakrishna's heroine in 'Jai Simha' is killing it on Instagram". Timesofindia.com. 11 January 2019. Retrieved 11 January 2019.
- ↑ "Natasha Doshi in Balakrishna's next". deccanchronicle.com. 5 September 2017. Retrieved 16 October 2017.
- ↑ IANS (29 August 2017). "Thrilled to be part of Balakrishna's project: Natasha Doshi". Retrieved 16 October 2017 – via Business Standard.
- ↑ CinemaThagaval (19 September 2017). "SURPRISING!!! Natasha Doshi is Nayanthara's Daughter - Cinema Thagaval". cinemathagaval.com. Archived from the original on 17 అక్టోబరు 2017. Retrieved 16 October 2017.