నత్రజని వలయం అంటే నత్రజని వాతావరణం, భూభాగం, సముద్ర ఆవరణాల మధ్య వలయంలాగా సంచరిస్తున్నపుడు లోనయ్యే వివిధ రసాయనిక మార్పుల సమ్మేళనం. ఈ మార్పులు భౌతిక, జీవ సంబంధమైన చర్యల ద్వారా జరుగుతాయి. ఈ వలయంలో ముఖ్యమైన చర్యలు నైట్రోజెన్ ఫిక్సేషన్ (నత్రజని అనుబంధన), అమ్మోనిఫికేషన్ (క్షారనీకరణము), నైట్రిఫికేషన్ (నత్రీకరణ), డీనైట్రిఫికేషన్ (వినత్రీకరణ). భూవాతావరణంలో సుమారు 78 శాతం నత్రజనే ఉంటుంది. [1] నత్రజని అత్యధికంగా లభ్యమయ్యేది ఇక్కడే.

వాతావరణ శాస్త్రవేత్తలకు (Ecologist) నత్రజని వలయం మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే నత్రజని అందుబాటులో ఉండేదాన్ని బట్టి వాతావరణంలోని కొన్ని కీలకమైన చర్యలైన ప్రాథమిక ఉత్పత్తి, శిథిలమవడం లాంటివి ఆధారపడి ఉంటాయి. మానవుడు శిలాజ ఇంధనాలను విరివిగా వాడటం వలన, కృత్రిమ నత్రజని ఎరువులు వాడటం వలన, మురికినీటిలోకి నత్రజని కలపడం వలన ప్రపంచ వ్యాప్తంగా నత్రజని వలయం ప్రభావితమౌతోంది. ఈ విధంగా మానవుని చర్యల వల్ల నత్రజని వలయం మార్పు చెందడం మూలాన ప్రకృతికి, మానవుని ఆరోగ్యానికి అనేక దుష్పరిణామాలు కలుగుతున్నాయి.

విధానంసవరించు

వాతావరణంలో నత్రజని వివిధ రకాలైన రసాయనిక రూపాల్లో ఉంటుంది. ఇవి సేంద్రియ నత్రజని, అమ్మోనియం (NH+
4
), నైట్రైట్ (NO
2
), నైట్రేట్ (NO
3
), నైట్రస్ ఆక్సైడ్ (N2O), నైట్రిక్ ఆక్సైడ్ (NO) లేదా సేంద్రియేతర నత్రజని వాయువు (N2). సేంద్రియ నత్రజని ప్రాణమున్న జీవుల్లోను, ఎరువుల్లోను, శిథిలమైన లేదా విచ్చిన్నమైన జీవ పదార్థాల్లోనూ ఉంటుంది. నత్రజని వలయంలోని చర్యలు ఒక రూపంలోని నత్రజని వేరొక రూపంలోకి మారుస్తుంటాయి.

నైట్రోజెన్ ఫిక్సేషన్సవరించు

నత్రజని వాయువు వాతావరణ, పారిశ్రామిక, జీవ సంబంధ చర్యల ద్వారా నైట్రేట్లు, నైట్రైట్లుగా మారడాన్ని నైట్రోజెన్ ఫిక్సేషన్ అంటారు. వాతావరణంలో ఉన్న నత్రజని మొక్కలకు ఉపయోగపడాలంటే ముందుగా అందుకు అనువైన రూపంలోకి మారాలి. అదే ఈ ఫిక్సేషన్ ప్రక్రియ. ప్రతి యేటా సుమారు 5 నుంచి 10 కోట్ల కిలోల నత్రజని మెరుపుల మూలంగా ఈ విధంగా మార్చబడుతోంది.

మూలాలుసవరించు

  1. Steven B. Carroll; Steven D. Salt (2004). Ecology for gardeners. Timber Press. p. 93. ISBN 978-0-88192-611-8.