నపుంసకత్వం పురుషులలో అంగస్తంభన లోపము వలన కలిగే వ్యాధి. ఇది పలు కారణాల వలన కలుగవచ్చు.

నపుంసకత్వం
పురుషాంగం యొక్క క్రాస్ సెక్షన్
ప్రత్యేకతUrology
లక్షణాలుInability to gain or maintain an erection
ప్రమాద కారకములుcardiovascular disease, diabetes

చరిత్ర

మార్చు

ఈ రుగ్మతను వ్యాధిగా గుర్తించి చికిత్స కోసము ప్రయత్నించడము ఇస్లామీయ వైద్యులు[ఆధారం చూపాలి] కాలములో మొదటగా జరిగింది. వీరు ఈ వ్యాధినివారణ కొరకు మూలికా వైద్యము చేసేవారు. ఆధునిక యుగములో 1920 లో డాక్టర్ జాన్.ఆర్.బ్రింక్లే సరికొత్త పరీక్షా విధానమును, చికిత్సా పద్ధతిని కనుగొన్నారు.

ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో 'క్షీణిస్తున్న నపుంసకత్వం' ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఒంటరి మగవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఇందుకు చాలా వరకూ నపుంసకత్వమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. మన దేశంలో అయితే సుమారు 22 శాతం పెళ్ళిళ్లు ఈ కారణంగానే విడాకులకు దారి తీస్తున్నాయి. పైగా విడాకులు తీసుకోవడమనేది 25 నుంచి 30 ఏళ్ల లోపు వయసువారిలో ఎక్కువగా చోటు చేసుకుంటోంది. పుణే విశ్వవిద్యాయానికి చెందిన సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, ఈ విడాకుల సంఖ్య 2011 కంటే 2012 నాటికి ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. ఇక విడాకులకు మిగిలిన అన్ని కారణాల కంటే నపుంసకత్వమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. దేశంలో 20 నుంచి 30 శాతం విడాకులకు నపుంసకత్వమే కారణమని, లైంగిక జీవితం విఫలం కావడం వల్లే వైవాహిక జీవితం దెబ్బ తింటోందని కూడా అది తెలిపింది.

వ్యాధి లక్షణాలు

మార్చు
  • యుక్తవయసులో ఎలాంటి అనారోగ్య లక్షణములు లేకుండా రతి కార్యములో విఫలమవడము.
  • అంగము పూర్తిగా స్తంభించకపోవడము లేదా పాక్షికముగా స్తంభించడము.

వ్యాధి కారణాలు

మార్చు

సాధారణంగా ఆరోగ్యవంతమైన భార్యాభర్తలు ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తరువాత ఏడాదికి సగటున 58 సార్లు లైంగిక జీవితాన్ని అనుభవించగలుగుతారని, అంటే వారానికి ఒకటి రెండుసార్లు ఆనందంగా గడపగలుగుతారని, అయితే ఈ సంఖ్య క్రమంగా 25కు తగ్గిపోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఒకే చోట కూర్చుని పని చేయడం, మానసిక ఒత్తిడికి గురవుతుండడం, క్షణం కూడా తీరిక లేకుండా పని చేయడం, తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, మద్యం తీసుకోవడం, సిగరెట్లు తాగడం, బరువు పెరగడం, మధుమేహంతో అవస్థ పడడం వంటివి వైవాహిక జీవితాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. "నలభయ్యేళ్లు దాటే సరికి 48 శాతం మంది మధుమేహానికి గురవుతున్నారు. 45 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యల కారణంగా పురుషుల్లో లైంగిక జీవితం పట్ల ఆసక్తి సన్నగిలుతోంది. ఈ సమస్య గత అయిదేళ్లలో 15 శాతం పెరిగింది అని ఆ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలకు వాడే మందులు లైంగిక జీవితాన్ని కుంటుపరుస్తున్నాయి. లైంగిక సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా కొన్ని వ్యసనాలకు స్వస్తి చెప్పి, ఆసనాలు, వ్యాయామం, యోగా వంటివి సాధన చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, దాదాపు 90 శాతం మంది పురుషులు తమ వైవాహిక జీవితం కుప్పకూలే దాకా మేల్కోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. తమకు లైంగిక సమస్యలున్నట్టు చెప్పుకోవడానికి ఎక్కువ శాతం మంది పురుషులు సిగ్గుపడుతుంటారని వారు తెలిపారు. చికిత్స చేయించుకోవడం ఆలస్యం అయిన కొద్దీ సమస్య ముదిరిపోతూనే ఉంటుంది. ఇటువంటి సున్నితమైన సమస్యల విషయంలో పురుషులు దాపరికంతో వ్యవహరించక, వెంటనే డాక్టర్లను సంప్రదించి, ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవాలని కూడా వారు సలహా ఇస్తున్నారు.

పురుషుల్లో లైంగిక సంబంధమైన సమస్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసిన 'ఆల్ఫా' అనే ఆండ్రాలజీ నిపుణుల బృందం కూడా 2500 మంది పురుషుల (విడాకులు తీసుకున్నవారు) కేసుల్ని పరిశీలించి, భారతదేశంలో నపుంసకత్వం ఓ మహమ్మారిలా విజృంభిస్తోందని హెచ్చరించింది. నలభయ్యేళ్లు పైబడినవారిలో సగానికి సగం మంది, 40 ఏళ్ల లోపువారిలో కూడా పది శాతానికంటే ఎక్కువ మంది నపుంసకత్వంతో అవస్థలు పడుతున్నారని అది తెలిపింది. పురుషులలోనే కాక, మహిళల్లో సైతం 'లైంగిక జడత్వం' పెరుగుతోందని కూడా తెలిపింది. "ఎక్కువ మంది పురుషులు లైంగికంగా సంతృప్తి పరచలేని స్థితిలో ఉన్నారు. వారిలో లైంగిక జీవితం పట్ల వైముఖ్యత పెరుగుతోంది. ప్రతి అయిదు మందిలో ఒకరు విడాకులకు సిద్ధపడుతున్నారు. పది శాతం మంది వైవాహిక జీవితాలు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఈ సమస్య విషయంలో పురుషులు ఎంత త్వరగా జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది అని ఆండ్రాలజిస్ట్‌ల అభిప్రాయం. వృత్తి ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగానూ, ఆహార విహారాల్లో వస్తున్న మార్పుల వల్లనూ పురుషుల్లో లైంగిక పటుత్వం సాపేక్షికంగా తగ్గిపోతోందని వారు వివరించారు.భారతదేశంలో పురుషుల్లో నపుంసకత్వ సమస్య రాను రానూ పెరుగుతున్నప్పటికీ, వైద్యపరంగా దీన్ని చక్కదిద్దడానికి అవసరమైనంత పరిశోధన జరగడం లేదనీ ఆండ్రాలజిస్ట్‌ల వాదన. "దీనివల్ల వైవాహిక జీవితాలు, కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. వైవాహిక జీవితం పటిష్ఠంగా, ఆరోగ్యకరంగా కొనసాగాలన్న పక్షంలో సమయం, ప్రయత్నం, రాజీ ధోరణి వంటివి అవసరం. భార్యాభర్తలిద్దరూ దీన్ని అర్థం చేసుకోవాలి. సమస్యలు ఎదురైనప్పుడు మాట్లాడుకోవడం తెలియక, ఆచరణాత్మకంగా వ్యవహరించడం చేతకాక, లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడం ఎలా అన్నది అర్థం కాక విడాకుల కోసం పరిగెడుతున్నారు అని ఆండ్రాలజిస్ట్‌ల అభిప్రాయం.

నిర్ధారణ పరీక్షలు

మార్చు

ఈ క్రింది పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

  • డూప్లెక్స్ అల్ట్రాసౌండ్
  • పెనైల్ నెర్వస్ ఫంక్షన్స్
  • నొక్టర్నల్ పెనైల్ టుమెసిన్ (ఎన్.పి.టి)
  • పెనైల్ బయోథీసియోమెట్రి
  • పెనైల్ ఆంజియోగ్రామ్
  • డైనమిక్ ఇన్ఫ్యుజన్ కావెర్నొసొమెట్రి
  • కొర్పస్ కావెర్నొసొమెట్రి
  • డిజిటల్ సబ్ట్రాక్టర్ ఆంజియోగ్రఫి
  • మాగ్నటిక్ రెజొనెన్స్ ఆంజియోగ్రఫి (ఎం.ఆర్.ఎ)

చికిత్స

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

నపుంసకుడు

అంగస్తంభన వైఫల్యం