అంగస్తంభన (Penile erection) అనగా పురుషాంగం పరిమాణంలో పెద్దదిగా, గట్టిగా తయారౌతుంది. శరీర ధర్మశాస్త్రం ప్రకారం ఈ క్లిష్టమైన ప్రక్రియలో మానసిక, నాడీ మండలం, రక్తనాళాలు, వినాళగ్రంధులు విశేషమైన పాత్ర పోషిస్తాయి. ఎక్కువమందిలో ఇది శృంగార భావాల మూలంగా జరుగుతుంది అయితే మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు కూడా అంగం స్తంభించవచ్చును. కొంతమందికి నిద్రలో కూడా అంగస్తంభన జరుగుతుంది. అంగస్తంభన రతి ప్రక్రియలో యోనిలో వీర్యం స్కలించడానికి చాలా అవసరం. పురుషాంగమే కాకుండా స్త్రీలలో వక్షోజాల చూచుకము, క్లైటోరిస్లు కూడా స్తంభిస్తాయి.

అంగస్తంభనలో వివిధ దశలు
స్తంభించక ముందు స్తంభించిన తర్వాత పురుషాంగం.

శరీర ధర్మశాస్త్రం

పురుషాంగంలోని రెండు స్తంభాకార నిర్మాణాలైన కార్పొరా కెవర్నోసా, స్పాంజియోసాలు రక్తంతో నిండుట వలన అంగస్తంభన జరుగుతుంది. వీని మధ్యనుండే మూత్రం, వీర్యం ప్రయాణించే ప్రసేకం పోతుంది. అంగంతో పాటు వృషణాలను చుట్టియుండే చర్మ కండరాలు కూడా బిగుసుకుంటాయి. చాలామందిలో పుర్వచర్మం వెనుకకు పోయి ఎర్రని గ్లాన్స్ బయటకు కనిపిస్తుంది. స్కలనం జరిగిన తర్వాత అంగం కుంచించుకొని పోతుంది.[1]

మూలాలు

  1. Harris, Robie H. (et al.), It's Perfectly Normal: Changing Bodies, Growing Up, Sex And Sexual Health. Boston, 1994. (ISBN 1-56402-199-8)
"https://te.wikipedia.org/w/index.php?title=అంగస్తంభన&oldid=2877402" నుండి వెలికితీశారు