నమస్కారం

భారతీయ సంస్కృతికి మూలం
(నమస్తే నుండి దారిమార్పు చెందింది)

నమస్తే, నమస్కారం లేదా నమస్కార్ (సంస్కృతం: नमस्ते) ఈ పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " నమః " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన, బౌద్ధ మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది.గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.

దక్షిణాసియాలో ఒక సాధారణ సాంప్రదాయ ప్రక్రియ. ఓ యువకుడు రెండు చేతులను ఒత్తి నమస్కారం చేస్తున్న భంగిమ.[1]

రకాలు

మార్చు

నమస్కారం చేయడాన్ని శాస్త్రాలలో నాల్గు విధాలగా చెప్పబడింది.[2] అవి

  1. సాష్టాంగ నమస్కారం
  2. దండ ప్రణామం
  3. పంచాంగ నమస్కారం
  4. అంజలి నమస్కారం.

సాష్టాంగ నమస్కారం

మార్చు

మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.

దండ ప్రణామం

మార్చు

నేలమీద పడిన దండము (కర్రలాగా) శరీరాన్ని భూమిపైవాల్చి పరుండి కాళ్లు చేతులను చాపి అంజలి చేయుట దండ ప్రణామం.

పంచాంగ నమస్కారం

మార్చు

రెండు పాదాల వేళ్లు, రెండు మోకాళ్లు, తల భూమిపైనుంచి రెండు చేతులను తలవద్దచేర్చి అంజలి చేయుట పంచాంగ నమస్కారం. ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తారు.

అంజలి నమస్కారం

మార్చు

ఇది సర్వసాధారణమైన రెండుచేతులను కలిపి నమస్కారం అనటం.

ప్రవరతో నమస్కారం

మార్చు

ప్రధాన వ్యాసం : అభివాదం
భారతదేశ వ్యాప్తంగా హిందూమత సంబంధమైన విధులు నిర్వర్తించేప్పుడు, మతాచార్యుల ఎదుట, భగవంతుని ముందు ప్రవర చెప్పి నమస్కరిస్తూంటారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతి. <గోత్రనామం> గోత్రస్య <వంశానికి చెందిన ముగ్గురు ఋషుల పేర్లు> త్రయార్షయ ప్రవరాన్వితః <గృహ్యసూత్రం పేరు> సూత్రః <అభ్యసించే వేదం> శాఖాధ్యాయీ <నమస్కరిస్తున్న వారి పేరు> అహంభో అభివాదయే అంటూ నమస్కరించడం వైదిక విధానం. చేతి వేళ్లను చేవుల వెనుకకు చేర్చి ముందుకు కాస్త వంగిన భంగిమలో పై సంస్కృత వాక్యాన్ని ఉచ్చరిస్తారు. మనుష్యులకు నమస్కరించేప్పుడు కుడిచేయిని ఎడమచెవికి, ఎడమచేయిని కుడిచెవికి చేర్చి ప్రవర చెప్పాలి. దేవతలకు నమస్కరించాల్సివస్తే ఎడమచేతిని ఎడమచెవికి, కుడిచేతిని కుడిచెవి వెనక్కి చేర్చి ప్రవర చెప్తారు.

నమస్కార ముద్రల ప్రదర్శన

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. B Bhasin, Doing Business in the ASEAN Countries, ISBN 978-1-60649-108-9, pp 32
  2. "నమస్కారాలు-రకాలు - ఇరంగంటి రంగాచార్య (ఆంధ్రభూమి) సెప్టెంబర్, 3, 2011, పరిశీలించిన తేది:11 జనవరి 2014". Archived from the original on 2015-09-27. Retrieved 2014-01-11.
"https://te.wikipedia.org/w/index.php?title=నమస్కారం&oldid=3090264" నుండి వెలికితీశారు