నరసింహ అవతారము దాల్చి హిరణ్యకశ్యపుడిని సంహరించిన శ్రీహరి అవతారములోని నర రూపము నరుడిగా, సింహ రూపము నారాయణునిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. వీరిరువురు బదరికాశ్రమములో తపస్సు చేసుకొనెడివారు. ఇంద్రుడు వారి తపస్సు భంగం చేయుట కొరకు అప్సరసలను పంపుతారు. నారాయణుడు తన తొడ గీటి అప్సరసల కంటే సుందరమైన కాంత ఊర్వశి ని సృష్టిస్తాడు. తొడ (ఊరువు) నుండి పుట్టినది కావున ఊర్వశి అని పేరు కలిగింది. నరనారాయణులు సహస్ర కవచుని 999 కవచాలు ఛేధిస్తారు. ఆ సమయములో వారు తపస్సు మార్చి మార్చి చేశారు. ఒకరు యుద్ధము చేయి సమయమున మరొకరు తపస్సు చేయిట, మరొకరు తపస్సు చేయి సమయమున ఇంకొకరు యుద్ధము చేయిట జేసి 999 కవచములు ఛేధిస్తారు.

నరనారాయణులు
విష్ణుమూర్తి అవతారమైన కవలలు నరనారాయణులు.