నరేంద్రస్వామి దేవాలయం పెదపులివర్రు

నరేంద్రస్వామి దేవాలయం బాపట్ల జిల్లా పెదపులివర్రు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.గుంటూరు జిల్లాలో గల అత్యంత ప్రాముఖ్యత గల దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటి.

నరేంద్రస్వామి దేవాలయం
నరేంద్రస్వామి దేవాలయం is located in ఆంధ్రప్రదేశ్
నరేంద్రస్వామి దేవాలయం
నరేంద్రస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:బాపట్ల జిల్లా
ప్రదేశం:పెదపులివర్రు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నరేంద్రస్వామి దేవాలయం

స్థల పురాణం

మార్చు

పూర్వం ఇదంతా దట్టమైన అడవిలా ఉండేది. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఇక్కడి ప్రశాంతతకి మెచ్చి శ్వేత శివలింగ ప్రతిష్ఠ చేశాడు.తరువాత వ్యాపఘ్రపాదుడనే ఋషీశ్వరుడు ఈ కృష్ణా నదీ తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నారద ప్రతిష్ఠితమైన శ్వేత శివలింగాన్ని ఆరాధిస్తుండేవాడు. కంచిలోని వరదరాజ స్వామి ఈయన ఇలవేల్పు ప్రతీ రోజూ యోగ మార్గంతో మనోవేగంతో కంచికి వెళ్ళి వరదుని దర్శించి ఈ ఆశ్రమానికి వచ్చేవాడు. ఒకసారి వర్షం కుండపోతగా కురుస్తున్నా లెక్కచెయ్యక నియమానికి లోపం రానివ్వకుండా లింగార్చన జరిపి ఆ పెనుగాలిలోనే కంచి వరదుని చేరి సేవించడానికి వెళ్ళాడు. అప్పుడు స్వామి వారిని తన ఆశ్రమంలో ఈ స్వరూపంలో ఆవిర్భవించమని వేడుకున్నాడు. భక్త వత్సలుడైన స్వామి అనుగ్రహించాడు. మరునాడు వ్యాప్రపాదుడు కృష్ణవేణిలో స్నానం చేస్తుండగా అలలపై వరదరాజస్వామి విగ్రహం కొట్టుకొస్తూ కన్పించింది. ఆదృశ్యం చూసిన అతను సంతోషంతో నారదునిచే ప్రతిష్ఠితమైన శ్వేతలింగానికి ఎదురుగా, తూర్పు భాగాన ప్రతిష్ఠ చేసి ఈ క్షేత్రాన్ని హరిహర ఆవాసం చేసి ఆరాధించాడు. ఒకప్పుడు మౌద్గల్య మహాముని శాపగ్రస్తుడై మపశివ్యాధి పీడితుడై భార్యప్రాతివ్రత్యం చేత లభించిన. దివ్య విమానంలో తిరుగుతూ ఆశ్రమ ప్రాంతంలో సతీసమేతుడై క్రీడిస్తుండగా వ్యాప్రపాదముని అపహాస్యం చేశాడు.దీనికి కోపగించి నామసార్థకంగా (వ్యాఘ్రం) అవుతావని శపించాడు ఈ శాపం వినివ్యాఘ్ర పాదుడు ప్రశాంత చిత్తంతో శాప విమోచనం ఎలా అని అడుగగా రాబోయే కాలంలో పాండవ వంశజులైన రాజరాజ నరేంద్రుని బాణప్రయోగం వల్ల విమోచనం కలుగుతుందని మౌద్గల్యుడు చెప్పాడు మౌద్దల్యుడు వ్యాఘ్రపాదుడు పులి రూపుడై పూర్వజన్మ వాసన చేత కొంత కాలం ఈ ఆశ్రమంలోనే నివాసం వుంటూ రాజరాజ నరేంద్రుని కోసం నిరీక్షించాడు. పూజలు లేకపోవడంతో ఇక్కడ శ్వేతలింగ స్వామిపై పుట్ట పెరిగిపోగా వ్యాప్రరూపంలో వున్న ఋషి ప్రదక్షిణలు చేసేవాడు. కలియుగం ప్రారంభమై రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్ర వరం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. ఆ రోజుల్లో ఈ వ్యాప్రపాదుడు తనశాపవిమోచనం కోసం యోగ బలంచేత సూక్ష్మ రూపంలో ఇతరులకు కన్పించకుండా రాజుకి మాత్రమే కన్పించాడు. రాజరాజ నరేంద్రుడికి ఆ సూక్ష్మరూపం అవగతం గాక తనగురువైన శ్రీ కాశీనాధయ్యకు చెప్పాడు.ఆయన శరభ, సాళువ యంత్రంతో రాజభవనాన్ని దిగ్భంధం చేశాడు. ఆ వ్యాఘ్రం పూర్వంలా రాజ సన్నిధికి వెళ్ళలేక, మహర్షి అయినందున కారణం తెలుసుకుని కాశీ నాధయ్యకే కన్పించాడు. విషయం వివరించి తన శాపవిమోచనం కోసం రాజుని ప్రార్థించమని కోరాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం రాజు మృగయావినోదంగా వ్యాప్రంపై బాణం వేశాడు. వెంటనే మహర్షి పూర్వరూపం పొంది రాజరాజ నరేంద్రునితో నీవల్ల నాకు ఉపకారం చాలా జరిగింది. నీవు ఈ అరణ్యాన్ని ఛేదించి ఇక్కడ నారద ప్రతిష్ఠిత మైన శ్వేత లింగాన్ని, వరదరాజ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించి అక్కడే ఓ పట్టణం నిర్మించమని, అది అన్ని విధాల రాజుకి శుభం చేకూరుస్తుందని చెప్పాడు వ్యాఘ్రపాదునికి నివాసమైన ఆయన వల్ల నిర్మాణమైన ఈ క్షేత్రం వ్యాఘ్ర పాదక్షేత్రమై కాలక్రమంలో ఆంధ్రీకరింపబడి పులివర్రుగా మారింది రాజారాజనరేంద్రుని చేత పునరుద్ధరింపజేయ బడిన ఈ శివలింగానికి నరేంద్ర స్వామిగా పేరు వచ్చింది.[1]

మూలాలు

మార్చు
  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004.