పెదపులివర్రు (భట్టిప్రోలు)
పెదపులివర్రు, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన భట్టిప్రోలు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది.
పెదపులివర్రు (భట్టిప్రోలు) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°5′16.37″N 80°49′39.61″E / 16.0878806°N 80.8276694°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | భట్టిప్రోలు |
విస్తీర్ణం | 15.62 కి.మీ2 (6.03 చ. మై) |
జనాభా (2011) | 5,578 |
• జనసాంద్రత | 360/కి.మీ2 (920/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,772 |
• స్త్రీలు | 2,806 |
• లింగ నిష్పత్తి | 1,012 |
• నివాసాలు | 1,807 |
ప్రాంతపు కోడ్ | +91 ( 91-8648 ) |
పిన్‌కోడ్ | 522257 |
2011 జనగణన కోడ్ | 590431 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1807 ఇళ్లతో, 5578 జనాభాతో 1562 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2772, ఆడవారి సంఖ్య 2806. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2781 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 85. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590431.[1].
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5473. ఇందులో పురుషుల సంఖ్య 2753, స్త్రీల సంఖ్య 2720,గ్రామంలో నివాస గృహాలు 1559 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1562 హెక్టారులు.గ్రామ చరిత్ర
ఈ గ్రామం కాకతి గణపతి కాలం నుండి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. సా.శ. 1220లో ఈ గ్రామంలో ఉన్న నరేంద్రేశ్వర మహాదేవుడి గుడికి వెలనాటి చోడుడు దానాలు చేసినట్లు శాసనం ఉంది. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న భట్టిప్రోలు సా.పూ.3వ బౌద్ధ మతస్థులతో కళకళలాడుతూ ఉండేది. ఈ గ్రామంలో 37 జనావాసాలుఉండేవి. ఇవి కొంతకాలం ఒక మహాగ్రహారంగాను, తురుష్కుల కాలంలో 47 గ్రామాలకు కసుబా కేంద్రంగాను విలసిల్లింది. జనావాసాలు స్వతంత్ర పంచాయతీలుగా ఏర్పడిన తరువాత, ఈ గ్రామం కింద 7 శివారు (ఉపగ్రామాలు) ఉన్నవి:-
- గ్రామ హరిజనవాడ
- జిలుగువారిపాలెం
- అక్కివారిపాలెం
- పెదపాలెం
- కోళ్ళపాలెం
- గుత్తావారిపాలెం
- గొరిగపూడి
- ఇందులో గొరిగపూడి స్వతంత్ర పంచాయతీయైంది. మిగిలిన 6 శివార్లు నేటీకిని ఈ గ్రామంలోనేయున్నవి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చుఇక్కడి స్థలపురాణం ప్రకారం పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అనే మహర్షి ఇక్కడ ఆశ్రమం కల్పించుకుని పగలు తపోనిష్టలో ఉండి సాయంకాలం కంచికి వెళ్లి వరదరాజస్వామిని దర్శించుకుని తిరిగి ఉషఃకాలానికి ఇక్కడికి చేరుకునేవాడు. ఈ గ్రామం కృష్ణానది తీరంలో ఉంది. సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల తుఫాను వచ్చి ఒకసారి అతని నియమానికి భంగం వాటిల్లింది. వ్యాఘ్రపాదుని తపోనిష్ఠ వల్ల వరదరాజస్వామి విగ్రహం కొట్టుకొని వచ్చి కృష్ణాతీరంలో చేరింది. దానిని కొంతకాలం తరువాత పడమట దిశగా ప్రతిష్ఠ చేశారు. మౌద్గల్య మహర్షి కుష్టువ్యాధితో విమానంలో ఈ ప్రాంతం పైన వెళ్తున్నప్పుడు వ్యాఘ్రపాదుడు ఆ మహర్షిని కుష్టురోగపు వాడా అని హేయభావంతో సంబోధించడంతో మౌద్గల్యుడు కుపితుడై ఇతడిని వ్యాఘ్రమై పుట్టమని శపిస్తాడు. వ్యాఘ్రపాదుడు శాపాంతాన్ని కోరగా రాజమహేంద్రపు రాజు వేటాడటానికి వచ్చినప్పుడు అతని బాణం తగిలితే యథారూపం వస్తుందని మౌద్గల్యుడు చెబుతాడు. అదేవిధంగా రాజరాజ నరేంద్రుడు తన గురువైన కాశీనాథయ్యను సంప్రదించి ఈ ప్రాంతంలో వ్యాఘ్రరూపంలో సంచరిస్తున్న ఆ ఋషికి బాణాహుతి వల్ల అసలైన రూపాన్ని కలుగజేస్తాడు. అప్పటి నుండి ఈ గ్రామాన్ని వ్యాఘ్రపురిగా పిలవడం ప్రారంభించారు. అదే కాలక్రమేణ పెదపులివర్రుగా రూపాంతరం చెందింది[2].
గ్రామ భౌగోళికం
మార్చుసమీప గ్రామాలు
మార్చుఈ గ్రామానికి సమీపంలో గొరిగపూడి, పెసర్లంక, వెల్లటూరు, పల్లెకోన, కారుమూరు గ్రామాలు ఉన్నాయి.
ప్రస్తుత హద్దులు
మార్చుతూర్పు: కృష్ణానది; దక్షిణం: కారుమూరు; పశ్చిమం: భట్టిప్రోలు; ఉత్తరం: వెల్లటూరు.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి భట్టిప్రోలులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోను, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చుఈ పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ నాదెళ్ళ వెంకటకృష్ణారావు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ దాసరి వేణునాథబాబు ఆధ్వర్యంలో, ఈ పాఠశాలలో ఒక లక్ష రూపాయల వ్యయంతో సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. [5]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
మార్చు1958లో ప్రారంభించిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 64 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. వసతి సరిపోక కొన్ని సమయాలలో చెట్లక్రిందనే విద్యాబోధన చేయవలసిన పరిస్థితి. పూర్వ విద్యార్థులు పాఠశాలకు కంపూటర్లను బహుకరించగా, వాటి నిర్వహణకు గదులు సరిపోవుటలేదు. గ్రామానికి చెందిన శ్రీ పులిగడ్డ కుటుంబరావు, 25 సెంట్ల భూమిని ఆటస్థలానికి విరాళంగా అందజేసినారు.దాతల సహకారం ఉన్నది కానీ, ప్రభుత్వ సాయమే శూన్యం.[2]
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుపెదపులివర్రులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుతాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మార్చుగ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుపెదపులివర్రులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. మొబైల్ ఫోన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో వాణిజ్య బ్యాంకు (కార్పొరేషన్ బ్యాంకు) ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చుపెదపులివర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 211 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 4 హెక్టార్లు
- బంజరు భూమి: 4 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1342 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 25 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1320 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుపెదపులివర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 1232 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 88 హెక్టార్లు
గ్రామ పంచాయతీ
మార్చుగ్రామానికి చెందిన ప్రముఖులు
మార్చు- సముద్రాల రాఘవాచార్య (సముద్రాల) -తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు.[3]
- కె.విశ్వనాధ్ - ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ స్వగ్రామం పెదపులివర్రు.అతని చిన్నతనం ఈ గ్రామంలో గడవడమే కాక ఇక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు.[3]
- ఘంటసాల వెంకటేశ్వరరావు:- సంగీత ప్రపంచంలో తనకంటూ కొన్ని పేజీలు ఏర్పరచుకున్న ఘంటసాల వెంకటేశ్వరరావు , ఈ ఊరిలో కొంతకాలం పాటు నివాసమున్నారు. ఈ ఊరిలోని శివాలయంలో 15 సంవత్సరాలు అర్చకత్వం చేశారు.
- కనగాల కుటుంబరావు, కమ్యూనిస్టు నాయకుడు, కార్మిక నేత.
- సముద్రాల రామానుజాచార్య
- డాక్టర్ మాకినేని త్రిపురసుందరి
గ్రామ విశేషాలు
మార్చు- ఈ గ్రామంలో 1921లో స్థాపించబడిన పురాతాన గ్రంథాలయం బాలగంగాధర తిలక్ పుస్తకాలయం ఉంది.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ వరదరాజస్వామివారి ఆలయం
మార్చుఇక్కడి స్థలపురాణం ప్రకారం పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అనే మహర్షి ఇక్కడ ఆశ్రమం కల్పించుకుని పగలు తపోనిష్టలో ఉండి సాయంకాలం కంచికి వెళ్లి వరదరాజస్వామిని దర్శించుకుని తిరిగి ఉషఃకాలానికి ఇక్కడికి చేరుకునేవాడు. ఈ గ్రామం కృష్ణానది తీరంలో ఉంది. సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల తుఫాను వచ్చి ఒకసారి అతని నియమానికి భంగం వాటిల్లింది. వ్యాఘ్రపాదుని తపోనిష్ఠ వల్ల వరదరాజస్వామి విగ్రహం కొట్టుకొని వచ్చి కృష్ణాతీరంలో చేరింది. దానిని కొంతకాలం తరువాత పడమట దిశగా ప్రతిష్ఠ చేశారు.
నరేంద్రేశ్వర మహాదేవ ఆలయం
మార్చురాజరాజనరేంద్రుని గురువైన కాశీనాథయ్య తన రాజుచే ఇక్కడ వల్మీకంలో ఉండే శివలింగాన్ని వెలికి తీయించి దానిని తూర్పుదిశలో పునఃప్రతిష్ఠ చేయించి దానికి రాజరాజ నరేంద్రుని పేరు పెట్టాడు. కొదమంచిలి వారిని, ఘంటశాల వారిని అర్చకులుగా ఏర్పాటు చేశాడు. వల్మీకాన్ని తవ్వి తీస్తున్నప్పుడు శివలింగం మీద దెబ్బతగిలి కాస్త పల్లం ఏర్పడింది. వెలనాటి చోడుని కాలం నుండి ఈ ఆలయాన్ని నరేంద్ర మహాదేవుడి ఆలయంగా పిలుస్తున్నారు[2]. తరువాతి కాలంలో అమ్మవారి విగ్రహం, కుమారస్వామి విగ్రహం నదిలో కొట్టుకు వస్తే వాటిని ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. అమ్మవారి పేరు బాలాత్రిపురసుందరి. కుమారస్వామి విగ్రహంలో విశేషమేమిటంటే ఎండాకాలంలో ఆ విగ్రహంపైన చెమట బిందువులు కనిపించి ధారగా క్రిందకు ప్రవహిస్తాయి[2]. అమ్మవారి ఆలయంలో ఉత్తరదిశలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వెలిసాడు.
- పై దేవాలయాల చరిత్ర, మైసూరు, బెంగుళూరు నగరాలలో తాళపత్ర గ్రంథాలలో లిఖించియుందని, ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో ఐ.జి.గా పనిచేయుచున్న అక్కివారిపాలెం గ్రామస్థులు కె.రామచంద్రరావు, 2015,అక్టోబరు-1వ తేదీనాడు, ఈ ఆలయాలను దర్శించినప్పుడు పేర్కొన్నారు.
శ్రీ గోగులమ్మ తల్లి ఆలయం
మార్చుఈ ఆలయాన్ని ప్రముఖ భూతవైద్యుడు కాశీనాథుని కనకయ్య నెలకొల్పాడు. వర్షాభావం ఏర్పడినప్పుడు ఈ శక్తి విగ్రహానికి సహస్ర ఘటాభిషేకం చేస్తే వర్షాలు పడతాయి అని ఒక నమ్మకం[2]. పెదపులివర్రు గ్రామదేవత శ్రీ గోగులమ్మ తల్లి వార్షిక తిరునాళ్ళు, 2017,ఏప్రిల్-10వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి కృష్ణానదీ పుణ్యస్నానం చేయించి, తప్పెట్లతో గ్రామంలో ఊరేగించి, భక్తుల నుండి హారతులు స్వీకరించారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా పేరుగాంచడంతో పెదపులివర్రు గ్రామ పరిసర ప్రాంతాల గ్రామాలలోని మహిళలు, భక్తులు పొంగళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్కి చేసిన అలంకారం భక్తులు ఎంతగానో అలరించింది.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
మార్చు- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ 2.0 2.1 2.2 2.3 ములుగు, కుమారస్వామి (20 October 1979). "వేదవిద్యల వ్యాఘ్రపురి పెదపులివర్రు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 198. Retrieved 30 December 2017.[permanent dead link]
- ↑ 3.0 3.1 "మొదటి సినిమా-కె. విశ్వనాథ్, నవతరంగంలో". Archived from the original on 2015-08-26. Retrieved 2015-08-22.