నరేష్ కుమార్ సూఫీ

(నరేష్కుమార్ సూఫీ నుండి దారిమార్పు చెందింది)

నరేష్కుమార్ సూఫీ, కవి సంగమం రచయితలలో ఒకరు. ఈయన రచనలు, వ్యాసాలు ఈ మాట, వన్ ఇండియా, భూమిక, సారంగ, అవని న్యూస్, రస్తా మొదలైన ఆన్ లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అలాగే పలు పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు.

నరేష్కుమార్ సూఫీ
జననంగోదావరిఖని
ప్రసిద్ధికవి, వ్యాస రచయిత

నరేష్కుమార్ గోదావరిఖని ప్రాంతంలో పుట్టారు. ప్రస్తుతం టీ10 మీడియా హౌస్‌లో పనిచేస్తున్నారు.

‘కవి సంగమం’ ఇతని తొలి కవిత్వ పాఠశాల.

వ్యాసాలు

మార్చు
  •  
    జాతీయ స్థాయి కవులచే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో (2018) నరేష్కుమార్ సూఫీకి మామిడి హరికృష్ణ సత్కారం
    ఉద్యమ కవితా శివసాగరం
  • బహుజన వాదానికి సాహిత్య "కుర్చీ"
  • ఆమెలో నేను
  • కొన్ని కథలు, ఒక అస్తిత్వమూ
  • ప్రజలే చరిత్ర నిర్మాతలు
  • తీగల'చింతనం' (యాకూబ్ రచనపై సమీక్ష)

కవిత్వం

మార్చు
 
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో తన కవిత్వాన్ని చదువుతున్న నరేష్కుమార్ సూఫీ

సూఫీ 2019లో "నిశ్శబ్ద" పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించారు. "‘‘కవి కడుపుతో ఉంటాడు, కవిత్వాన్ని కంటాడు, కవిత రాయటం ఓ అద్భుతం, నాలో రగిలే అగ్గిని ఈ సమాజం మీదికి వెలుగులా విసురుతున్నా... బ్లా బ్లా బ్లా! యేమో, నేనెప్పుడూ కవిత్వాన్ని పెద్దగా ప్రేమించలేదు, కవిత్వం రాయటాన్ని అద్భుతంగా ఫీలవ్వలేదు కూడా. రాయటం అంటే సమాజం, సాహిత్య ప్రయోజనం అన్నాడూ అంటే యెందుకో జాలి అనిపిస్తుంది. నా వరకూ కవిత్వం వొక సెల్ఫ్‌ వామిట్, అదొక సొంత విషయం. అయితే కొన్నిసార్లు రాసినవాడి ఫీల్‌ చాలామందిలో ఉన్నప్పుడు, రాసిన కాలపు పరిస్థితులే మళ్లీ మళ్లీ రిపీట్‌ అయ్యి సార్వజనీనం అవ్వొచ్చు" అని ఈ సంపుటిలో సూఫీ తన భావాలను వ్యక్తపరిచారు.

రచనల నుండి మచ్చుతునక

మార్చు
poem of thirsty times
ఇక్కడ ఇప్పుడు కొద్దిగా నిశ్శబ్దం మిగిలి పోయింది
ఆమె వెల్లిపోయాక
ఇంకా కొద్దిగా తన పరిమళమేదో నన్నంటుకున్నట్టు
ఈ నిశ్శబ్దపు రాతిరి వేళ
తనతో చెప్పాలనుకున్నదేదో ఇప్పుడిలా
పలవరిస్తో……
babe..! Need some more From you
బతుక్కీ, జీవితానికి మధ్య ఉన్న
Flavor of life,
ఇవ్వనూ లేవు, కాదని చెప్పనూ లేవు
మరి నేనేమో
నీ శ్వాసల కోసం తేలియాడే నీటి మబ్బునై
వర్షించాలనీ, ప్రవహించాలనీ మరిచిపోయిన
ఒకానొక నిశ్శబ్ద ప్రవాహాన్ని
Yes now iam a baby who is on death bed
నిజాలనంగీకరించలేకా, అబద్దాలని నమ్మలేకా
నీ రొమ్ము పాలకై ఏడ్చే పసిబిడ్డనై
నీ దిగంత మేఖలల నడుమ సంచరించే
ఒంటరి సంచారిని…
Let me drown in you
నన్ను నీలో కలుపుకో, నన్ను నీలో దాచుకో
నన్ను నీవై పోనివ్వు
పెదాలపై నవ్వులు మోసుకు తిరిగే సీతాకోక
ఓ నల్లని చందమామపిల్లా!
ఎవరో అడుగుతారు నువ్వెవరని నన్ను
ఈ మహా దిగ్మండలానికి విశ్వమిచ్చిన బహుమతని చెబుతాను…
ఎవ్వరూ గుర్తించనే లేదు గానీ….
వేల ఏళ్లుగా ఇక్కడ జీవిస్తూనే ఉన్నావు నువ్వు
Like a baby of moon
ఎవరూ గుర్తించకుండానే ఈ ఎడారి భూముల మీద
ఆ పసిపాదాలతో నేలతో ముచ్చటిస్తున్నావు
Oh my dear little angel …!
ఎవ్వరూ చెప్పరు నీకు
నీవు ఈ భూమికి బహుమతిగా వచ్చావన్న రహస్యాన్ని
దేహమంతా నెత్తుటి గాయాల మీద
నవ్వునవ్వుల ఘోషాలో నువ్వు తిరుగాడుతున్నప్పుడు
ఓ చిన్నారి దేవదూతా..! నేను నిన్ను చేరుకుంటాను
చుక్కలని మోసే ఆకాశం కింద
నిన్ను, చీకటిని జోకొట్టి నిద్రపుచ్చి నీనుంచి నేను
మాయమైపోతాను
తెల్లవారి నువు కనులు తెరిస్తే….
నీ కన్నులమీద రెండు ప్రశ్నల ముద్రలు
నీ చుట్టూ వాలుతున్న సీతాకోకచిలుకలు
With a sound of heart beat around you in morning breeze
ఇప్పుడు ప్రశ్నించుకో నిన్ను నువ్వు
నువ్వెవరనీ?
ఇంకా నేనెవరనీ కూడా….
* సారంగలో ప్రచురణ[permanent dead link]

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.